“రూ.90 కోట్లతో నర్సంపేట అభివృద్ధి”

రూ. 90 కోట్లతో నర్సంపేట పట్టణ అభివృద్ధి

త్వరలో ఎన్నికల హామీలను నెరవేర్చుతున్నాం

నర్సంపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

26 వ వార్డుతో పాటు పలు వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం

వార్డు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా…అభ్యర్థి గాజుల విమల రాము.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం కోసం అంతర్గత సిపి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణాల కోసం మరో రూ. 90 కోట్లతో నర్సంపేట పట్టణం అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభం కాదా మరికొన్ని పనులను మొదలుపెట్టనున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 26 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న గాజుల విమల రాము ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇందిరమ్మపాలనలో పట్టణానికి 5 వేల ఇండ్లు ఇచ్చనం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వేలాది ఇండ్లను ఇచ్చి నిరుపేదలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నాం. సాధారణ కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు,మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

మహిళలు నా ఆడబిడ్డలు అన్న కేసీఆర్.. ఆయన ప్రభుత్వంలో మహిళలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. నర్సంపేటలో 8600 మంది మహిళలకు 1.61 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ. 90 కోట్లతో పనులు చేస్తున్నాం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంత కష్టమైన.. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం క్రమేపీ హామీలు మెరవేర్చుతూ ముందుకు పోతున్నామని ఎమ్మెల్యే దొంతి వివరించారు. ఎన్నికల్లో ఇతర పార్టీలు చెప్పే మాటలకు మోసపోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను
గెలిపించుకోవాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలను కోరారు.

వార్డు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా…

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 26వ వార్డు గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆ వార్డు కౌన్సిల్ అభ్యర్థి గాజుల విమల రాము వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే మా వార్డు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మూడు కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన ఓడిపోయిన ప్రజలే వెంటే ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని కౌన్సిల్ అభ్యర్థి గాజుల విమల రాము ఓటర్లను కోరారు.
ఈ ప్రచారంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మాజీ వార్డు కౌన్సిలర్ గాజుల రమేష్, వడ్డే కరాటే కుమార్, ఇన్చార్జిలు తోకల శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,పెద్ది మైపాల్ రెడ్డి, గుడిపూడి అరుణ రామచందర్,బాబురావు పలువురు నాయకులు,వార్డు ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version