అయినవోలు యువతలో గంజాయి మహమ్మారి: తక్షణ చర్య అవసరం

అయినవోలులో గంజాయి మహమ్మారి: యువత భవిష్యత్తును చిదిమేస్తున్న విషపు త్రోపు
అయినవోలు యువత భవిష్యత్తు రక్షించాలంటే, ఈచర్యలు తప్పనిసరి.
మహమ్మారిపై మౌనం ఇకపై ఏమాత్రం సహ్యం కాదు – చర్య అవసరం.

నేటి ధాత్రి ఐనవోలు :-

అయినవోలు మండలంలో గంజాయి వాడకం ఒక మహమ్మారి రూపం సంతరించుకుంది. ఎస్సీ కాలనీ వాటర్ ట్యాంక్ ఫంక్షన్ హాల్‌ను కేంద్రంగా చేసుకుని, మైనర్ యువత మత్తులో మునిగి చిత్తు అవుతున్నారు. ఈ దృశ్యం కేవలం స్థానిక సమస్య కాదు, సమాజాన్ని దెబ్బతీసే విషపు త్రోపు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ లోపం ఈ బాల్యాన్ని, యవ్వనాన్ని చిదిమేస్తూ, భవిష్యత్ తరాలను నాశనం చేస్తోంది.

యువతలో వ్యాప్తం చెందుతున్న గంజాయి మద్యం వినియోగం

అయినవోలు ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్, ఫంక్షన్ హాల్ ఊరగుట్ట తదితర ప్రాంతాలు ఒక రహస్య కేంద్రంగా మారింది. ఇక్కడ మైనర్లు – 10 నుంచి 18 సంవత్సరాల వయస్సు ధరించిన పిల్లలు – గంజాయిని వినియోగిస్తూ, మత్తులో మునిగిపోతున్నారు. ఈ హాల్, లోపల గంజాయి ట్రాఫికింగ్, విక్రయాలకు స్థలంగా మారింది. యువత ఈ మత్తుకు బానిసలుగా మారి, చదువు, కుటుంబాలు, ఆరోగ్యాన్ని మరచిపోతున్నారు. ఫలితంగా, మానసిక అస్థిరత, శారీరక లోపాలు, నేరాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సమాజ ద్రవ్యరాశి దెబ్బకు గురవుతోంది.

అధికారుల చొరవ, నాయకుల పర్యవేక్షణ లోపాలు

పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రభుత్వం ఈ మహమ్మారిని పట్టించుకోవడం లేదు. లక్షలు వెచ్చించి నిర్మించిన ఫంక్షన్ హాల్ రాత్రి మొత్తం గంజాయి వ్యాపారానికి నిలయంగా మారినా, రైడ్లు లేవు. ఈ కొరతలు బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. మైనర్లు చట్టవిరుద్ధంగా డ్రగ్స్ వాడటం డీ-ఆడిక్షన్ చట్టాలను, POCSO చట్టాలను ఉల్లంఘిస్తోంది. అధికారుల అశ్రద్ధత ట్రాఫికర్లకు ధైర్యం పెంచుతూ, యువతను విషపు జాలంలోకి ఆకర్షిస్తోంది. ఇది నిర్లక్ష్యమా, లేక అవినీతి ఫలితమా?
పరిణామాలు:-
ఈ గంజాయి మద్యం యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది. చదువు మాని, ఉద్యోగాలు కోల్పోయి, నేరాల్లో పడి, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఆరోగ్యంగా మానసిక వ్యాధులు, కాలేయ దెబ్బలు, మరణాలు పెరుగుతున్నాయి. సమాజంలో ఈ మహమ్మారి అస్థిరతను పెంచుతూ, అభివృద్ధిని అడ్డుకుంటోంది. బాల్యం, యవ్వనం చిదిమేసే ఈ విషపు త్రోపు రాజకీయ నాయకులు, స్థానిక సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నారు?

తీవ్రమైన చర్యలు అవసరం

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.
– పోలీసులు రెగ్యులర్ రైడ్లు నిర్వహించి, ఫంక్షన్ హాల్‌ ఎస్సీ కాలనీ వాటర్ ట్యాంక్ తదితర ప్రాంతాలపై నిఘా పెంచాలి.
– నిరుపయోగంగా ఉండి నిర్లక్ష్యానికి గురవుతున్న ఎస్సీ కాలనీ ఫంక్షన్ హాల్ లో తక్షణమే వృద్ధిలోకి తీసుకువచ్చి గ్రామపంచాయతీ పరిధిలోకి తీసుకోవాలి
– డీ-ఆడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి, కౌన్సెలింగ్‌లు నిర్వహించాలి.
– పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంచాలి.
– రాజకీయ నాయకులు ఈ సమస్యపై హామీలు ఇచ్చి, చట్ట చర్యలు తీసుకోవాలి.

