పి.ఆర్.సి మరియు పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే ప్రకటించాలి…

పి.ఆర్.సి మరియు పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే ప్రకటించాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగ విరమణ చేసిన రోజే చెల్లించాలి.

హెల్త్ కార్డుల మంజూరీ ప్రక్రియ వేగవంతం చేయాలి.

సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

కేసముద్రం/ నేటి ధాత్రి

ఉద్యోగ,ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అన్ని డి. ఏ లను ప్రకటించాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం కేసముద్రం స్టేషన్ ఉన్నత పాఠశాలలోటిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ అధ్యక్షుతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ
మారుతున్న జీవన ప్రమాణాలను, ధరలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక డీ.ఏ ను, ఐదు సంవత్సరాలకు ఒకసారి పి ఆర్ సి ని ప్రకటిస్తుందని కానీ ఆర్థిక మాంధ్యాన్ని సాకుగా చూపించి
ఏళ్లు గడిచినా పి.ఆర్.సి మరియు డి.ఏ లను ఇంకా ఆలస్యం చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని, తక్షణమే వీటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు 30 -35 సంవత్సరాలు విద్యార్థులకు సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ మొదలైన అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని, పెండింగ్ అన్ని రకాల బెనిఫిట్స్ ని తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కోసం ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని, వాటి వినియోగంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో అయినా అన్ని రకాల నగదు రహిత వైద్యం అందేలా రూపొందించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ భద్రత, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్న , వారి జీవితాలను అగమ్యగోచరం చేస్తున్న
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా కార్యదర్శి చీకటి వెంకట్రాం నర్సయ్య, ఉపాధ్యక్షులు కొమ్ము రాజేందర్, అంజన్న,కార్యదర్శులు ఊట్కూరు ప్రణయ్ కుమార్, వీసం నర్సయ్య, మోహనకృష్ణ,, బొల్లెద్దు చందర్ , ఆడిట్ కమిటీ కన్వీనర్ బి శ్రీనివాస్ అక్కడ మీకు సెల్ కన్వీనర్ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

డీటీఎఫ్ ఖానాపురం మండల నూతన కార్యవర్గ ఎన్నిక…

డీటీఎఫ్ ఖానాపురం మండల నూతన కార్యవర్గ ఎన్నిక

అధ్యక్షుడిగా నాంపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్

నర్సంపేట,నేటిధాత్రి:

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఖానాపురం మండల శాఖ నూతన కార్యవర్గాన్ని బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి దార్ల రవీందర్ తెలిపారు. ఎన్నికల పరిశీలకుడు యాకయ్య పర్యవేక్షణలో ఖానాపూర్‌లో డీటీఎఫ్ మండల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో డీటీఎఫ్ ఖానాపురం మండల శాఖ అధ్యక్షుడిగా నాంపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా పి.

సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వి. వాగ్య, కె. నీరజ ఎన్నిక కాగా, కార్యదర్శులుగా పి. సురేందర్, కె. సూరయ్య, వి. శ్రీనివాస్ నియమితులయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా కె. యాకయ్య, కె. కళ్యాణి, కె. నర్సింహులు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎ. హుస్సేన్, సభ్యులుగా బి. ఈర్య, బి. దివ్యశ్రీ ఎంపికయ్యారు.అనంతరం డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాగిత యాకయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మరింత నిధులు కేటాయించాలని కోరారు.

 

పెండింగ్ డి.ఏలు, జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ నివేదికను ఆలస్యం చేయకుండా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కొర్ర రమేష్, కె. కొమురయ్య, ఎం. జగన్, శ్రీధరస్వామి, వి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

టిపిటిఎఫ్ నిబద్ధతగల బలమైన సంఘం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి..

టిపిటిఎఫ్ నిబద్ధతగల బలమైన సంఘం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి

టిపిటిఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరి ఉద్ఘాటన.

ఉపాధ్యాయ హక్కుల సాధన కై, సంక్షేమానికై నిరంతర పోరాటం

నాణ్యమైన విద్యను అందించడమే సంఘం ప్రధాన లక్ష్యం

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఉవాచ

కేసముద్రం/ నేటి ధాత్రి

 

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపిటిఎఫ్) కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో టీపిటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ (2026) ఆవిష్కరణ కార్యక్రమం కేసముద్రం మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ, “టీపిటిఎఫ్ ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ, విద్యావ్యవస్థ బలోపేతం లో కీలక పాత్ర పోషిస్తోందని” ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, అందుకు విద్యాశాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
అనంతరం టీపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కై నిరంతరం పోరాటం చేస్తుందని, నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యంగా టి పి టి ఎఫ్ పనిచేస్తుంది ” అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల గౌరవం, భద్రత, సంక్షేమం కోసం టీపిటిఎఫ్ ముందుండి పోరాడుతుందని, అవసరమైతే ఉద్యమాలకూ సిద్ధమని తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, స్టేషన్ కేసముద్రం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, టీపీటీఫ్ సీనియర్ నాయకులు బందెల రాజు, కల్వల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బండారు నరేందర్, తాళ్లపూస పల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకయ్య, ఉప్పరపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు దేవ్ సింగ్, బద్రు నాయక్, వెన్నెల అనిత, ఎమ్మార్సీ సిబ్బంది ఖాదర్,బిక్షపతి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version