ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

కోదాడ, నేటి ధాత్రి:

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల జంట కార్యాచరణ సమితి (టి జి ఈ జె ఏ సి) కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం కోదాడ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదుట టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 2వ పీఆర్సీ ని తక్షణమే అమలు చేయాలని, సిపిఎస్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం చిరంజీవి, తీగల నరేష్, రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, బంధం వెంకటేశ్వర్లు, ఆర్సి రెడ్డి,రామ నరసయ్య, బడుగుల సైదులు, పాండురంగాచారి, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

పి.ఆర్.సి మరియు పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే ప్రకటించాలి…

పి.ఆర్.సి మరియు పెండింగ్ లో ఉన్న డి.ఏలు వెంటనే ప్రకటించాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగ విరమణ చేసిన రోజే చెల్లించాలి.

హెల్త్ కార్డుల మంజూరీ ప్రక్రియ వేగవంతం చేయాలి.

సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

కేసముద్రం/ నేటి ధాత్రి

ఉద్యోగ,ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అన్ని డి. ఏ లను ప్రకటించాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం కేసముద్రం స్టేషన్ ఉన్నత పాఠశాలలోటిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ అధ్యక్షుతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ
మారుతున్న జీవన ప్రమాణాలను, ధరలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక డీ.ఏ ను, ఐదు సంవత్సరాలకు ఒకసారి పి ఆర్ సి ని ప్రకటిస్తుందని కానీ ఆర్థిక మాంధ్యాన్ని సాకుగా చూపించి
ఏళ్లు గడిచినా పి.ఆర్.సి మరియు డి.ఏ లను ఇంకా ఆలస్యం చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని, తక్షణమే వీటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు 30 -35 సంవత్సరాలు విద్యార్థులకు సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ మొదలైన అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని, పెండింగ్ అన్ని రకాల బెనిఫిట్స్ ని తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కోసం ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని, వాటి వినియోగంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో అయినా అన్ని రకాల నగదు రహిత వైద్యం అందేలా రూపొందించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ భద్రత, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్న , వారి జీవితాలను అగమ్యగోచరం చేస్తున్న
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా కార్యదర్శి చీకటి వెంకట్రాం నర్సయ్య, ఉపాధ్యక్షులు కొమ్ము రాజేందర్, అంజన్న,కార్యదర్శులు ఊట్కూరు ప్రణయ్ కుమార్, వీసం నర్సయ్య, మోహనకృష్ణ,, బొల్లెద్దు చందర్ , ఆడిట్ కమిటీ కన్వీనర్ బి శ్రీనివాస్ అక్కడ మీకు సెల్ కన్వీనర్ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం..

గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలోఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా గణపురం గ్రామ పంచాయతీలో పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.ఈ సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూగ్రామ ప్రజలు మీపై నమ్మకంతో గ్రామాభివృద్ధికి కష్టపడే వారిగ మిమల్ని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ
గ్రామ ప్రజలు ఇచ్చిన ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ తన మన బేధం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్,ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు.గణపురం మండలంలోనిగ్రామపంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా మొదట పూజ కార్యక్రమం ప్రత్యేక పూజ నిర్వహించి సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు నెంబర్లు దేవుని ఆశీస్సులతో తమ పదవి బాధ్యతలను నిర్వహించాలని దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గణపురం ఎంపీడీవో ఆధ్వర్యంలో గణపురం బుద్ధారం గాంధీనగర్ బురకాయల గూడెం మైలారం కర్కపల్లి లక్ష్మిరెడ్డిపల్లి చెల్పూరు గొల్లపల్లి వెంకటేశ్వర పల్లి పరశురాంపల్లి ధర్మారావుపేట్ బ స్వ రాజు పల్లి నగరంపల్లి సీతారాంపూర్ కొండాపూర్ అప్పయ్యపల్లి సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారంచేశారు.

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి..

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి

నూతి మల్లన్న స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పి.ఎస్.హెచ్.ఎం.ఏ

ఇబ్రహీంపట్నం. నేటిదాత్రి

 

ఉద్యోగులకు పి ఆర్సీ ని వెంటనే ప్రకటించి పెండింగ్ లో ఉన్న ఐదు డి.ఏ లను విడుదల చేయాలనీ ప్రైమరి స్కూల్ హెడ్ మాస్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నూతి మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో సోమవారం రాత్రి నిర్వహించిన సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ సమస్యలగురించి విపులంగా చర్చించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించటం జరిగింది. ఈ ఎన్నికలో జిల్లా కమిటీ అధ్యక్షులుగా అచ్చ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శిగా చల్లా లక్ష్మారెడ్డి , గౌరవ అధ్యక్షులుగా జంగా గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసోసియేట్ ప్రెసిడెంట్ గా జరుపుల సుధాకర్,కె. లక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఎం. గంగాధర్,ఆర్. శ్రీనివాస్,జి. రవీందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆర్. కనకతార,సి. హెచ్. వాణి, ఏ. సుజాత మరియు ఆర్థిక కార్యదర్శిగా ఇ. రవీందర్, మీడియా సెక్రెటరీగా డి. భీమయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె. లక్ష్మీనారాయణ, సెక్రెటరీలుగా ఎల్. రాజు, టి. వేణుగోపాల్, కె. తిరుపతి, కె. నాగరాజ్, బి.రెడ్డి, ఎల్. కిష్టయ్య,వి. రవీందర్, మహిళా కార్యదర్సులు గా పి. స్వరూప, ఎం. హేమలత,ఎల్ ధర్మవ్వ స్టేట్ కౌన్సిలర్లు గా ఎస్. నరసయ్య, జె. సుదర్శన్,పి. రమేష్,డి. వెంకటరమణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికైన నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించుట జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూతి మల్లన్న మాట్లాడుతూ పిఆర్సిని ప్రకటించకుండా బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆర్ధికంగా ఇబ్బంది కలిగించటం ప్రభుత్వానికి సరికాదని ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ప్రభుత్వం తక్షణం స్పందించి పి ఆర్సీ మరియు ఐదు డి ఏ లు, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలనీ కోరారు. అలాగే మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు మొత్తం సర్వీస్ కాలంలో వాడుకునే విధంగా వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు సాతల నరసయ్య,డి. శంకర్,నూతన కార్యవర్గ సభ్యులు,జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version