అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తుమ్మలపల్లి సర్పంచ్…

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తుమ్మలపల్లి సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని తుమ్మలపల్లి గ్రామపంచాయతీ కుడు సంఘం గ్రామ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన రోడ్డు పనులను ఘనంగా సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి కొత్తగా రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..  గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు తనవంతుగా ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు పనుల కోసం మొరం ఏపియించడం, గ్రామంలోని పలు వీధులలో విద్యుత్తులైట్లను వేయించానని తెలిపారు.అదేవిధంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను గ్రామ ప్రజలు అభినందించారు. గ్రామంలోని ప్రతి గల్లీ, ప్రతి వీధికి మెరుగైన కొత్తగా రోడ్లు అందించడం తమ ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అన్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సర్పంచ్ హామీ ఇచ్చారు.

ఒకే కాన్పులో నాలుగు మేక పిల్లల జననం…

ఒకే కాన్పులో నాలుగు మేక పిల్లల జననం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో యాదన వేణి మల్లేష్ యజమాని యొక్క మేక ఒకే కాన్పులో 4 మేక పిల్లలకు జన్మనిచ్చింది.ఈ విశేషమైన జననంలో పుట్టిన నాలుగు పిల్లలు అందులో 2 మగవి,2ఆడవి,తల్లి మేక, పిల్లలు ఆరోగ్యంగా ఉండడం విశేషం.సాధారణంగా మేకలు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మిస్తుంటాయి.కొన్నిసార్లు మూడు పిల్లలు కూడా పుడతాయి.కానీ ఒకే కాన్పులో నాలుగు మేక పిల్లలు జన్మించడంతో ఆ యజమాని సంతోషం వ్యక్తం చేశారు.

10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరుగుతున్న తీరు, పరీక్షా కేంద్రంలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా హాళ్లను సందర్శించి, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పాట్లును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, భద్రత వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజేందర్, పరీక్షా కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నూతన ఎస్సైని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

నూతన ఎస్సైని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

నూతనంగా రేగొండ ఎస్సైగా సుధాకర్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బొకే ఇచ్చి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రేగొండ మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ-రవి,మాజీ ఎంపిటిసి పట్టెం శంకర్,రంగయ్యపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,దమ్మన్నపేట ఉపసర్పంచ్&గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క జనార్ధన్, నడిపెల్లి చక్రిదర్ రావు, ఎండి షాబిర్, నువ్వు నూనె రాజ్ కుమార్,కాంగ్రెస్ యూత్ నాయకులు కొమర్రాజు భాస్కర్,పున్నం సాయి తదితరులు పాల్గొన్నారు

మస్జిద్ షాషత్-ఎ-ఇస్లాం వద్ద లైలతుల్ ఖదర్ శోధన ర్యాలీ…

మస్జిద్ షాషత్-ఎ-ఇస్లాం వద్ద లైలతుల్ ఖదర్ శోధన ర్యాలీ

◆-: తెలంగాణ నియోజకవర్గానికి చెందిన అమీర్, ముహమ్మద్ అజారుద్దీన్ ప్రసంగించారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,: స్థానిక ‘జమాత్-ఎ-ఇస్లామీ హింద్’ (జహీరాబాద్ ఉత్తర విభాగం) సహాయ అమీర్ మహమ్మద్ షాబాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 12వ తేదీన — మూడవ దశలోని రెండవ బేసి రాత్రి సందర్భంగా — అమీర్ మహమ్మద్ ఖైజర్ ఘౌరీ నాయకత్వంలో జహీరాబాద్‌లోని ఖాన్ మొహల్లా, లతీఫ్ రోజ్ వద్ద ఉన్న ‘మస్జిద్ షాతియా ఇస్లాం’లో ఒక సమావేశం నిర్వహించబడింది.రమదాన్ మాసంలో అనేక అవకాశాలు అందుబాటులో ఉంటాయి, కాబట్టి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ముహమ్మద్ రెహాన్ ఖురాన్ పాఠాన్ని బోధించారు. స్థానిక ‘సాదాత్’ సహాయ అమీర్ అయిన ఖ్వాజా నిజాముద్దీన్, ‘కలిమా తయ్యిబా’ సందేశంపై సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా
నిర్వాహకులు సంగారెడ్డి సబీహుద్దీన్ ప్రసంగించారు, సుల్తాన్ ఆజం హదీసులపై ఉపన్యాసం ఇచ్చారు. మహిళల కోసం ఒక కవితా పఠనం కూడా జరిగింది. సయ్యద్ అజహరుద్దీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి పశ్చిమ జిల్లా సహాయ నాజిమ్ ముహమ్మద్ మొయినుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. పురుషులు
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మూడవ బేసి రాత్రి కార్యక్రమం శనివారం నాడు నిర్వహించబడుతుందని, దీనిని హైదరాబాద్‌లోని మురాద్ నగర్ ‘షూరా’ సభ్యులు శ్రీ ముహమ్మద్ అబ్దుల్ మాలిక్ దావూది ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రకటించారు,

