డీటీఎఫ్ ఖానాపురం మండల నూతన కార్యవర్గ ఎన్నిక
అధ్యక్షుడిగా నాంపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్
నర్సంపేట,నేటిధాత్రి:
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఖానాపురం మండల శాఖ నూతన కార్యవర్గాన్ని బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి దార్ల రవీందర్ తెలిపారు. ఎన్నికల పరిశీలకుడు యాకయ్య పర్యవేక్షణలో ఖానాపూర్‌లో డీటీఎఫ్ మండల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో డీటీఎఫ్ ఖానాపురం మండల శాఖ అధ్యక్షుడిగా నాంపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా పి.
సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వి. వాగ్య, కె. నీరజ ఎన్నిక కాగా, కార్యదర్శులుగా పి. సురేందర్, కె. సూరయ్య, వి. శ్రీనివాస్ నియమితులయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా కె. యాకయ్య, కె. కళ్యాణి, కె. నర్సింహులు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎ. హుస్సేన్, సభ్యులుగా బి. ఈర్య, బి. దివ్యశ్రీ ఎంపికయ్యారు.అనంతరం డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాగిత యాకయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మరింత నిధులు కేటాయించాలని కోరారు.
పెండింగ్ డి.ఏలు, జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను ఆలస్యం చేయకుండా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కొర్ర రమేష్, కె. కొమురయ్య, ఎం. జగన్, శ్రీధరస్వామి, వి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
