ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు….

ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు..
కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు బర్తే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజు జన్మదిన వేడుకలు ఎన్ఎంఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అనంతరం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

బిఆర్ఎస్ నాయకుడు విక్రమ్ జన్మదిన వేడుకలు…

బిఆర్ఎస్ నాయకుడు విక్రమ్ జన్మదిన వేడుకలు

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ,పండ్లు పంపిణీ

పరకాల నేటిధాత్రి

 

మండలం నాగారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన విక్రమ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం గ్రామంలో ఉపాధి హామీ ప్రజల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగారం గ్రామ మాజీ సర్పంచ్,పరకాల మాజీ పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్య, గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమాదేవి శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ ఏరుకొండ సంతోష్, వార్డు సభ్యులు తూముల ప్రవీణ్,జాలిగపు రాజు,తిరుపతి,గొట్టె అనిల్ ,పైడిపాలశ్రీధర్ తదితర నాయకులు,కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విక్రమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మందికి అరటిపండ్లు,చల్లా పంపిణీ చేశారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం తన లక్ష్యమని విక్రమ్ తెలిపారు.రైతులు, శ్రమజీవులు,నిరుపేదలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యలపై స్పందించే యువ నాయకుడిగా ఆయన సేవలను పలువురు ప్రశంసించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version