స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు శిక్షణ
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పిఓలు, ఏపీవోలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సర్వం సన్నదంగా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనదని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా న నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఆర్ ఓ, ఏఆర్వోలు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరో విడత రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు నిర్వహించిన శిక్షణపై ఎన్నికల సంగం సూచనలు మేరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికలు ఉంటాయని పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్లు సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారని, ఏదేని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ శ్రీనివాస్, సిపిఓ బాబురావు, భూపాలపల్లి ఎంపీడీవో నాగరాజు, ఆర్వోలు, ఏ ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.