విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్యాకేజీ రాజకీయం

 

రూ.35వేల కోట్లు అప్పులుంటే ఇచ్చిన ప్యాకేజీ ఏమూలకు?

ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వైఖరి సుస్పష్టం

ఇప్పుడిచ్చిన రూ.11440 కోట్ల ప్యాకేజీ ప్రచారానికి తప్ప ఎందుకూ పనికిరాదు

ప్యాకేజీ నిర్ణయంలో చిత్తశుద్ధి లేదు

గనులు కేటాయించి, సెయిల్‌లో కలిపేస్తే అది సరైన చర్య

ఈవిషయంపై ఎవరూ నోరుమెదపరు

యూనియన్‌ నాయకుల ఘోష అరణ్యరోదనే

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల రివైజ్డ్‌ ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంతో, ఇది తాము సాధించిన ఘనతగా చెప్పుకోవడానికి తెలుగుదేశం నాయకులకు గొప్ప అవకాశం లభించింది. ఉక్కు కర్మాగారం విషయంలో జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ రావడం వల్లనే ప్రస్తుత దుస్థితి నెలకొన్నదంటూ తెలుగుదేశం పార్టీ విపరీత ప్రచారం చేసింది. తా ము అధికారంలోకి వచ్చాక స్టీల్‌ ప్లాంట్‌ లాభాల బాటలో నడిచేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం నాయకులు హామీలు గుప్పించారు. మరి పాలనా పగ్గాలు చేపట్టి ఇప్పటికి ఏడు నెలలు ముగిసినా ఏమీ సాధించలేదన్న అపప్రధ మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు పాలనలో ప్రభుత్వ వరుస వైఫల్యాలు వైఎస్‌ జగన్‌ పార్టీకి ఊపిరి పోశాయి. ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి నడుం బిగించారు. ముఖ్యంగా తమను విమర్శించిన అంశాల్లో మీరు సాధించిందేమిటన్న ప్రశ్నలు లేవనెత్తడం మొదలయ్యేసరికి ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిరది. ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ఉచితబస్సు సదుపాయం కల్పించే యోచనలో వున్నదన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ఏమూలకూ సరిపోదన్న సంగతి స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి తెలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ముడిసరుకు సరఫరా దారులకు బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు, పెండిరగ్‌లో వున్న ఉద్యోగుల వేతనాలు, వాలంటరీ రిటైర్మెంట్‌ వంటి వాటికే ఈ మొత్తం సరిపోదని వర్కర్స్‌ యూనియన్లు పెదవి విరుస్తున్నాయి. ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌ రూ.25వేల కోట్ల లోటుతో వుంది. అటువంటప్పుడు కేంద్రం ప్య్రాకేజీ ఏమూలకు? ఇక్కడ అర్థంకావడంలేదా కేంద్రం అసలు ఉద్దేశమేంటో?

నిజం చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరించడానికే కృతనిశ్చయంతో ఉన్నదన్నది స్పష్టం. ఆదిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, విశాఖ ఉక్కును కేంద్రం కాపాడే యత్నాల్లో భాగమే ఈ ప్యాకేజీ అని తెలుగుదేశం నాయకులు ప్రచారం చేసుకోవడానికి తప్ప మరో దానికి పనికిరాదు. అసలు ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలనే ఉద్దేశమే వుంటే కేంద్రం ఈవిధంగా ప్యాకేజీలు ప్రకటించదు. క్యాప్టింగ్‌ మైన్స్‌ను కేటాయించి ఉక్కు కర్మాగారాన్ని ఒడ్డున పడేస్తుంది. మైన్స్‌ కేటాయిస్తే కర్మాగారంపై 75శాతం భారం తొలగిపోయినట్లే. అయితే కార్మిక సంఘాలు మాత్రం మైన్స్‌ కేటాయింపుతో పాటు స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతున్నారు. ఆవిధంగా కోరడంలో యూనియన్ల లక్ష్యాలు వేరుగా ఉంటాయి. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద గుదిబండగా మారిన నేపథ్యంలో కేంద్రం క్రమంగా వాటిల్లో పెట్టుబడులను ఉప సంహరించుకుంటూ వస్తోంది. ఇది కేవలం విశాఖ ఉక్కుకర్మాగారానికే పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న పాలసీలో ఇదికూడా భాగం. కేవలం ‘ప్రైవేటీకరణ’ అనే కారణాన్ని పట్టుకొని ఎవరికి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అంతగా రాజకీయం చేస్తున్నారు తప్ప మరోటి కాదు. గనులు కేటాయిస్తే తప్ప స్టీల్‌ ప్లాంట్‌ మనుగడ వుండదన్నది సాధారణ పౌరుడికకూడా తెలిసిన సత్యం. అసలైన ఈ సమస్యను పక్కన బెట్టి ప్యాకేజీలవల్ల ప్రయోజనం శూన్యం. పరిశీలిస్తే కేంద్రం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని స్పష్టమైన హామీ ఎక్కడా ఇవ్వలేదు. ప్రైవేటీకరించాలని కృతనిశ్చయంతో వున్నప్పుడు దీన్ని సెయిల్‌లో కలిపే ఆలోచనే కేంద్రం చేయదు. సొంత గనులు లేకపోవడంతోపాటు పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలంటే ప్లాంట్‌కు తొమ్మిది ర్యాకుల బొగ్గు అవసరం. కానీ ఆరు ర్యాకుల (సుమారు 100 టన్నులు) బొగ్గు మాత్రమే సరఫ రా అవుతోంది. నక్కపల్లి ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌లో కూడా ఉత్పత్తి మొదలైతే మరో 4`5 ర్యాకుల బొగ్గు అవసరం. ఉన్నది ఒక్కటే రైల్వేలైను. ఈ నేపథ్యంలో ఇన్ని ర్యాకుల బగ్గు సరఫరా దుస్సాధ్యం. 