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు…

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు
* కనకదుర్గ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ
• సామాజిక న్యాయం సమర్థవంతమైన పరిపాలన జనసేన తోనే సాధ్యం
* వర్ధన్నపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బర్ల శివ

నేటి ధాత్రి అయినవోలు:

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్ బర్ల శివ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు వర్ధన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపన నుంచి ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తోందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా పని చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.అనంతరం వర్ధన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మరియు పున్నెలు క్రాస్ రోడ్ వద్ద గల కనకదుర్గ వృద్ధశ్రమంలో వృద్ధులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పండ్లు పంపిణీ చేశారు. వృద్ధులు సంతోషంగా ఉండి చికిత్స పొందుతున్న రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల నాయకులు కొత్తూరు అంజి, తుల శ్రావణ్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే పర్వతగిరి మండల నాయకులు సంపత్, శివ వందిత్, ఆనంద్ హాజరయ్యారు. జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు…

ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో పదవతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారం భమయ్యాయి.రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్ష లకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. బాలికలకు మండలంలో పరీక్ష కేంద్రాలు రెండు ఉండగా ఎం జె పి (బాలుర) 184 మంది బాలికల హై స్కూల్లో 140 మంది మొత్తం విద్యార్థులు 324 పరీక్షలు రాశారు.పరీక్ష లు సజావుగా నిర్వహిం చేందుకు విద్యాశాఖ అధికా రులు ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. పరీక్ష ప్రారంభానికి ముం దు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి అనంతరం కేంద్రా ల్లోకి అనుమతించారు. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
అధికారుల పర్యవేక్షణలో విద్యార్థులు ప్రశాంత వాతా వరణంలో పరీక్షలు రాయ డంతో తొలి రోజు పదవ తరగతి పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా ముగిశాయి. అధికారులు పరీక్షల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు

ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు….

ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు..
కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు బర్తే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజు జన్మదిన వేడుకలు ఎన్ఎంఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అనంతరం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

దళిత మహిళా వైస్ చైర్మన్‌కు అవమానం జరిగింది…

దళిత మహిళా వైస్ చైర్మన్‌కు అవమానం జరిగింది

ప్రోటోకాల్ పాటించని కమిషనర్ పై కలెక్టర్ కు పిర్యాదు చేస్తాం

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపాలిటీలో దళిత మహిళా వైస్ చైర్మన్‌కు అవమానం జరిగిందంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ తీవ్రంగా మండిపడ్డారు.శుక్రవారం నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో ప్రోటోకాల్‌ను పాటించకుండా వైస్ చైర్మన్‌ను వేదికపైకి ఆహ్వానించకపోవడం వివక్షకు నిదర్శనమని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా ఏకు శంకర్ మాదిగ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వడం అధికారుల బాధ్యత అని అన్నారు.ముఖ్యంగా దళిత మహిళగా ఉన్న వైస్ చైర్మన్‌ను వేదికపైకి పిలవకపోవడం తీవ్ర అవమానకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు.స్థానిక ఎమ్మెల్యే కుట్రపూరితంగానే ఎలా చేశారని ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్‌ను పూర్తిగా విస్మరించి కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు.అధికారిక కార్యక్రమాల్లో చైర్మన్,వైస్ చైర్మన్ సహా అన్ని ప్రజాప్రతినిధులను గౌరవప్రదంగా ఆహ్వానించడం విధిగా ఉండాలని తెలిపారు.ఈ ఘటనకు మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని,వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.మున్సిపాలిటీ చట్టం ప్రకారం వైస్ చైర్మన్ కు కచ్చితంగా స్థానం కల్పించాలని,కావాలని పిలవలేదా లేక వివక్షత చూపిస్తున్నారా అని ప్రశ్నించారు.బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.దళిత మహిళా నాయకురాలిని అవమానించే విధంగా జరిగిన ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.మున్సిపల్ కమిషనర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసి తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడడం అధికారుల బాధ్యత అని, ఇకపై ప్రోటోకాల్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు.

