జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు…

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు
* కనకదుర్గ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ
• సామాజిక న్యాయం సమర్థవంతమైన పరిపాలన జనసేన తోనే సాధ్యం
* వర్ధన్నపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బర్ల శివ

నేటి ధాత్రి అయినవోలు:

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్ బర్ల శివ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు వర్ధన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపన నుంచి ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తోందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా పని చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.అనంతరం వర్ధన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మరియు పున్నెలు క్రాస్ రోడ్ వద్ద గల కనకదుర్గ వృద్ధశ్రమంలో వృద్ధులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పండ్లు పంపిణీ చేశారు. వృద్ధులు సంతోషంగా ఉండి చికిత్స పొందుతున్న రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల నాయకులు కొత్తూరు అంజి, తుల శ్రావణ్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే పర్వతగిరి మండల నాయకులు సంపత్, శివ వందిత్, ఆనంద్ హాజరయ్యారు. జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version