`కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధికారిక ప్రకటన
`ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ నరేందర్ రెడ్డికి పోటీ అసలే కాదు
`ఆరు నెలల నుంచే నరేందర్ రెడ్డి విసృత ప్రయత్నాలు
`పార్టీ అధిష్టానంతో గతంలోనే చర్చలు
`అధిష్టానం సూచన మేరకే రంగంలోకి దిగిన నరేందర్ రెడ్డి
`పట్టభద్రుల ఎన్‌రోల్ మెంట్‌లో అందరికంటే ముందున్నారు
`ఈ ఏడాదిలోనే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నరేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశం
`ప్రభుత్వం మీద పట్టభద్రులలో మరింత నమ్మకం
`నరేందర్ రెడ్డి కి ఉద్యోగాల కల్పన బాగా కలిసొచ్చే అంశం
`నరేందర్ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులే లక్షల్లో వుంటారు
`వాళ్లంతా నరేందర్ రెడ్డి నాయత్వాన్నే బలపరుస్తారు
`నాలుగు ఉమ్మడి జిల్లాలలో అత్యధిక శాతం పట్టభద్రులు కరీంనగర్ జిల్లాలోనే వున్నారు
`తెలంగాణలో విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు
`కరీంనగర్‌లో అందరికీ సుపరిచితులు
`విద్యా వ్యవస్థపై పూర్తిగా పట్టున్న విద్యా వేత్త
`నిరుద్యోగ సమస్యలపై పూర్తి అవగాహన వున్న వ్యక్తి
`ఏ రకంగా చూసినా గెలిచేందుకు అన్ని రకాల దారులున్న నాయకుడు
`పార్టీలకతీతంగా వ్యక్తిగతంగా అందరివాడు
`ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు
`ఇతర అభ్యర్థుల కన్నా ముందున్నారు
`ఇతర పార్టీల అభ్యర్థుల ఎవరూ నరేందర్ రెడ్డికి సమీపంలో వున్నట్లు కూడా లేదు
`నరేందర్ రెడ్డి విజయం ముందే నిర్ణయం జరిగినట్లే అని చర్చించుకుంటున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్దిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆల్‌ఫోర్స్ విద్యా సంస్దల అదినేత డాక్టర్. వి. నరేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పాఈ్ట అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు అనువైన, అనుకూల వ్యక్తిగా నరేందర్ రెడ్డికి పేరుంది. వ్యక్తిగా అందరి తలలో నాలుకలా వుండే నాయకుడు నరేందర్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని ఎంపిక చేస్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ గెలుపు మరింత సునాయాసమౌతుందని నిర్ణయం తీసుకున్నది. అయితే నరేందర్ రెడ్డి పేరు ఇప్పుడు ప్రకటించినా గతంలోనే ఆయనను పార్టీ అధిష్టానం పిలిపించుకొని వివరాలు కనుగొన్నది. ఆయనతో అనేక విషయాలు చర్చించింది. విద్యా రంగం, యువత, నిరుద్యోగ, ఉపాది వంటి అనేక అంశాలపై నరేందర్ రెడ్డికి వున్న అవగాహన చూసి అదిష్టానం మెచ్చి ఎట్టకేలకు ఆయనను ఖరారు చేసింది. విద్యారంగంలో సుమారు 40 సంవత్సరాల విశేష అనుభవం నరేందర్‌రెడ్డికి వుంది. నరేందర్ రెడ్డిని పిలిపించుకున్నప్పుడే గ్రౌండ్ వర్క్ చేయమని అధిష్టానం ఆదేశించింది. దాంతో ఆయన గత ఆరు నెలలుగా విశేషమౌన కృషి చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నా పార్టీ అదిష్టానంపై నమ్మకంతో, అంకితబావంతో పెద్దఎత్తున పట్టభద్రుల ఎన్‌రోల్ మెంట్ నాలుగు జిల్లాలో చేపట్టారు. అందరింటే ముందున్నారు. అంతే కాకుండా నరేందర్‌రెడ్డికి పార్టీపై వున్న అపారం నమ్మకంతో తన ప్రచారాన్ని కూడా ఎప్పుడో ప్రారంభించారు. నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీపెద్దలు, నాయకులు, ఆయా జిల్లాలో వున్న పట్టభద్రులను కలిసి తనను గెలిపించాలని కోరడం జరిగింది. వాళ్లందరికీ రెగ్యులర్‌గా టచ్‌లో వుంటూ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందో కూడా వారిని ఒప్పించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాంతో ప్రచారంలో అందరికన్నా నరేందర్ రెడ్డి ముందున్నారని చెప్పడంలో సందేహం లేదు. పైగా పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా వున్న కరీంనగర్ జిల్లాలో పట్టున్న ఏకైక నాయకుడు నరేందర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఆయన పేరు తెలియని వారు, ఆయన పరిచయం లేని వారంటూ ఎవరూ వుండరు. అంతలా ఆయన పేరు సుపరిచితం. కొన్ని లక్షల మంది ఇప్పటికే ఆయన విద్యా సంస్ధలలో చదువుకొని జీవితాల్లో స్ధిరపడిన వారున్నారు. వాళ్లంతా అనేక రంగాలలో గొప్ప గొప్ప స్ధాయిలో వున్నారు. వాళ్లు ఆయన విద్యార్ధులే. సమాజానికి సేవ చేస్తున్నవారే. అందువల్ల నరేందర్ రెడ్డికి ఆ ఓట్లు ఎంతో కీలకం. ఆ ఓట్లే ఆయన గెలుపును సునాయాసం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఏ అభ్యర్ది నరేందర్‌కు పోటీ కాలేదు. సాటి రాలేరని చెప్పొచ్చు. ఎందుకంట సుధీర్ఘమైన అనుభవం నరేందర్‌రెడ్డికి విద్యారంగంలోనే వుంది. అంటే సమాజమంతా విద్యారంగంతోనే ముడిపడి వుంటుంది. విద్యా రంగ నిపుణులకు సామాజిక సమస్యల మీద వున్నంత అవగాహన ఇతర రంగాలలో వుండేవారికి వుండదు. అందువల్ల రేపటి తరానికి ఏం కావాలి? ఇప్పుడు మన దేశంలో విద్యారంగం ఎలా వుంది? ప్రపంచ దేశాలలో విద్యా రంగ పరిస్దితులు ఎలా వున్నాయన్నదానిపై సంపూర్ణమైన అవగాహన వున్న ఏకైక నాయకుడు నరేందర్ రెడ్డి. అందువల్ల ఆయనకు తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదానిపై అనేక మార్గాలను అన్వేషించగలిగే ఆలోచనలు, ఆచరణలు చూపించగల నాయకుడు నరేందర్‌రెడ్డి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో నిరుద్యోగం ఒక పెద్ద విపత్తు అని చెప్పాలి. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న వారికి కూడా ఉపాది అవకాశాలు తగ్గుతున్నాయి. కారణం మన విద్యా వ్యవస్ధలో వున్న లోపం. మన విద్యా విధానంలో అనేక రకాల, రూపాలలో రకరకాల కోర్సులు వున్నాయి. కాని వాటిపై రాజకీయ నాయకులకు పూర్తి అవగాహన వుండదు. పాలకులతో చర్చించేందుకు వారికి వెసులుబాటు వుండదు. వాటిపై పట్టు వుండదు. కాని విద్యా రంగంలో వున్న నిపుణులైన నరేందర్‌రెడ్డి లాంటి వారికే విద్యా రంగ సమస్యలు, తీసుకురావాల్సిన మార్పులు, ఇప్పటి తరానికి అవసరమైన మార్పులపై సమగ్రమైన అవగాహన ఆ రంగంలో వుండేవారికి మాత్రమే వుంటుంది. విద్యా రంగంలో ఎంతో నిష్ణాతుడైన నరేందర్ రెడ్డిని పట్టభద్రులు ఎన్నుకుంటే పెద్దల సభలో అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం వుంటుంది. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసే అవకాశం ఏర్పతుంది. ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే వెసులుబాటు ఏర్పడుతుంది. విద్యా రంగ నిపుణుడైన నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వీలౌతుంది. ఇక ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే ఆయన ఒకటి రెండు దఫాల ప్రచారం కూడా పూర్తిచేసుకున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే విద్యా రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చేలా, ఎలాంటి వాయిదాల లేకుండ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడేలా చేస్తానని నరేందర్ రెడ్డి మాట ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 55వేలకు పైగా ఉద్యోగాలను ఈ ఏడాది కాలంలోనూ భర్తీ చేసింది. కొత్తగా అనేక నోటిపికేషన్లు కూడా విడుదల చేసింది. ఎంతో మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో పదేళ్లపాటు ఉద్యోగాలు లేక ఎంతో మంది యువతకు ఉపాది కరువైపోయింది. వారి జీవితంలో పదేళ్ల విలువైన సమయం వృధా అయ్యింది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టింది. వెంట వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలలో పెండిరగ్‌లో వున్న ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. అందువల్ల తెలంగాణలో వున్న మొత్తం నిరుద్యోగులు, యువత కాంగ్రెస్ వైపే వున్నారని చెప్పడంలో సందేహం లేదని నరేందర్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నిరుద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సమర్దుడు నరేందర్‌రెడ్డే అని నిరుద్యోగులు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిసిన వెంటనే నిరుద్యోగ సమస్యపై తాను నిరంతరం కృషి చేస్తానని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్ధలలేవైనా వాటిలో పనిచేసే ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కోసం ప్రయత్నం చేస్తానంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే అద్యాపకుల సమస్యలే కాదు, వారికి ఆరోగ్య భీమా అందిస్తానంటున్నారు. ప్రైవేటు రంగాలలో ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలతో కంపనీలు స్ధాపించే పారిశ్రామిక వెత్తలతో మాట్లాడి తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందేందుకు ప్రయత్నం చేస్తానంటున్నారు. ఇలా తెలంగాణ విద్యారంగంలో మరింత ముందుకు సాగేందుకు కృషి చేస్తానని నరేందర్ రెడ్డి చెబుతున్నారు. దాంతో పెద్దఎత్తున యువత నరేందర్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని బలపర్చుతున్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఇతర పార్టీలకు చెందిన ఏ అభ్యర్ది నరేందర్ రెడ్డితో సమానమైన సామాజిక సృహ వున్నవారు కాదు. అందుకే నరేందర్ రెడ్డి ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా పట్టభద్రులు బ్రహ్మరథం పడుతున్నారు. తాము దగ్గరుండి గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇక ప్రచారం విషయంలో కూడా అందరికంటే నరేందర్ రెడ్డే ముందున్నారు. నాలుగు జిల్లాలు కలియ చుట్టేశారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. పట్టభద్రులతో ప్రత్యేకమైన సమావేశాలు ఇప్పటికే అనేకం ఏర్పాటు చేశారు. వారి సమస్యలను సావదానంగా విన్నారు. తాను గెలిస్తే ఎలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారో కూడా చెప్పి, పట్టభద్రులల్లో నమ్మకం నింపారు. అందుకే ఎవరి నోట విన్నా ఒకటే మాట..నరేందర్ రెడ్డిదే గెలుపన్నదే వినిపిస్తున్న చర్చ.