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఎజెండా…

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఎజెండా

మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఎజెండా అని మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. మున్సిపాలిటీలోని 20వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్, వైస్ ఛైర్మన్ గంధం నరేందర్,స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణితో కలిసి పర్యటించారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో అదే వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం,వీధి దీపాలు,మెరుగైన రోడ్లకై,మరియు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పట్టణ రూపురేఖలను మారుస్తామన్నారు.వార్డు కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ ఎలుకంటి విజయ్,17వ కౌన్సిలర్ అయూబ్ ఖాన్,కాంగ్రెస్ నాయకులు బైరి మురళి, బైరి కృష్ణ,శివ,తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం…

ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

రెవెన్యూ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాల మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కొక్కసారి నిర్ణీత పని వేళలను మించి పని చేయవలసి ఉంటుందని తెలిపారు.ఈ తరుణంలో రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడంతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు.కార్యాలయాలలో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పని చేయడంతో 40 సంవత్సరాల వయసుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని,నిత్యజీవితంలో వ్యాయామం ఒక భాగంగా పాటించాలని తెలిపారు.అనంతరం ఆర్.బి.హెచ్.వి. పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని,ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్ 1, 2 పరీక్ష ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.50 గం||ల వరకు,ఫిజికల్ సైన్స్,బయాలజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గం||ల నుండి 11 గం॥ ల వరకు,ఎస్.ఎస్.సి. ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్ష ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు,మినహా మిగతా పరీక్షలు ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.30 గం||ల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇందు కొరకు జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వనాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు…

ప్రకృతి వనాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

పట్టణ ప్రకృతి వనాల ద్వారా పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించి,ప్రజలకు స్వచ్ఛమైన గాలిని,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు.యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్,ఫిల్టర్ బెడ్,పట్టణం ప్రకృతి వనాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్,వైస్ ఛైర్మన్ గంధం నరేందర్ గుప్తా కౌన్సిలర్స్ బీరం భరత్ రెడ్డి,బాణాల ప్రసన్న శ్రీనివాస్, అయూబ్ ఖాన్ లతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ వీధి కుక్కలు, వాటి పిల్లుల జనాభాను శాస్త్రీయంగా నియంత్రించడానికి, రేబీస్ వ్యాధిని అరికట్టడానికి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను త్వరలో నర్సంపేట పట్టణంలో ప్రారంభించబోతున్నామని తెలిపారు.జంతువులకు స్టెరిలైజేషన్ మరియు యాంటీ-రేబీస్ టీకాలు వేసి,తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం వలన జంతువుల సంక్షేమానికి,మానవ-జంతు సంఘర్షణలను తగ్గించడానికి ఉత్తమ మార్గం అని అన్నారు.వేసవి కాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలందరికీ తాగునీరు అందించడానికి మున్సిపల్ యంత్రంగంతో తగిన చర్యలు తీసుకుంటున్నామని,నీటి ఎద్దడి తలెత్తకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

సింగిరెడ్డి భూపతిరెడ్డి .78.వ వర్ధంతి…..

సింగిరెడ్డి భూపతిరెడ్డి .78.వ వర్ధంతి…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం .లక్ష్మీ పూర్.గ్రామంలో సింగిరెడ్డి .భూపతిరెడ్డి .78.వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం లక్ష్యం పూర్ గ్రామంలో సోమ నాగరాజు ఆధ్వర్యంలో. మాదాపూర్ గుట్టలలోఅమరుడైన సింగిరెడ్డి భూపతిరెడ్డి. 78.వ. వర్ధంతి.కార్యక్రమన్నీఈరోజు లక్ష్మీపూర్ గ్రామంలోని అమరవీరులస్తూపం వద్ద పూల.దండలతో అలంకరించి నివాళులర్పించి. వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి.నటు.వంటి జిల్లా కార్యదర్శి .మందసుదర్శన్. ఏ.ఐ.టి.యు.సి. జిల్లా కార్యదర్శి పి.పి .రెడ్డి. తిరుపతి రెడ్డి. వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు. శ్రావణ.పల్లి మల్లేశం ఏ.ఐ.టి.యు.సి. జిల్లా అధ్యక్షులు అజ వేణు . బద్దం భూపతిరెడ్డిమల్లేశం.

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం….

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం….

