కోటగుళ్లలో నందీశ్వరుడికి రుద్రాభిషేకం

కోట గుళ్ళ లో ఘనంగా సోమవతి అమావాస్య పూజలు

గణపేశ్వరుడు, నందీశ్వరునికి రుద్రాభిషేకం

పట్టు వస్త్రాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ

భారీగా తరలివచ్చిన భక్తజనం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం సోమవతి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు జూలపల్లి నాగరాజు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నందీశ్వరునికి గణపేశ్వరునికి, పంచామృతాలతో రుద్రాభిషేక నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని, భవాని మాతను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు పూలమాలతో అలంకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు సోమవతి అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

హోం మంత్రి ఆమిత్ షాను బర్తరఫ్ చేయాలి

భారత ప్రజలకు హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో హోంమంత్రి అమిత్ షా చిత్రపటాల దహనం-నిరసన

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని తీసుకువచ్చే కుట్రలో భాగంగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవహేళనగా మాట్లాడి బహుజన సమాజాన్ని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని, భారత రాజ్యాంగంపై అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా కు ఏమాత్రం గౌరవం ఉన్న తక్షణమే భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర బిజెపి హోం మంత్రి అమిత్ షా వైఖరిని ఖండిస్తూ సోమవారం వామపక్షాల పిలుపుమేరకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అమిత్ షా చిత్రపటాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది భారత సమాజంలోని అణగారిన వర్గాల బిడ్డగా భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను నిండు పార్లమెంటులో ఏక వచనంతో సంబోధిస్తూ అవహేళనగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడడం భారత రాజ్యాంగంపై ఆయనకు బిజెపికి ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థం అవుతుందని బిజెపి మనువాద సిద్ధాంతానికి ఇది మచ్చుతునకలాగా కనపడుతుందని జనాభాలో అధిక శాతంగా ఉన్న దళితులు, గిరిజనులు, బహుజనులు అణిచివేయబడి ఉండాలనేదే బిజెపి ఆర్ఎస్ఎస్ ఉద్దేశమని, కష్టజీవులైన బహుజనులను దోచుకుంటూ అణచివేసి అగ్రవర్ణ పాలన కొనసాగించాలని బిజెపి ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ఎన్డీఏ ప్రభుత్వానికి అంబేద్కర్ పై ఏమాత్రం గౌరవం ఉన్న తక్షణమే హోం మంత్రిగా అమిత్ షాను భర్తరఫ్ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యాంగ పరిరక్షణకు లౌకికత్వానికి దేశ సమగ్రతకు సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ క్రమంలో బిజెపి ఆర్ఎస్ఎస్ మనువాద పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ నాయకులు ఎగ్గెని మల్లికార్జున్ ఐతం నాగేష్ అప్పనపురి నర్సయ్య నలవెల రవి రాయినేని ఐలయ్య జటబోయిన నరసయ్య మల్లికార్జున్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలకు అడ్డుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్, కంప చెట్లను తొలగించాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
రోడ్డు ప్రమాదాలకు అడ్డుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్,కంప చెట్లను తొలగించాలనిసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారంనేర్మట గ్రామంలో ఏర్పాటు చేసినసమావేశంలో ఆయన మాట్లాడుతూ,నేర్మట, ధోని పాముల రోడ్డు వెంటకంప చెట్లు, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయనిఆయన అన్నారు.
ఈ సమస్యపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినప్పటికీ గతంలో ఒకసారి కంపచెట్లను తొలగించారని, మళ్లీ వానలు పడటంతోవిపరీతంగా పెరిగాయనివెంటనే అధికారులు స్పందించితక్షణమే చర్యలు తీసుకోవాలనిఆయన అన్నారు.ఈ రోడ్డు పక్కన ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో ప్రమాదాలు జరగడానికి అవకాశముందనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు వెంటట్రాన్స్ఫార్మర్, కంప చెట్లు వెంటనే తొలగించాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోడ్డు వెంటకంప చెట్లను, ట్రాన్స్ ఫార్మర్ తొలగించకపోవడంతో పలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయనిఆయన అన్నారు.ఈ రోడ్డు మార్గాన్ని ఇరువైపుల వైశాల్యం పెంచి రోడ్డు విస్తరణ చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు నివారించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, యాదయ్య,గుయ్యని పండుతదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ…. అభివృద్ధి పనులను పరిశీల

