విద్యార్థిని ప్రతిభకు ఘన సన్మానం
కేసముద్రం/ నేటి ధాత్రి
మహబూబాబాద్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ‘బాలవక్త’ పోటీలలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినిని పాఠశాలలో ఘనంగా సన్మానించారు.
మార్చి,13 శుక్రవారం మహబూబాబాద్‌లో శ్రీ వీరభద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బాలవక్త పోటీలలో కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని గోవిందు శ్రీవిద్య, డిజిటల్ విద్య వరమా, శాపమా అనే అంశంపై ప్రసంగించి ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు కీర్తి తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినిని ఘనంగా సన్మానించారు. పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని తెలిపారు. శ్రీవిద్య సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థినికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