ప్రస్తుతం కంపెనీలో వెయ్యిమందికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. మరో నాలుగువేల మంది రిటైరవుతున్నారు. కాగా మొత్తం కార్మికుల సంఖ్య 12వేలు. మిగిలిన కార్మికులతో రోజుకు ఏడువేల మిలియన్‌ టన్నుల ఉక్కువ ఉత్పత్తి చేయడం కల్లోమాట! ఇన్ని అవాంతరాలు అడ్డుగా వున్న నేపథ్యంలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ వల్ల ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అధికారంలో వున్న జగన్‌ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. అసెంబ్లీలో తీర్మా నంకూడా చేసింది. ఇన్ని జరిగినా కేంద్రం పట్టించుకోలేదు. ఎందుకంటే దాని లెక్కలు దానివి! 

 ప్రస్తుత కేంద్ర భారీపరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ గత జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిచిపోయిందనడం గమనార్హం. లేకపోతే నూటికి నూరుశాతం పెట్టుబడుల ఉపసంహరణ చేసి, ప్రైవేటీకరించేందుకే కేంద్రంలోని భాజపా సర్కార్‌ కృతనిశ్చయంతో వుంది. మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి వరకు కర్మా గారం లాభాల్లో నడిచింది. 2016`17లో ఉత్పత్తిని ఏడు మిలియన్‌ టన్నులకు పెంచడానికి యత్నాలు మొదలైనప్పటినుంచి నష్టాలు మొదలయ్యాయి. 2018`19, 2020`21 సంవత్సరాల్లో స్టీల్‌ ప్లాంట్‌ రూ.930 కోట్ల లాభాలు ఆర్జించింది. 2021లో ప్రైవేటీకరణ అంశం ముందుకు రాగానే అప్పటి జగన్‌ సర్కార్‌ దీన్ని వ్యతిరేకించడమే కాదు, అసెంబ్లీలో ఈమేరకు తీర్మానం కూడా చేసింది. దీంతో ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఇదిలావుండగా ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నగరం నడిబడ్డున అత్యంత విలువైన 19వేల ఎకరాలున్నాయి. వీటికోసం ఎంతో మంది సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని రాజకీయపార్టీలవారూ ఎవరికి వారు పైకెన్ని కబుర్లు చెప్పినా, ఎవరి స్వార్థం వారిది! ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్‌పై వీరికి చిత్తశుద్ధి వుంటుందనుకోవడం నేతిబీరకాయలో నేతి చందమే! విచిత్రమేమంటే గత ఏడాది జులై నెలాఖరులో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గతంలో స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి వెళ్లారు. ఈ సందర్భంగా ‘స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు. 45రోజుల్లో సమస్యలన్నీ చక్కబడతాయి’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆయన చెప్పినవిధంగా ఇప్పుడిచ్చిన ప్యాకేజీని చక్కబరచే చర్య అనుకోవాలా?

ప్రస్తుతం యాజమాన్యం ఉద్యోగులను వి.ఆర్‌.ఎస్‌. తీసుకోమంటోంది. ఇదే సమయంలో సెయిల్‌లో విలీనం మాటేంటని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖమంత్రిని విలేకర్లు ప్రశ్నిస్తే సమా ధానాన్ని దాటవేయడం గమనార్హం. ఆయన చెప్పిన ప్రకారం చూసినా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ లా సీతారామన్‌కు కూడా ఈ ప్యాకేజీ విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయి. అయితే ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద స్టీల్‌ కర్మాగారానికి రూ.10వేలకోట్లకు పైగా మొత్తాన్ని ప్యాకేజీ అందజేసామని ప్రధాని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసినా ఇవన్నీ కంటితుడుపు చర్యలే తప్ప కర్మాగారాన్ని ఒడ్డున వేయడానికి పనికొచ్చేవి కావు. మరి కర్మాగారానికి 35వేల కోట్లకు పైగా రుణభారమున్నదని మంత్రి చెబుతున్నారంటే ఈ అరకొర ప్యాకేజీలతో ముందడుగు ఎలా పడుతుంది? అయినా ఈ ప్యాకేజీ, రుణభారానికి సంబంధం లేదుకదా అని ప్రశ్నిస్తే, దానికీ కేంద్రమంత్రిది దాటవేతే సమాధానం. 

