గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం.
ఆరోగ్యశ్రీలో న్యూరాలజీ,యురాలజీ వ్యాధులకు సేవలు
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ రావటం వరప్రదాయం
న్యూరో ఫిజీషియన్ డాక్టర్.అమృత్ రెడ్డి, న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీ చరణ్, యూరాలజీ డాక్టర్ రఫీ అజ్మల్
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభమయ్యాయి.శనివారం న్యూరాలజీ యూరాలజీ విభాగాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలను న్యూరాలజీ విభాగం డాక్టర్ అమృత్ రెడ్డి, డాక్టర్ శ్రీ చరణ్, యూరాలజీ విభాగం డాక్టర్ రఫీ అజ్మల్ గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూరో విభాగంలో రక్తం గడ్డకట్టడం, పక్షవాతం లాంటి జబ్బులకు,యురాలజీ విభాగంలో కిడ్నీలో రాళ్లు ఇన్ఫెక్షన్, మూత్ర సంబంధిత వ్యాధులు ఆరోగ్యశ్రీ లో వైద్య సేవలు వర్తిస్తాయని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీలో ఈ విభాగాలు రావడం ఈ ప్రాంత పేద మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ బాలరాజు, చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ రాహుల్ పడాల, రేడియాలజిస్ట్ డాక్టర్ హఫీజ్,ఆరోగ్య మిత్ర కుమార్,9 వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి 10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్,ఆసుపత్రి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఖరీదైన వైద్యం ఆరోగ్యశ్రీలో రావడం అదృష్టం..
మానవ శరీరంలో అతి ముఖ్యమైన న్యూరాలజీ మెదడుకు సంబంధించిన,
యూరాలజీ కిడ్నీలకు సంబంధించిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతమైన నర్సంపేటకు రావడం ఎంతో అదృష్టమని పలువు ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్న క్రమంలో నర్సంపేటలో అందడం వలన సకాలంలో వైద్యం అందుతుందని రోగులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
