బీసీలకోసం గళమెత్తుతున్న తీన్మార్‌ మల్లన్న

నేడు వరంగల్‌లో బీసీల సభ

కులాల మధ్య పొత్తులుంటేనే బీసీల ఐక్యత సాధ్యం

జనం వుంటే ఏం లాభం? పదవులకు దూరం!

అధికారం ఒకరిచ్చేది కాదు…సాధించుకునేది

బీసీలు తమ సామర్థ్యం తెలుసుకోవాలి

సామర్థ్యం, వనరులు పెంచుకుంటే రాజ్యాధికారం బీసీలదే

వెనుకబడిన తరగతుల వారికే రాజ్యాధికారం రావాలన్న లక్ష్యంతో తన రాజకీయ పోరాటాన్ని తీన్మార్‌ మల్లన్న తాను ఏ పార్టీలో వున్నా బీసీల వాణిని వినిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వరంగల్‌లో ఫిబ్రవరి 2న బీసీల సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు రెండు నుంచి మూడులక్షలమంది హాజరు కాగలరని నిర్వాహకుల అంచనా. బీసీల ఐక్యత కోసం తీన్మార్‌ మల్లన్న మొదట్నుంచీ కృషి చేస్తున్నారు. బీసీలు కలిసిపోతే రాజ్యాధికారం సాధించవచ్చునన్నది ఆయన దృఢ విశ్వాసం. ఈదిశగానే ఆయన బీసీల్లో వున్న అనేక కులాలవారిని ఒక్కతాటి మీదకు చేర్చి రాజ్యాధికారాన్ని ఈ వర్గాలకు వచ్చేలా చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఇందుకోసంఆయన అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని సేకరించి బీసీల సాధికారతో కోసం అలుపెరుగ కుండా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీసీల కులాలవారీగా జనసంఖ్యను వివరిస్తూ వారి బలమెంతో తెలియజేసేందుకు యత్నిస్తున్నారు. కులాలుగా విడిపోవడం కాదు, అంతా ఒక్కటై పోరాటం చేయాలని తెలంగాణలో నిర్వహించే సభల్లో ఆయన బీసీలకు పిలుపునిస్తున్నారు. బలమైన వర్గంగా వున్న బీసీలు, ఓసీల్లోని పేదలను కూడా ఆదుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం ఆయనలోని విశాల భావాన్ని తెలియజేస్తోంది.

ఇక తెలంగాణ జనాభా విషయానికి వస్తే 2024 జులై 1 నాటికి మొత్తం తెలంగాణ జనాభా 3.83 కోట్లు. 2016 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల మొత్తం జనాభా 18159732 మంది. వీరిలో బీసీ(ఎ) గ్రూపు మొత్తం జనాభా 3040376 కాగా బీసీ(బి) గ్రూపుకు చెందినవారు 5602786, బీసీ(డి) గ్రూపు 6635939 మంది వున్నారు. ఈవిధంగా జనాభా పరంగా బలీయంగా వున్న బీసీలకు తమ సొంత బలాన్ని తెలియజేస్తూ, రాజకీయాలను శాసించాలని ఆయన గట్టి పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రధాన డిమాండ్‌ బి.సి.లకు 42శాతం రిజర్వేషన్‌ వర్తింపచేయాలని. ఎప్పటికైనా బీసీలకే రాజ్యాధికారం దక్కు తుందన్న ప్రగాఢ విశ్వాసం ఆయనది. జనాభాలో అంతపెద్ద సంఖ్యలో బీసీలున్నప్పుడు వారికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించేది కేవలం రూ.50 కోట్లంటే ఇదేమైనా ముష్టి వేస్తున్నట్టా? అని ఆగ్ర హంగా ప్రశ్నిస్తారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9వేల కోట్లు కేటాయించాలనేది ఆయన ప్రధాన డిమాండ్‌. గత ఏడాది కాజీపేటలో జరిగిన బి.సి.ల శంఖారావం సభల్లో ఆయన మాట్లాడు తూ 42శాతం రిజర్వేషన్‌ సదుపాయాన్ని కల్పించకపోతే వెనుకబడిన వర్గాల వారి ఆధ్వర్యంలో పెద్ద భూకంపమే సృష్టిస్తానని హెచ్చరించారు. కేవలం బీసీల ఓట్లతోనే తాను గెలిచానన్న సంగతి గుర్తుచేశారు. అంతేకాదు బలమైన వర్గాలుగా వున్న బీసీలు, ఓసీల్లోని నిరుపేదలపై కూడా దృష్టిపెట్టాలని ఆయన ఉద్దేశం. కులాలవారీగా బీసీల ఓట్లు చీలిపోయిన నేపథ్యంలో, ఈ కులాలమ ధ్య పొత్తులు కుదరాలి. ఆవిధంగా పొత్తు కుదిరిన తర్వాత బీసీ కులాలన్నింటిలో ఉన్న వివిధ నిపుణులతో కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని తీన్మార్‌ మల్లన్న ఆకాంక్ష. ముఖ్యంగా వెనుకబడిన అన్ని కులాల మధ్య పొత్తు కుదిరితే అవి బలమైన వర్గంగా మారి రాజకీయాలను శాసించగలు గుతాయి. ఇప్పటివరకు ‘మేమెంతో మాకంత’ అనే దశనుంచి ‘మీరెంతో మీకంత’ అని ఓసీలకు చెప్పే స్థాయికి బీసీలు ఎదగాలి. అంటే జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా ఎంతో స్పష్టమైంది. ఓసీలు, ఎస్సీలు, ఎస్సీలు కలిసి పావు షేరు వుంటే, మిగిలినవారంతా బీసీలే. అందుకనే ‘మీరెంతో మీకంత’ అనేది! బీసీల ఉద్యమంపై ఏ ఒక్క రాజకీయపార్టీ నోరు మెదపడానికి భయపడుతున్నదంటే, ఈ ఉద్యమం ఎంత బలంగా ఉన్నదో అర్థం చేసుకోవాలని మల్లన్న అంటా రు. ఉద్యమం బలంగా వుంటేనే ఎవ్వరూ నోరెత్తరనేది ఆయన అభిప్రాయం.

