‘‘తొందరపడకు సుందరవదన’’!

AP future cm Lokesh

`అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది.

`ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుంది.

`నాగబాబుకు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ!

`లోకేష్‌ సీఎం అంటే ఎందుకు ఉలికిపడుతున్నావు?

`మీడియా పై నాగబాబు జులుం సాగదు.

`నాగబాబుకు నచ్చినట్లు ఏ మీడియా వార్తలు రాయదు.

`కూటమిలో జనసేన ఒక నూలు పోగు మాత్రమే.

`తెలుగు దేశంతో ఉంటేనే జనసేనకు బలం.

`తెగదెంపులు చేసుకుంటే తెగిన గాలిపటం.

`ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమని మర్చిపోవద్దు.

`తెలుగు దేశం వల్లనే జనసేనకు సీట్లొచ్చాయన్నది అసలే మరువొద్దు.

`వాపు ఎప్పుడూ బలపు కాదు

`నిజం మీద రాజకీయం చేయకపోతే మనుగడ ఉండదు.

`నాగబాబు తొందరపడి నోరు జారకు?

`నోటిని అదుపులో పెట్టుకో!

`మాటల పొదుపు నేర్చుకో!

`అన్ని వేళల్లో ఆవేశం పనికి రాదు.

`పవన్‌ కళ్యాణ్‌ ఎంతో కష్టపడి జనసేన నిర్మించుకున్నాడు.

`తేనె సీసాలో నీటి చుక్కలు వేయకు.

`పవన్‌ కళ్యాణ్‌ కు రాజకీయ పరిమితులు తెలుసు

`పాలనలో ఎలా ఒదిగిపోవాలో తెలుసు

`ఎప్పటికైనా కూటమిలో లోకేషే సీఎం అని పవన్‌కు తెలుసు

`తెలుగు దేశం పార్టీ ఆలోచనలు పవన్‌కు తెలుసు

`కూటమికి ఎవరూ బీటలు పెట్టడం లేదు

`పవన్‌ ఎక్కడికెళ్లినా అభిమానులు సీఎం అంటారు

`ఏనాడు తెలుగు దేశం పార్టీ నొచ్చుకోలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

`లోకేష్‌ సీఎం అనగానే నాగబాబు స్పందించాల్సిన అవసరం లేదు

`కూటమిలో ఎవరో కుంపటి పెడుతున్నారని భ్రమ పడాల్సిన పని లేదు

`ఒకప్పుడు అభిమానులు పవర్‌ స్టార్‌ అని అరుస్తుంటేనే నాగబాబు జీర్ణించుకోలేదు

`అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేశావు

`జనసేన బలపడడంలో నాగబాబు పాత్ర నయాపైస కూడా లేదు

`పార్టీ నడపలేని సమయంలో దిల్‌ రాజు సినిమాతో పార్టీ బతికింది

`స్వయంగా ఈ మాట పవనే చెప్పింది

`గతంలో బాలకృష్ణ అంటే ఎవరో తెలియదన్నావు

`చరిత్ర ఎవరినీ మర్చిపోదు

`వడ్డీ తో సహా అన్నీ కాలమే చెల్లిస్తుంది

`అన్న చూసి ఓపిక నేర్చుకోలేదు,తమ్ముణ్ణి చూసి కష్టం నేర్చుకోలేదు

`మధ్యలో దూరి చిలువలు పలువలు చేయకు

`ఉన్న కాస్త పరువు తీసుకోకు..