 

తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో అలాగే లక్ష్మీపూర్ గ్రామంలోని. పిల్లల మరియు యువకులపై. దాడి వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం అరగంట వ్యవధిలోని అంకుసాపూర్ మరియు లక్ష్మి ఊరు గ్రామంలో అరగంట సమయం.లోపల రెండు గ్రామాలపై దాడి చేసి పలువురిని ప్రజలను .కరవడంజరిగింది. ఇందులో పిల్లలు చిట్యాల రానా ప్రతాప్.బోయిని నందకిషోర్. క్యారం శ్రీధర్. లపైదాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. సందర్భంగా గ్రామంలో ప్రజలు భయ ప్రాంతులకు గురవుతున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్నారని రోజు పొద్దున స్కూలుకు వెళ్లే పిల్లలకు గ్రామాల్లో ప్రజలకు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని. ఎలాగైనా సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకొని వీధి కుక్కలతో. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు గ్రామ.పంచాయతీల పాలక.వర్గాలకు తెలియజేశారు

టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి…

టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా శనివారం వరంగల్ జిల్లాలోని నర్సంపేట జెడ్పిహెచెస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్

వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని,డీఈఓ,చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరిని, వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు.కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.

విద్యార్థిని ప్రతిభకు ఘన సన్మానం…

విద్యార్థిని ప్రతిభకు ఘన సన్మానం

కేసముద్రం/ నేటి ధాత్రి

మహబూబాబాద్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ‘బాలవక్త’ పోటీలలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినిని పాఠశాలలో ఘనంగా సన్మానించారు.

మార్చి,13 శుక్రవారం మహబూబాబాద్‌లో శ్రీ వీరభద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బాలవక్త పోటీలలో కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని గోవిందు శ్రీవిద్య, డిజిటల్ విద్య వరమా, శాపమా అనే అంశంపై ప్రసంగించి ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు కీర్తి తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినిని ఘనంగా సన్మానించారు. పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని తెలిపారు. శ్రీవిద్య సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.

అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థినికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

కాలేశ్వరంకాలువ పనులకు శాశ్వత పరిష్కారం రైతులకు నీటి కష్టాలు.తీర్చనున్న ప్రభుత్వం….

కాలేశ్వరంకాలువ పనులకు శాశ్వత పరిష్కారం రైతులకు నీటి కష్టాలు.తీర్చనున్న ప్రభుత్వం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం. జిల్లెల్ల గ్రామంలో. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా. తంగళ్ళపల్లి మండలంలోని .కాలేశ్వరం 11.వ ప్యాకేజీ పరిధిలోని.LM h-4;LM-6; కాల్వ నిర్మాణ పెండింగ్ పనులకు.3.19. రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో.రైతులందరినీ కంటికి రెప్పలా కాపాడు.కుంటామని వారికి అండగా ఉంటామని. తెలియజేస్తూ. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి.కృషివల్ల మండల రైతులకు శాశ్వత పరిష్కారం.చూపినందుకు రైతులందరూ కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాప్రజా ప్రభుత్వ లో నీ మంత్రులకు నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని. రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని దేశంలో రైతులు సైనికులు ఒకటేనని. అక్కడ సైనికులు .దేశాన్ని కాపాడు.తుంటే.ఇక్కడ రైతులు ప్రజలకు వ్యవసాయం సాగు చేస్తూ. తినడానికిఆహారాన్ని అందిస్తున్నారని దేశానికి రైతే రాజు అని సందర్భంగా తెలియజేశారు . గత ప్రభుత్వంలో వారి పాలనలో నిర్లక్ష్యానికి గురైన కాల్వ పనులను ప్రజా పరిపాలన ప్రభుత్వంలొ ప్రారంభించ.బోతుందని.ఈ సందర్భంగా తెలియజేస్తూ. అనంతరం జిల్లెల్ల ఎక్స్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముందుగా. మానకొండూరు.ఎమ్మెల్యే టి.పి.సి.సి .ఎస్సీ.సెల్.రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం.పల్లి సత్యనారాయణకు తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల క్రాసింగ్ చౌరస్తాలో. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం. పలికిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు. అలాగే. మానకొండూరూ. నియోజకవర్గం. లోని ఇల్లంతకుంట.మండలంలో కొన్ని గ్రామాలకు కాళేశ్వరం కాల్వ ద్వారా. నీరు అందించే విధంగాఉండగా.గత ప్రభుత్వంలో.కాల్వలల నిర్మాణం పనులు. పట్టించుకోక పోగా ఆపి.వేయడంతో. ఇప్పుడున్న మానకొండూరుఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రభుత్వంలో సంబంధిత మంత్రులతో.మాట్లాడి వారి దృష్టికి తీసుకెళ్లి రైతులు నీటి కోసం పడుతున్న కష్టాలను నీరు లేక వ్యవసాయంచేసుకోలేక దీక్ష చేస్తున్న రైతుల విషయం వారి దృష్టికి తీసుకువెళ్లి కాల్వ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా నిధులు మంజూరు చేయించి. రైతుల కష్టాలు తీర్చే విధంగా ప్రభుత్వంలో పెద్దలను ఒప్పించి పనులు తొందరగా అయ్యే.విధంగా.చొరవ చూపించారని ప్రభుత్వంలో పెద్దలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ.విఫ్ ఆది. శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. అందరికీ చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివిధ గ్రామాల సర్పంచులు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు. మండల రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

