స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా
ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు
వనపర్తి నేటిదాత్రి .
పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు
శిక్షణ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు , పి. ఒ ల పోలింగ్ శిక్షణను నిర్వహించాలన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలనీ నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలనీ సూచించారు.
శిక్షణ కు వచ్చే పీఓ లకు పోస్టల్ బాలట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిన పీఓలదే బాధ్యత అని జాగ్రత్త గా వ్యవహారించాలని వారికి తెలియజేయాలన్నారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘనాథ్, డప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డి ఈ ఓ అబ్దుల్ఇ ఘని, ఏ ఓ భాను, అధికారులు పాల్గొన్నారు