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు వుండరు. ఇది రాజకీయాలకు వున్న మొదటి సిద్దాంతం. మూల సిద్దాంతం. రాజకీయ రాజ్యాంగంలో ఇది రాసి పెట్టకపోయినా, అనుసరిస్తున్న ఏకైక విదానం. సిద్దాంతం. సహజంగా మనం ప్రయాణం చేసే సమయంలో ఎంతో మంది కలుస్తుంటారు. ఇది కూడా అంతే. రాజకీయ పార్టీలకు, నాయకులకు ఎప్పుడు ఎవరు స్నేహితులౌతారో..ఎవరు ఎప్పుడు రాజకీయంగా శత్రువులౌతారో చెప్పడం కష్టం. రాజకీయాల్లో ఎలాంటి పరిస్ధితినైనా సరే ఒకే రకంగా తీసుకోవాలి. కాని జనసేన నాయకుడు నాగబాబు కొంత విరుద్దం. విచిత్రం. ఆయన మాటలు, తీరు, వ్యవహార శైలి కొంత వివాదాస్పదం. కారణం ఆయన ఆలోచనలు లేని, ఆవేశం మూలంగా చాల వరకు ఇరుకున పడుతుంటాడు. ముందూ వెనుక ఆలోచించడన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. ఈ మధ్య ఆయన పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎం. అయిన తర్వాత చాల కాలం తర్వాత నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. అయితే కేవలం కారులో కూర్చొని ఓ వీడియా విడుదల చేశారు. కూటమి ఒక బలమైన, దృఢమైన బంధమన్నారు. మంచి మాట. కాని ఎవరో కూటమి మధ్యలో చిచ్చు పెడుతున్నారని, ఆ బంధాన్ని ఎవరో బలహీన పర్చాలని చూస్తున్నారని, అలాంటి వార్తలు కొన్ని మీడియా సంస్ధలు సృష్టిస్తున్నాయని మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ మాట్లాడినట్లే ఇప్పుడూ చెల్లుతుందని అనుకున్నట్లున్నారు. అందుకే కొంచెం ఆవేశం ఎక్కువ కదా? అందుకే లోకేష్‌ సిఎం అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకోవడం ఆయనకు నచ్చడం లేదు. దాంతో కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియా పనిగట్టుకొని రాతలు రాస్తుందని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అసలు దేనికి చర్యలు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? అన్న ఆలోచన కూడా చేయకుండా తన నోటి దూలను మరోసారి నాగబాబు చూపించుకున్నారు. ఇక్కడ నాగబాబు ఒక మాట మర్చిపోతున్నారు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? ఎప్పటికైనా పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతోనే రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల్లో వుంటున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రాభివృద్దిని కాంక్షిస్తున్నారు. అలాంటప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలన్న కోరిక పవన్‌ కళ్యాణ్‌కు వుంటుంది. ఆయనను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని అభిమానులకు వుంటుంది. జనసేన ఏర్పాటు చేసిన నాటి నుంచి, నేటి వరకు పవన్‌ ఎక్కడికెళ్లినా సిఎం. సిఎం. అంటూ నినాదాలు చేయడం పరిపాటి. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. సాక్ష్యాత్తు పవన్‌ కళ్యాన్‌ కూడా గెలవలేదు. రెండు చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడికెళ్లినా జనం సిఎం. సిఎం అంటూ గోల చేశారు. ఆ సమయంలో ఓట్లు వేయలేదు..కాని సిఎం. సిఎం. అని అరిస్తే అవుతానా? ఓట్లేస్తే అవుతానని పవన్‌ అన్న మాటలు నాగబాబుకు గుర్తులేనట్లున్నాయి. సిఎం. సిఎం అనడం కాదు ఓట్లేసి చూపించండి సూచిస్తూనే ఒక దశలో ఓట్లేయండి అని వేడుకున్న సందర్భం కూడా వుంది. అలాంటప్పుడు 2009 నుంచి క్రియాశీల రాజకీయాల్లో వున్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ ముఖ్యమంత్రి కావాలనుకోవడం అభిమానుల తప్పా? పవన్‌ కళ్యాణ్‌ జనసేన అధ్యక్షుడు. లోకేష్‌ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి. అంటే రాజకీయంగా పార్టీ పరంగా పవన్‌ కల్యాన్‌కన్నా పవర్‌ పుల్‌ నాయకుడు లోకేష్‌. ఆంధ్రప్రదేశలో కూటమి వున్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించినంత కాలం ఆ పార్టీయే అధికారంలోవుంటుంది. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు, కొంత కాలం తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యేది లోకేష్‌ మాత్రమే. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్‌ మాత్రమే. ఏపిలో కూటమి ప్రభుత్వం ఎన్ని సార్లు అధికారంలోకి వచ్చినా పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా పోటీ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత మెజార్టీ సాదించలేదు. అధికారానికి అవసరమైన మెజార్టీ సీట్లులేవు. సరిగ్గా గత ఎన్నికల మందు జనసేకు కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. కాని బిజేపి రాయబారంతో పవన్‌ కళ్యాణ్‌కు 21 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు వరకు తెలుగుదేశంపార్టీ ఏ కూటమిలో కూడా లేదు. కేవలం పవన్‌ తన రాజకీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి నిచ్చెనగా తెలుగుదేశం పార్టీ సహకారంకోసం పాకులాడాడు. డిల్లీ వెళ్లి బిజేపిని కూటమి కోసం ఒప్పించారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బిజేపి నాయకుల కోసం ఎదురుచూడలేదు. డిల్లీ పెద్దలు రమ్మంటేనేవెళ్లారు. జాతీయ స్ధాయిలో బిజేపి బలహీనపడుతుందన్న సంగతి గ్రహించిన తర్వాతే చంద్రబాబు కోసం ఆ పార్టీ పెద్దలు ఆహ్వానం పలికారు. 