ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు….

ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి, ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్ధులు ముమ్మరంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యార్ధుల హాల్ టికెట్లు కూడా విడదలయ్యాయి. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 8096958096 వాట్సాప్ నంబరు ద్వారా కూడా హాల్టికెట్లు పొందొచ్చు.విద్యార్ధులు భయపడ కుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విద్యార్థులకు సూచించా రు.
ఈ సారి రాష్ట్ర వ్యాప్తం గా మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవు తున్నారు. వీరిలో రెగ్యుల ర్ విద్యార్థులు 5,17,727 మంది ఉన్నారు. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60, 139 మంది, 5,288 ప్రైవే ట్, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 2,50,015 మంది పరీక్షలు రాయనున్నారు.
ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్ధులు సులువుగా చేరుకునేం దుకు హాల్టికెట్ల…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version