ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు…

ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో పదవతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారం భమయ్యాయి.రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్ష లకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. బాలికలకు మండలంలో పరీక్ష కేంద్రాలు రెండు ఉండగా ఎం జె పి (బాలుర) 184 మంది బాలికల హై స్కూల్లో 140 మంది మొత్తం విద్యార్థులు 324 పరీక్షలు రాశారు.పరీక్ష లు సజావుగా నిర్వహిం చేందుకు విద్యాశాఖ అధికా రులు ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. పరీక్ష ప్రారంభానికి ముం దు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి అనంతరం కేంద్రా ల్లోకి అనుమతించారు. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
అధికారుల పర్యవేక్షణలో విద్యార్థులు ప్రశాంత వాతా వరణంలో పరీక్షలు రాయ డంతో తొలి రోజు పదవ తరగతి పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా ముగిశాయి. అధికారులు పరీక్షల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version