గిరిజన యువతి కి క్రికెట్ కిట్ అందించిన కుంజ సూర్య
మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీర స్నేహ గిరిజన యువతి కోచ్ బాడిశ ఆదినారాయణ పర్యవే క్షణలొ శిక్షణ పొంది భూపాలపల్లిలో జరిగిన ఉమ్మడి వరంగల్ అండర్ 17 క్రికెట్ సెలక్షన్ అయింది. కుంజ సూర్య స్నేహ అనే యువతికి క్రికెట్ కిట్ అందించారు.గ్రామాల్లోని గిరిజన యువతులు స్నేహని ఆదర్శంగా తీసుకుని మరికొందరు అమ్మాయిలు క్రికెట్ లో రానించి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎదిగి ములుగు జిల్లా కి పుట్టిన గ్రామానికి పేరు తీసుకురావాలని సూర్య అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు ఇస్సార్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