బీసీలకు ఏవిధంగా అన్యాయం జరుగుతున్నదో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉదాహరణగా తీసుకొని వివరించిన విధం విశ్లేషణాత్మకంగా వుండటం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9,42,312 మంది బి.సి. జనాభా వుంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు. అదే 2,97,659 ఓసీలుంటే వారికి మూడు సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అసలు ఇంతమంది బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి సీట్లెందుకు కేటాయించలేదు? గెలవడం గెలవకపోవడం తర్వాతి ముచ్చట. ఇది అన్యాయం కదా. అంటే రాజకీయ పార్టీలు కొంతమంది తమకోసం పెట్టుకున్నారు కనుక బీసీలకు సీట్లు ఇవ్వలేదు. అసలు వీరి సంగతే వాళ్లకు పట్టదు. అదీకా కుండా మనం ఎన్నికల్లో పార్టీ గుర్తులకు మాత్రమే ఓటేస్తాం. అందువల్ల మనకు బీసీల సంఖ్య, బలం, జనాభా అనే సంగతులు మనకు తెలియవు. ఇదీ ఆయన విశ్లేషణ.

నాయీ బ్రాహ్మణుల చరిత్ర

1947ా2024 మధ్యకాలంలో నాయీ బ్రాహ్మణుల (మంగలి)కు చెందిన వారు ఎవ్వరూ మండలి, అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికవలేదు! అసలు వాళ్లకు అవకాశం కల్పిస్తేనే కదా? సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల జనాభా 309798. వీరిజనాభాలో సగం కంటే తక్కువ జనాభా వున్న వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి వెళ్లారు. ఇ దేం విచిత్రం! తక్కువ జనాభా ఉన్న జాతులు క్రమంగా అంతరించి పోతాయన్నది అంబేద్కర్‌ సి ద్ధాంతం. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. నిజానికి నాయీ బ్రాహ్మణుల రాజ్యపాలన చరిత్ర క్రీ.పూ.362నాటిది. అదే సంవత్సరంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి నాయీ బ్రాహ్మణుడే. ఆయన పేరు మహాపద్మానందుడు. ఆయన చక్రవర్తి ఎట్లా అయ్యాడంటే శిశునాగులు పరిపాలిస్తున్న కాలంలో వారికి క్షవరం, వైద్యపరమైన సపర్యలు చేయడానికి ఈ మహాపద్మనందుడు వుండేవాడు. ఈయన్ను శిశునాగులు ప్రతిరోజు అవమానించారు. చివరకు ఈ అవమానం భరించలేక తనవద్దనున్న కత్తితో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాడు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకొని, చుట్టుపక్కల రాజులను ఓడిరచి చక్రవర్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా డు. ఆయన వద్ద లక్షకోట్ల కిలోల బంగారం వుండేదట. దాన్ని గంగానది గర్భంలో దాచిపెట్టాడన్నది చారిత్రక కథనం. కరీంనగర్‌ జిల్లా రామడుగు వద్ద ఇటీవల ఒక పు రాతన విగ్రహం బయటపడిరది. ఇది మహాపద్మనందుడి కాలం నాటిది. అటువంటి చరిత్ర నా యీ బ్రాహ్మణులది. స్వాతంత్య్రానికి పూర్వం వీరిని ఎస్సీ వర్గంగా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం గు ర్తించింది. స్వాతంత్య్రానంతరం వీరిని జనరల్‌ కేటగిరీలోకి చేరిస్తే, అనంతరామన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు వీరిని బీసీాఎ గ్రూపులో కలిపారు. ఇదీ వారి చరిత్ర. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిది ఒక నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన నాయీబ్రాహ్మణుడు. మరి మన తెలంగాణలో మంగలివారి పరిస్థితేంటి?

ప్రతి కులంలో ప్రతిభ అనేది దాగివుంటుంది. అటువంటి వారిని వెలికి తీసి ప్రాధన్యత ఇస్తే త ప్పక పైకొస్తారు. కానీ అగ్రకులాలు బీసీలను ఎదగనీయకుండా చేయడంతో వీరిలోని ప్రతిభ అణగారిపోయింది. తమ సామర్థ్యం తాము తెలుసుకోలేని దుస్థితికి దిగజారారు. ఈ దీన స్థితినుం చి బయటపడి, రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం, అందుకు అవసరమైన సామర్థ్యాన్ని, వనరులను పెంపొందింపజేసుకోవడం బీసీల తక్షణ కర్తవ్యమని తీన్మార్‌ మల్లన్న వారిలో చైతన్యాన్ని ఉద్దీప్తం చేస్తున్నారు. ఒక గట్టి బీసీ నేతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తు న్నారు. మరి బీసీల రాజ్యాధికార సాధనలో ఆయన ఎంతవరకు కృతకృత్యులవుతారన్నది కాలమే నిర్ణయించగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!