గ్యాస్ డెలివరీలో మోసం: వినియోగదారుల ఆందోళన…

గ్యాస్ డెలివరీలో మోసం: వినియోగదారుల ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో భారత్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోయినా డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని ఆరోపిస్తూ, స్థానికులు గ్యాస్ సరఫరా వాహనాన్ని రెండు మూడు గంటల పాటు నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అద్నూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వినియోగదారులతో మాట్లాడి, గ్యాస్ సరఫరా వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వాహనం సిలిండర్ల పంపిణీని కొనసాగించింది. గ్యాస్ సరఫరాలో పారదర్శకత పాటించాలని వినియోగదారులు కోరుతున్నారు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం.

ఆరోగ్యశ్రీలో న్యూరాలజీ,యురాలజీ వ్యాధులకు సేవలు

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ రావటం వరప్రదాయం

న్యూరో ఫిజీషియన్ డాక్టర్.అమృత్ రెడ్డి, న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీ చరణ్, యూరాలజీ డాక్టర్ రఫీ అజ్మల్

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభమయ్యాయి.శనివారం న్యూరాలజీ యూరాలజీ విభాగాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలను న్యూరాలజీ విభాగం డాక్టర్ అమృత్ రెడ్డి, డాక్టర్ శ్రీ చరణ్, యూరాలజీ విభాగం డాక్టర్ రఫీ అజ్మల్ గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూరో విభాగంలో రక్తం గడ్డకట్టడం, పక్షవాతం లాంటి జబ్బులకు,యురాలజీ విభాగంలో కిడ్నీలో రాళ్లు ఇన్ఫెక్షన్, మూత్ర సంబంధిత వ్యాధులు ఆరోగ్యశ్రీ లో వైద్య సేవలు వర్తిస్తాయని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీలో ఈ విభాగాలు రావడం ఈ ప్రాంత పేద మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ బాలరాజు, చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ రాహుల్ పడాల, రేడియాలజిస్ట్ డాక్టర్ హఫీజ్,ఆరోగ్య మిత్ర కుమార్,9 వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి 10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్,ఆసుపత్రి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఖరీదైన వైద్యం ఆరోగ్యశ్రీలో రావడం అదృష్టం..

మానవ శరీరంలో అతి ముఖ్యమైన న్యూరాలజీ మెదడుకు సంబంధించిన,
యూరాలజీ కిడ్నీలకు సంబంధించిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతమైన నర్సంపేటకు రావడం ఎంతో అదృష్టమని పలువు ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్న క్రమంలో నర్సంపేటలో అందడం వలన సకాలంలో వైద్యం అందుతుందని రోగులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

33 వ వార్డులో బోరును ప్రారంభిం స్తు న్న చైర్మన్ మాదవి…

33 వ వార్డులో బోరును ప్రారంభిం స్తు న్న చైర్మన్ మాదవి

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మీడిదొడ్డి మాదవి ఎండాకాలం సందర్భంగా 33 వ వార్డు ప్రజలు చైర్మన్ దృష్టి కి తీసుకపోక పో వ డము తో చైర్మన్ వెంటనే స్పందించి త్రాగునీటి బోరు వేయి oచారని కాంగ్రెస్ పార్టీ నేత కురాగాయల రవి తెలిపారు ఈకార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ.నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారని రవి చెప్పారు న్యాయవాది కృష్ణ మోహన్ ఇంటి ఎదురుగా పురాతన మురికి కాలువ ఉన్నాదని మున్సిపల్ చైర్మన్ తనిఖీ చేసి అట్టి కాలువను బియ్యం వ్యాపారి నందు ఇంటి ముందుకు కలపాలని ప్రజలు చైర్మన్ దృష్టి కి తెచ్చారు కాలువ జాము కావడము వల్ల పంది కొక్కులూ ఎలుకలు ఇండ్లలోకి వస్తూ న్నాయని వార్డు ప్రజలు చైర్మన్ మున్సిపల్ కమిషనర్ దృష్టి కి తెచ్చారు

error: Content is protected !!
Exit mobile version