ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

సాహిత్యం ద్వారా సమాజ మార్పుకు కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజి నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు.
తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న నిర్వహించడం ద్వారా కాళోజి సాహిత్య సేవలను స్మరించుకోవడం గర్వకారణమని, కాళోజి కవిత్వంలో మన భాష, మన భూమి, మన సంస్కృతి ప్రతిబింబించాయని పేర్కొన్నారు. కాళోజి కవి మాత్రమే కాదని, సామాజిక చైతన్యానికి మార్గదర్శకులని కొనియాడారు.
కాళోజి చూపిన మార్గంలో సాగితే మన భాష, మన సంస్కృతి మరింత వెలుగొందుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాష దినోత్సవం…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాష దినోత్సవం

గిడుగు రామ్మూర్తి భాషసేవలు మరువలేనివి

కళాశాల ప్రిన్సిపాల్ బేతి.సంతోష్ కుమార్

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో గిడుగు.రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ గిడుగు వేంకట రామ్మార్తి చిత్రపటానికి పూల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామ్మూర్తి పంతులు తెలుగు వ్యావహారిక భాషా కోసం చేసిన సేవలు మరువలేనివని అలాగే సవర భాషను నేర్చుకుని ఆ భాషకు వ్యాకరణం కనిపెట్టి సవరలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసిన గిడుగు పిడుగులాంటివారని కొనియాడారు.తెలుగు విభాగాధిపతి అశోక్ మోరె మాట్లాడుతూ తెలుగు అజంత భాష అని అనగా అచ్చులతో అంతమయ్చే భాష కాబట్టి సంగీతానికి అనువుగా ఉంటుందని తెలుగుభాషకు, ఇటరీ భీషకు దగ్గరి సంబంధం ఉండే పరిక తెలుగును ” ఈ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అ అంటారని అన్నారు.తెలుగు అధ్యాపకులు రణ ఈశ్వరయ్య ప్రసంగిస్తూ మాతృభాషలో విద్యాబోధన ద్వారా విద్యార్థుల మానసిక వికాసం జరిగి సృజనాత్మకత పెంపొందుతుందని,పరభాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మరువకూడదన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డాక్టర్.రామక్రిష్ణ ఆద్యాపకులు డా.ఆడెపు రమేష్,బి.మహేందకరావు, డా.ఎ.శ్రీనావార్రెడ్డి,డా.ఎలిశాల అశోక్,డా.భీంరావు,డా.కె. జగదీష్ బాబు,యం సమ్మయ్య,డా.టి.కాల్పన,డా.జి.పావని,రాజశ్రీ,డా.జి.స్వప్న, డాక్టర్.సంజయ్,సతీష్,సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version