2014 ఎన్డీయేలో వున్న చంద్రబాబును పక్కన పెట్టిందే బిజేపి పార్టీ. ఆ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఊహించని మెజార్టీతో కేంద్రంలో గెలిచిన తర్వాత బిజేపి తన రాజకీయం చూపించింది. దాంతో చంద్రబాబు కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా బిజేపితో కటీఫ్‌ చేసుకున్నారు. తర్వాత మళ్లీ బిజేపి పంచన చేరారు. కారణం రాజకీయ అవకాశ వాదం. ఇంతకు మించే ఏముంది? జనసేన పార్టీకి ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌కు వున్న అభిమానులు తప్ప, ఇప్పటికీ పార్టీ యంత్రాంగంపూర్తిగా లేదు. గ్రామ గ్రామాణ పార్టీ శ్రేణి నిర్మాణం జరగలేదు. కాని తెలుగుదేశం పార్టీ పరిస్దితి అది కాదు. నలభై సంవత్సరాలుగా పార్టీ పటిష్టమైన పునాదులతో వుంది. గ్రామ గ్రామాణ పార్టీ యంత్రాంగం బలంగా వుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి లోకేష్‌ సుధీర్ఘమైన పాదయాత్ర చేశారు. పార్టీని మరింత పటిష్టం చేశారు. లోకేష్‌ గట్టి ప్రయత్నం మూలంగా తెలుగుదేశం పార్టీకి సుమారు కోటి మంది సభ్యులున్నారు. జనసేనకు ఎంత మంది కార్యకర్తలున్నారో ఎవరైనా చెప్పలగరా? గత ఎన్నికల్లో పరస్పరసహాకారం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చేది. కాని జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎలా వుంటుందో ఓసారి ఊహించుకుంటే అర్దమౌతుంది. ఇక్కడ అటు జనసే, ఇటు తెలుగుదేశం పరస్పర అవగాహనతో ఎన్నికల్లో వెళ్లారు. ఒకరి ఓటు బ్యాంకు మరొకరికి ఉపయోగపడిరది. దాంతోనే అంత పెద్ద మెజార్టీ స్దానాలు కూటమి కైవసం చేసుకున్నది. అంతే కాని కూటమికి అన్ని సీట్లు రావడానికి తామే కారణమని పవన్‌ కళ్యాన్‌ కూడా అనుకోవడం లేదు. ఈ విషయాన్ని నాగబాబు గ్రహించాలి. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. పైగా తెలుగుదేశం పార్టీ మరో వంద సంవత్సరాలు నిలవాలన్నా, అధికారంలో వుండాలన్నా లోకేష్‌ నాయకత్వం ఎంతో అవసరం. లోకేష్‌ ముఖ్యమంత్రి కావడం ఆ పార్టీ శ్రేణులకు ఎంతో ముఖ్యం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకుడు వున్నప్పటికీ పార్టీ యంత్రాంగాన్నంతా కోఆర్డినేట్‌ చేస్తున్నది మొత్తం లోకేష్‌ మాత్రమే. ఆయన ఎంతో కష్టపడి సుధీర్ఘమైన పాదయాత్ర చేసి, కూటమి అదికారంలోకి రావడంలో పవన్‌ పాత్ర ఎంత వుందో చంద్రబాబు పాత్ర ఎంత వుందో, అంతకు మించి లోకేష్‌ పాత్ర వుందని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల నాగబాబు ఇప్పుడు తమ్ముడి మీద ఎంతో ప్రేమ ఒలకబోస్తే అభిమానులు కూడా నమ్మరు. గతంలో ఓసారి చిరంజీవి సినిమా ఫంక్షన్‌లో అభిమానులంతా పవర్‌ స్టార్‌, పవర్‌ స్టార్‌ అంటూ గోల చేస్తునప్పుడు వారిపై కోపం ప్రదర్శించింది నాగబాబు కాదా? సర్ధిచెప్పాల్సిన సమయంలో సహనం కోల్పోయి మాట్లాడిరది నాగబాబు కాదా? జనసేన పార్టీలో నయాపైన నాగబాబు కష్టం వుందా? జనసేన పార్టీని ఎలా నడపాలో అర్ధం కాని సమయంలో, ఆర్ధిక ఇబ్బందులతో పవన్‌ కొట్టుమిట్డాడుతున్న తరుణంలో వకీల్‌ సాబ్‌ సినిమా తీసి, తనను ఆర్ధికంగా ఆదుకున్నది దిల్‌ రాజు అని అశేష జనవాహిని ముందు సాక్ష్యాత్తు పవన్‌ కళ్యాన్‌ చెప్పారు. అంతే కాని జనసేన కోసం తన సోదరులు ఆర్ధిక సాయం చేశారని చెప్పలేదు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారని చెప్పినసందర్భం ఎప్పుడూ లేదు. సాఫీగా సాగుతున్న రాజకీయాలలో నాగబాబు వేలు పెట్టడం అవసరమా? మీడియా మీద అక్కసు వెల్లగక్కడం అవసరమా? కాలం రాజకీయాలను ఎటు వైపు తిప్పుతుందో ఎవరూ చెప్పలేరు. అయినా కూటమి మూలంగా ఎప్పటికైనా లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారన్న సంగతి తెలియకుండానే పవన్‌ కళ్యాన్‌ పొత్తుకు అంగీకరించి వుంటారా? అందుకే నాగబాబుకాస్త నోరు అదుపులో పెట్టుకో అని జనసైనికులే అంటున్నారు. ఇల్లు అలకగాన పండుగ కాదు. కూటమి పేరుతో ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి కాగానే రాజకీయం ఏలినట్టు కాదు. జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నప్పుడు లెక్క. అప్పడు నాగబాబు ఏది మాట్లాడినా దానికి ఓ విలువ వుంటుంది. ఇప్పుడు ఏది మాట్లాడినా తట్టుకోలేక మాట్లాడినట్లౌవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!