అయినవోలు మెడికల్ షాపుల దందా ప్రజారోగ్యానికి ముప్పు

అయినవోలు మండల కేంద్రంలో మెడికల్ షాపుల దందా – ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
ప్రాణాల కంటే లాభం గొప్పదా?
అధికారుల నిర్లక్ష్యం – ప్రజలకు శాపం కాకూడదు.

నేటి ధాత్రి అయినవోలు :-

అయినవోలు మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యమే పెట్టుబడిగా మారిపోయింది. వైద్య వృత్తి పవిత్రతను తుంగలో తొక్కుతూ, అర్హత లేని వ్యక్తుల చేతిలో మెడికల్ షాపులు, అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పీలు గ్రామీణ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు. ఒక క్రమబద్ధమైన దందా.

ఫార్మసీ డిగ్రీ, లైసెన్స్, అర్హత ఏమీ లేకుండానే మెడికల్ షాపులు నడుపుతున్న నకిలీ ఓనర్లు, మేమే డాక్టర్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆపద సమయాల్లో, అనారోగ్య కారణంగా నడవలేకున్నామన్నా మా ఇంటికే రండి, ఇంటికి వస్తేనే వైద్యం చేస్తాం” అంటూ హుకుం జారీ చేస్తున్న ఆర్.ఎం.పీల దుస్సాహసం రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య నియమాలు, మానవతా విలువలు అన్న మాటే లేకుండా డబ్బే పరమావధిగా మారింది. అర్హత లేని మెడికల్ షాప్ నిర్వాహకుల కారణంగా ఇటీవల కుటుంబ సభ్యులే సొంతంగా ఇచ్చిన వైద్యం తిని ఆస్పత్రిపాలైన సంఘటనలు కలవరపెడుతున్నాయి. అయినా సంబంధిత శాఖల కళ్లెందుకు మూసుకుపోయాయో అర్థం కాని పరిస్థితి. వృద్ధులు, నిరక్షరాస్యులు లక్ష్యంగా కొందరు ఆర్ఎంపీలు ఇంటింటికి తిరిగి సొంత మందుల సరఫరా చేస్తూ, అర్థ రూపాయి విలువైన గోలిమందుకు రూ.5 వసూలు చేస్తున్న దోపిడి పట్ట పగలు బహిరంగంగానే జరుగుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ షాప్ ఓనర్లు మందుల పేరుతో చేస్తున్న దందాకు అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు, వైద్య శాఖ అధికారులు ఎక్కడున్నారు? సరైన అర్హత లేని వారు షాపులు నడుపుతుంటే, వారిచ్చే కమిషన్ల కోసం కొందరు చేస్తున్న నకిలీ వైద్యం కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థే మౌనంగా ఉంటే, ఈ దందాకు నైతిక బాధ్యత ఎవరిది? నకిలీ మెడికల్ షాప్ ఓనర్లు, అర్హత లేని ఆర్.ఎం.పీలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికార యంత్రాంగం కూడా ఈ నేరానికి భాగస్వాములే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా వైద్యాధికారులు, డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు కళ్లుతెరవాలి. లైసెన్స్ లేని మెడికల్ షాపులను సీజ్ చేయాలి. అర్హత లేకుండా మందులు విక్రయించే వారిని వైద్యం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేదంటే ప్రజల ఆరోగ్యంతో జరుగుతున్న ఈ దందా మరిన్ని ప్రాణాలను బలి తీసుకోవడం ఖాయం.

ఆలయ ట్రస్ట్ బోర్డులో యాదవులకు చోటు కల్పించాలి…

ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో యాదవులకు చోటు కల్పించాలి
ఐలోని మల్లన్న స్వామిని యాదవులు కులదైవంగా కొలుస్తారు
స్వామివారి సేవకు యాదవులను దూరం చేసే కుట్ర జరుగుతుంది
అందుకే యాదవులకు ట్రస్ట్ బోర్డులో చోటు ఇవ్వలేదు
స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని యాదవులకు చోటు కల్పించాలి
జి ఎం పి ఎస్ మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

 

అయినవోలు మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా కొలువుదీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంలో స్థానిక యాదవులను గుర్తించకపోవడం స్థానిక యాదవులను అవమానపరచడమేనని జి.ఎం.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు విమర్శించారు. శుక్రవారం ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అయినవోలు మండలంలో అయినవోలు గ్రామానికి చెందిన గత పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా యాదవులను గుర్తింపు లేకుండా అవమానపరుస్తున్నారని నల్లబెట్ట రాజు యాదవ్ ఆవేదన వ్యక్తపరిచినారు. మేము ఓట్ల బ్యాంకు వరకేనా, కనీసం నామినేట్ పోస్టులకు కూడా అర్హత లేకుండా పోయినామా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి యాదవులను గుర్తించి ట్రస్ట్ బోర్డులో కనీస గౌరవప్రధ స్థానాలనైనా స్థానిక యాదవులకు కేటాయించాలని చినరాజు విజ్ఞప్తి చేసినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version