ఇక వైఎస్సార్సీపీ ఉక్కు కర్మాగారం ప్యాకేజీ విషయంలో ఎదురుదాడికి దిగింది. రూ.35వేల కో ట్లకు పైగా రుణభారం ఉన్నప్పుడు అరకొర ప్యాకేజీలతో ఒరిగేదేంటని ప్రశ్నిస్తోంది. అంతేకాదు ఇచ్చే ప్యాకేజీ మొత్తం రూ.11440 కోట్లలో అంతకుముందు ఇచ్చిన రూ.1500కోట్లు మినహా యించుకొని కేవలం రూ.9800 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంటుందని తమకు సమాచారం వుందని, దీనిపై తెలుగుదేశం ఏం సమాధానం చెబుతుందని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తున్నది. అసలు సంస్థ అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, ఈ ప్యాకేజీవల్ల ఒరిగేదేముందన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. 25వేల మందితో నడవాల్సిన కర్మాగారంలో ఇప్పుడు 10వేలమందే పనిచేస్తున్నారు. మళ్లీ వీరిలో కూడా వీఆర్‌ఎస్‌లు, పదవీవిరమణ చేసేవారు పోను మిగిలేది ఏడువేలకు అటూఇటూ మాత్రమే. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే, కేవలం ప్రచారం కోసం తప్ప ఈ ప్యాకేజీ మరెందుకూ పనికిరాదని వైఎస్సార్సీపీ ఎద్దేవా చేస్తున్నది. అసలు స్టీల్‌ ప్లాంట్‌ను బయటపడేయాలంటే అనుసరించే విధానమే ఇదికాదని స్పష్టం చేస్తోంది. కేవలం తెలుగుదేశం తనకు అనుకూల ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఈ ప్యాకేజీ పనికొస్తుందని పేర్కొంది. స్టీల్‌ ప్లాంట్‌ సమస్యకు పరిష్కారం గనుల కేటాయింపు, సెయిల్‌లో విలీనం ద్వారా మాత్రమే సాధ్యమని పార్టీ పేర్కొంది. అదీకాకుండా రాష్ట్రపతి పేరుమీద వున్న స్టీల్‌ ప్లాంట్‌ భూ మలను స్టీల్‌ ప్లాంట్‌ పేరిట మార్చాలని డిమాండ్‌ చేసింది. ఇన్ని మతలబులున్న నేపథ్యంలో తెలుగుదేశం సంబరాలు చేసుకోవడంలో అర్థంలేదని పార్టీ ఎద్దేవా చేసింది. ఇటువంటి ప్యాకేజీలే గతంలో ప్రభుత్వాలు అందించాయికదా అని ప్రశ్నిస్తోంది. 

అసలు విషయమేమంటే, సోషలిస్ట్‌ భావజాలం కింద పరిశ్రమలను ప్రభుత్వరంగానికి పరిమితం చేసినప్పుడు, వీటిల్లో సింహభాగం నష్టాల్లో మునిగి కొన్ని మూతబడటమో ప్రభుత్వానికి గుది బండగా మారడమో జరిగింది. చివరకు ఈ మోయలేని భారాన్ని వదిలించుకోవడానికే నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాం నుంచి ప్రభుత్వరంగ సంస్థలో ప్రభుత్వ వాటాలను కుదిస్తూ, ప్రైవేటీకరణకు బాటలు వేయడం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పోకడను గమ నించవచ్చు. ఒక రంగంలో ప్రైవేటు సంస్థలు లాభాలు గడిస్తుంటే, ప్రభుత్వరంగ సంస్థలు కునా రిల్లుకుపోవడం జరుగుతూ వచ్చిందంటే, ఆయా సంస్థల్లో ట్రేడ్‌ యూనియన్ల రాజకీయాలు, హ క్కులు తప్ప బాధ్యతలు పట్టని వైఖరులే కారణమన్నది అక్షరసత్యం. ప్రధాన పరిశ్రమలు ప్రైవేటీ కరించబడిన దేశాలు అభివృద్ధి బాటలో పయనించాయి. మనదేశం ఈ విషయంలో ఇంకా చా లా లేటుగా మేల్కొన్నదనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!