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నర్సంపేట పట్టణానికి చెందిన 13వ వార్డుకు చెందిన కాసుల లక్ష్మణచారికి 60 వేల రూపాయల చెక్కును రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అందించారు.అదేవిదంగా 19వ వార్డుకు చెందిన కొలువుల రాంబాబు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందగా చికిత్సకు నిమిత్తం జరిగిన ఖర్చుకు 36 వేల రూపాయల చెక్కును వారి తల్లి కొలువుల ఉదియ, భార్య కొలువుల సుమలతలకు అందజేశారు.అదే విధంగా పలు అభివృద్ధి పనులను పెండెం రామానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పెండెం రామానంద్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తంగా, నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు, పట్టణ అభివృద్ధిలో భాగంగా పలు వార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలించి, పనులలో వేగవంతంగా పూర్తి చేయాలని వారు మాట్లాడుతూ అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, కొల్లూరి రాజు, వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండి రాజేష్, పైండ్ల పవన్, వజినపల్లి లక్ష్మయ్య, శ్రీరామోజు రమేష్, కాసుల రాజు, రంగోజు వెంకటేశ్వర్లు, తుముగంటి వీరచారి కొలువుల స్వామి, అందె రంజిత్, కాట రాహుల్, కొలువుల రాజు, మండ హరీష్, దిడ్డి రంజిత్, దిడ్డి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ ఎస్టీ కేసులలో స్టేషన్ బెయిల్ ఇవ్వొద్దు

దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి!

డిబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్..

కులవివక్షత చట్టరీత్యా నేరం

దళితులు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం

తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి సిఐ సంతోష్ కుమార్

వరంగల్/హనుమకొండ/ఆత్మకూర్,నేటిధాత్రి:

సమాజంలో దళితులపై దాడులు,దౌర్జన్యాలు,కుల వివక్షత రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఎస్సీ,ఎస్టీ కేసులలో నిందితులకు స్టేషన్ బెయిలు ఇవ్వకుండా కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు.సోమవారం ఆత్మకూరు మండలంలోని నాగయ్య పల్లిలో పంచాయితీ కార్యదర్శి సునీల్ కుమార్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాదాసి సురేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ దళితులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నాగయ్య పల్లి ఎస్సీల స్మశాన వాటికను రికార్డులో నమోదు చేసి అభివృద్ధి పరచాలని, దళితులందరికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుందని దీనిని నిర్మూలించడానికి అవగాహన కార్యక్రమాలు, కలజాత ప్రోగ్రాములు నిర్వహించాలని కోరుతూ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.తహాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి,సిఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని,దళితుల పట్ల వివక్షత చూపితే చట్టరీత్యా నేరం అవుతుందని కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.దళితులు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు జనక అశోక్,గిన్నారపు భాస్కర్,మాదాసి శ్రీనివాస్, మాదాసి రాజు, నేరెళ్ల రమణారెడ్డి,నేరెళ్ల రాజు, పోగుల ప్రశాంత్, కారోబార్ మాదాసి రాజు,ఫీల్డ్ అసిస్టెంట్ మాదాసి ప్రసాద్,అంగన్ వాడి టీచర్ పోగుల అనోధ,ఆయా గుండాల జయలక్ష్మి మధ్యాహ్న భోజన కార్మికురాలు జినుక సంధ్య తదితరులు పాల్గోన్నారు.

అక్రమ మట్టి దందాలను ఆపాలి- పర్యావరణాన్ని కాపాడాలి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర్లో,ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ కు సంబందించిన భూముల్లో నుండి ట్రాక్టర్లతోటి అక్రమంగా మట్టి తరలిస్తూ చదునుగా ఉన్న భూమిని గుంటలు చేస్తూ లక్షలాది రూపాయల మట్టి దందా ట్రాక్టర్ యజమానులు చేస్తున్నారు వెంటనే ఈ మట్టి తరలింపును ఆపించగలరని ఎం సి పి ఐ యు నాయకులు తాసిల్దార్ జోష్ణ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర్లో,ఫుడ్ ప్రాసిసింగ్ యూనిట్ కి సంబందించిన భూమిలో నుండి కొన్ని నెలల నుండి ట్రాక్టర్ యజమానులు అక్రమంగా మట్టిదందా చేస్తున్నారని ,ప్రభుత్వ అనుమతి ఇచ్చినట్టు విచ్చలవిడిగా ఈ మట్టిదందా పట్టపగలు చేస్తున్నారని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు అక్రమ మట్టి దందా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను సంపాదించుకుంటున్నారని, ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి దందా రోజుకు 20 నుండి 30 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్న కూడా సంబంధిత అధికారులు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని,అక్రమ మట్టి దందాను ఆపడం లేదని,ఈ అక్రమ మట్టి దందా వల్ల పర్యావరణం దెబ్బతింటుందని,ఇండ్ల ముందు నుండి ఈ మట్టి ట్రాక్టర్లు పోవడం వల్ల ఈ మట్టి గాలికి ఎగిరి ప్రజల కళ్ళల్లో పడుతుందని అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కావున వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని లేనియెడల ఎం సి పి ఐ యు పార్టీ ఆధ్వర్యంలో తగు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

హ్యుమన్ రైట్స్ ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా యేంపెల్లి వీరాస్వామినియామకం.

మంగపేట నేటి ధాత్రి

వరల్డ్ హ్యుమన్ రైట్స్ డే సందర్బంగా హైదరాబాద్ మల్కాజిగిరి నేరేడుమెట్ అంబేద్కర్ భవన్ లో జరిగిన హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో సమావేశం లో సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ అయ్యప్ప బరిగే సుప్రీం కోర్ట్ అడ్వాకెట్ మరియు సంస్థ గౌరవ సలహాదారు రాందాస్ తేజావత్ ఏ డి ఎన్ ఎల్ ఏ సి పి హైదరాబాద్ సిటీ మరియు తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నారాయణ రెడ్డి, భాషా ,దాసరి రఘు సమక్షంలో ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపెల్లి గ్రామానికి చెందిన యేంపెల్లి వీరస్వామిని హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది.ఈ సందర్బంగా యేంపెల్లి వీరస్వామి మాట్లాడుతూ నన్ను హ్యుమన్ రైట్స్ ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్, సుప్రీం కోర్ట్ అడ్వాకెట్ అయ్యప్ప బరిగే కి మరియు నేషనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నాయకులందరికి పేరు, పేరున,ధన్యవాదములు తెలియజేస్తూ, నా మీద నమ్మకం తో ములుగు జిల్లా బాధ్యతలు అప్పజెప్పినందుకు , సమాజం లో జరుగుతున్న కులం, మతం, ప్రాంతం,మహిళలు, బాలకార్మికుల,మానవ హక్కులపై జరిగే అన్నిరకాల హింసలను, వివక్ష తలను,అసమానాతలనపై రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో చట్టభద్ధంగా, న్యాయబదంగా, ధర్మబదంగా, మానవ హక్కుల ప్రధాత ప్రపంచ నాయకుడు, యుగపురుషుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమస్యల పరిస్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానని, ములుగు జిల్లా ను తెలంగాణ రాష్ట్రం లో ముందువరసలో నిలబెడతానని తెలియజేస్తున్నాను అని అన్నారు

ఏకశిల కళాశాల పైన చర్యలు తీసుకోవాలి

కలెక్టర్ ప్రావీణ్య కి వినతి పత్రం ఇచ్చిన బిఎస్యు, ఎబిఎస్ఎఫ్ నాయకులు

హన్మకొండ, నేటిధాత్రి :

బి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద సురేష్
ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
24 వ తేదీన శ్రీ దేవి గుగులోత్ ఆత్మహత్య కు ఏకశీల యాజమాన్యం బాధ్యత వహించాలని అన్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మనోవేదనకు గురిచేస్తూ ఆత్మహత్యకు కారణం అయిన కళాశాల పర్మిషన్ రద్దు చేయాలనీ వినతి పత్రంలో కోరినట్టు తెలిపారు. అడ్డగోలుగా అనుమతి లేకుండా హాస్టల్స్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని అన్నారు.కళాశాల హాస్టల్స్ పేరుతో విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్న అన్ని హాస్టల్స్ ను రద్దు చేయాలనీ కోరమన్నారు.

మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరైన బీఆర్ఎస్ నేతలు

నాగర్ కర్నూల్ : నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగి రెడ్డి ఏకాదశ దినకర్మ కార్యక్రమానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సైదులు బిఆర్ఎస్వి నాయకులు సిద్ధగొని నరేష్ గౌడ్, రవి తదితరులు ఉన్నారు.

సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి

మరిపెడ నేటిధాత్రి.

సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అందరిని రెగ్యులరైజ్ చేయాలని పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో గత 25 రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా చాలిచాలని వేతనాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేసి,ఈ సమ్మె విరమించడానికి ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరపాలని కోరారు. ఉపాధ్యాయినీలను అక్రమంగా డెప్యుటేషన్ పై కెజిబివి లకు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు.సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.మండలంలోని ఉపాధ్యాయులు కూడా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచి వారి పాఠశాలలకు ఎవరు కూడా వెళ్ళకుండా సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్,సిఆర్పీలు రవీందర్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ నరేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఎవ్వరూ డీజే లు వినియోగించరాదు
రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేయడం రోడ్లపై కేకులు కట్ చేయడం లాంటివి చేయరాదు
మద్యం తాగి వాహనాలు నడపరాదు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారిపై చట్టపరంగా చర్య తీసుకుని జైలుకు పంపబడును అలాగే వాహనాలు సీజ్ చేయబడును
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి ఈవెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కనుక ప్రజలందరూ వారి వారి ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవలెను
రోడ్లపై ఎవరూ కూడా ఎటువంటి మరణాయుధాలతో తిరగరాదు
నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా గస్తీ నిర్వహించే పోలీసులకు సహకరించి వారి సూచనలు పాటించగలరు
నూతన సంవత్సర వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు ఎవరైనా పై నిబంధనలు ఉల్లంఘించిన చట్ట ప్రకారం చర్య తీసుకోబడును అదేవిధంగా శాంతి భద్రతల విషయమై ఎటువంటి సమాచారం ఉన్న డయల్ 100 కి ఫోన్ చేయగలరు. భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ తెలిపారు

న్యూ ఇయర్ వేడుకల్ని కుటుంబంతో జరుపుకోవాలి

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల ప్రజలు, నాయకులు,యువకులు నూతన సంవత్సర వేడుకలను కుంటుంబ సభ్యులతో ఇళ్లల్లో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.రామగుండం సిపి శ్రీనివాస్,ఏసీపీ వెంకటేశ్వర్లు,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ 31న పోలీస్ సిబ్బందితో రాత్రి వేళలో తనిఖీలు చేపడతామని,నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని సూచించారు.అర్ధరాత్రి ఒంటిగంటలోపు వేడుకలను ముగించుకోవాలని,వేడుకల పేరిట ఎవరికైనా ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రధాన రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,మద్యం సేవించి వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై మీ పైనే ఆధారపడ్డ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని,అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే గ్రీటింగ్ పోస్టులతో సైబర్ మోసగాళ్లు చీటింగ్ కి పాల్పడే అవకాశం ఉంటుందని,సైబర్ మోసగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.

ప్రజావాణి లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు . అధికారులకు పెండింగ్ లో ఉంచకుండా చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలనుండి వచ్చిన ఫిర్యాదులు అధికారులు పెండింగులో ఉంచకుండ పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి లో జిల్లా అధికారులు పాల్గొన్నారు

జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి

జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 2024 సంవత్సరం కు సంబంధించిన వార్షిక క్రైం రిపోర్టు పై నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎస్పి మాట్లాడారు. 2024 సంవత్సరం లో జరిగిన నేరాలు, నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, నేరాల నియంత్రణ కు తీసుకొన్న ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై మీడియా సమావేశంలో వివరించారు.

సమాజంలో శాంతిని నెలకొల్పడంలో, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పి అన్నారు. నేరాలను నివారించడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎస్పి కిరణ్ ఖరే. పేర్కొన్నారు.

గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తో పాటు, 2024 సంవత్సరంలో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పార్లమెంటు ఎన్నికలు, వీవీఐపీ, ఇతర విఐపి ల పర్యటనలు, వివిధ పoడుగల సమయంలో కట్టుదిట్టమయిన చర్యలు తీసుకున్నట్టు ఎస్పి తెలిపారు. గత సంవత్సరంలో జిల్లా పరిధిలో 3062 కేసులు నమోదవ్వగా, ఈ సంవత్సరం డిసెంబర్ 27 వరకు 3306 కేసులు నమోదు అయ్యాయని, ఎస్పి వివరించారు.
వివిధ రకాల నివారణా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించగలిగామని, ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, డ్రంకన్ డ్రైవ్ లను గణనీయంగా తగ్గించామని, నేరాలకు పాల్పడకుండా నియంత్రిస్తూ, ప్రజలకు భరోసా కల్పించామని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, భరోసా సెంటర్ల ఏర్పాటు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లపై పాఠశాల, కళాశాలల, మెడికల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, భరోసాను నింపామని ఎస్పి పేర్కొన్నారు.
ఇంతేకాక గ్రామాల్లో, పట్టణాల్లో దొంగతనాలు నివారణ కోసం సీసీ కెమెరాల ఆవస్యకతను వివరించామని, డ్రగ్స్, గoజాయిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని ఎస్పి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, డీఎస్పీ నారాయణ నాయక్, DCRB ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.

శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైంకర్య సేవలు విష్ణు సహస్ర నామ భక్తులు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సోమవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైంకర్య సేవలు విష్ణు సహస్రనామ నిత్య పారాయణ భక్తులు పాల్గొన్నారని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ తెలిపారు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల పూలమాల కైంకారియ సేవలో పాల్గొనే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదించాలని ఆలయ చైర్మన్ భక్తులకు విజ్ఞప్తి టిఆర్ఎస్ నాయకులు బీచ్ పల్లి యాదవ్ స్వామి వనపర్తి ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కట్టసుబ్బయ్య పండరయ్య ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షల దంపతులు భక్తులు పాల్గొన్నారు

ఘనంగా కొమురవెల్లి శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

కొమురవెల్లి నేటి ధాత్రి ప్రతినిధి

ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో శ్రీ శ్రీ శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ మల్లన్న స్వామి కళ్యాణం జరిగినది బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్ములను శ్రీ మల్లికార్జునుడు మనువాడినారు.శివసత్తులసిగాలు, జోగినులు, పోతరాజు ల విన్యాసాలు, పూనకాలు, బోనాలు, డప్పు దరువుల తో కోరమీసాల మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మ తో స్వామి కొలువు దీరి కొమురవెల్లి మల్లన్న క్షేత్రం శివనామస్మరణతో మారు మోగింది ప్రతిఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహిం చే కల్యాణంతో బ్రహ్మోత్స వాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే ఆదివారం నుంచి ఫాల్గుణ మాసం చివరి ఆదివారం రాత్రి నిర్వహించే అగ్ని గుండాల తో మహా జాతర ముగు స్తుంది. మల్లన్న కల్యాణోత్స వంతో మహా జాతర ప్రారం భం కానున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రా న్ని అందంగా ముస్తాబు చేశారు. అశేష జనవాహి నికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మల్లన్న కల్యాణం కాశీ పీఠాధిపతి శ్రీమద్ జ్ఞాన సింహాసనాధీశ్వర 1008 జగద్గురు మల్లికా ర్జున విశ్వ రాధ్యా శివ చార్య పర్యవేక్షణలో వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లన్న కల్యాణం జరిగినది వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న గారి వంశస్తులు, వధువులు మేడలాంబ, కేతమ్మ తరపు న మహాదేవుని వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరిం చనున్నారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పురోహితులు. కల్యాణ మహోత్సవానికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జనగామ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఏ సి పి వాసాల సతీష్ సీఐ ఎల్ శ్రీను ఆధ్వర్యంలో 400 మంది పోలీస్ సిబ్బందితో జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు

కౌన్సిలర్ బెదిరింపులకు భయపడేది లేదు

సిపిఐ 25వ వార్డ్ మహిళ విభాగం. నాయకురాలు పెద్దమాముల సంధ్య, బల్ల సత్యవతి.

భూపాలపల్లి నేటిధాత్రి

కారల్ మార్క్స్ కాలనీ 25 వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతు.. మహిళలు సమస్యల గురించి మాట్లాడితే.. కాలనీలో అందుబాటులో లేకుండా.. వేరొక చోట ఉంటూ అందుబాటులో లేడని మాట్లాడితే మాట్లాడిన మహిళలపై ఎదురుదాడి చేయడం సిగ్గు సిగ్గు అని 25 వ వార్డు సిపిఐ మహిళా సంఘం నాయకురాలు.. పెద్దమాముల సంధ్య, బల్ల సత్యవతి అన్నారు స్థానిక రావి నారాయణరెడ్డి భవన్లో వారు మాట్లాడుతూ.. గత మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ తరఫున గెలిచి అభివృద్ధి పేరిట మూడు పార్టీలు మారి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి, అందుబాటులో ఉంటాడని ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఇక్కడి నుండి వెళ్లి వేరొక చోట నివాసం ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు, కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా వాటర్ సమస్య, కోతుల బెడద, కుక్కల బెడద, అంతర్గత పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్లు, ఇవే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్న చెప్పుకుందామని అనుకుంటే అందుబాటులో లేకుండా వేరొక చోట ఉండడంవల్ల స్థానిక మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన తరుణంలో ఎవరైతే సమస్య పరిష్కరించాలని కోరుతారో వారి మీద మీరు గొడవ చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అని, ఒక్క సిపిఐ పార్టీ వల్లనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఇష్టం వచ్చినట్లు బెదిరించే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు, సిపిఐ పార్టీ వల్లనే నువ్వు కౌన్సిలర్ గా గెలిచావు అనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు మీరు కాలనీలో ఉండి సమస్యలు పరిష్కరించాలి తప్ప, సమస్య తీసుకపోయిన వారి పైన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ 25వ వార్డు మహిళా నాయకురాలు.. పల్లెర్ల రజిత, నాగమణి, తోపాటు మిగతా నాయకురాలు పాల్గొన్నారు..

మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన అంగన్వాడి సిబ్బంది.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సెక్టార్ మీటింగ్ జయప్రద సూపర్వైజరు సమక్షంలో రామచంద్రపురం అంగన్వాడీ కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వర్గస్తు లు అయినందుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. సెక్టార్ మీటింగ్ ఎజెండా అంశాలు 2024 సంవత్సరము ముగియడంతో ఈ సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. ముగ్గురు మినీ అంగన్వాడీ టీచర్స్ కు మెయిన్ టీచర్స్ గా ముగ్గురుఆయాలకు టీచర్స్ గా టోటల్గా జిల్లా కలెక్టర్ గారు డిడబ్ల్యూఓ గారు కలిసి ఈ సంవత్సరం 6 గురు ఆయాలకు టీచర్స్ గా ప్రమోషన్స్ ఇప్పించి పది ఓన్ బిల్డింగ్ లకు పెయింటింగ్ రిపేర్ చేయించడం జరిగింది. 4 అంగన్వాడి కేంద్రాలకు టీవీలు ఇప్పించడం ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు బలోపేతం చేయడానికి మండలంలో మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి ప్రీ స్కూల్ కిట్టులను ప్రతి అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పించారు. ఈ సమావేశంలో ముందస్తుగా 2025 సంవత్సరానికి కేక్ కట్ చేసి స్వాగతం తెలుపుతూ వచ్చే సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు శాతం పెంచుకోవాలని వివరించడం జరిగింది. జీ జయప్రద సూపర్వైజర్ 30 మంది అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు.

ఇండ్ల సర్వేలో నిరుపేదల పేర్లు ఆన్ లైన్ లో గల్లంతు

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలోని గ్రామాలలో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదల పేర్లు ఆల్ లైన్ లో చూపెట్టడం లేదు పంచాయతీ కార్యదర్శులు ఇంటింటి సర్వలో భాగంగా కొంతమంది పేర్లు కనబడటం లేదు మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు వచ్చి సర్వే నిర్వహిస్తామని చెప్తున్నారు అసలైన నిరుపేదల పేర్లు ఆన్ లైన్ లో కనపడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మా పేర్లు ఎందుకు కనబడవు మేము కూడా దరఖాస్తు చేసుకున్నాము అని చెప్తున్నారు ఇలాంటి మిస్టిక్ జరగడానికి అధికారులు కారణమని ఆరోపిస్తున్నాం డబుల్ బెడ్ రూములు ఇల్లు లేని నిరుపేదలకు అందే విధంగా సర్వే నిర్వహిస్తుంది ప్రభుత్వం కానీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అసలైన లబ్ధిదారుల పేర్లు ఆన్ లైన్ లో కనబడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు తక్షణమే నిరుపేదల ఇండ్లను సర్వే నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నీ డిమాండ్ చేస్తా ఉన్నాం .. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చే విధంగా అసలైన నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే ఎవరికైతే ఆన్ లైన్ లో పేర్లు లేవు వాళ్ల అందరి పేర్లు ఎక్కించి సర్వే నిర్వహించాలని అన్నారు లేకపోతే వాళ్ళందరినీ సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పేసి అన్నారు సంగీ రాజు జీడి రాజు బండారి రాజయ్య పాల్గొన్నారు

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏ వై ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి :

సోమవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన నేరేళ్ళ సమ్మయ్య తండ్రి రాజపోషయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించినాడని తెలుపుటకు చింతిస్తున్నాము. మృతుని కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ* ఆధ్వర్యంలో పరమార్శించి మృతుని చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు . అనంతరం సంతాపం తెలిపి ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మండల నాయకుడు గుర్రం అశోక్ ధర్మ సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నేరేల్ల రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version