మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
చిన్ననాటినుండి ఆటలే తన ఊపిరిగా పాఠశాల తరగతి గదికంటే పాఠశాలలోని. క్రీడా మైదానంలోనే ఎక్కువ సమయం గడుపేందుకు ఇష్టపడే దండు తిరుపతి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ను ఆదర్శంగా తీసుకొని తన ఆటతిరుతో క్రీడాభిమానుల మన్ననలు చురగొన్న ఆటగాడు దండు తిరుపతి, గ్రామస్థాయి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకొని క్రికెట్ లో మెలుకువలు నేర్చుకొని తన ప్రతిభను చాటుకున్న దండు తిరుపతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ క్రికెట్ పోటీలు నిర్వహించిన తనతోటి క్రాడాకారులతో వెల్లి తన ప్రతిభతో విజయాన్ని అందిందించేవాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా తన సత్తా చాటవాడు. అలాంటి క్రీడాకారుడుగా మంచి గుర్తింపు పొందుతున్న సమయంలో అనారోగ్యం సరిగా లేకపోవడం కారణంగా ఇంటికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు తన ఇంటినే స్టేడియంలా మార్చి మిత్రులతో క్రికెట్ మ్యాచ్ ను టెలివిజన్ ద్వారా విక్షించెవారమని తనతో సరదాగా గడిపిన క్షణాలు తిరిగిరావంటూ మిత్రులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆత్మకు శాంతిః చేకూరాలని మిత్రునికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో చెక్క శ్రీధర్, మహేష్ విక్రమ్ దిలీప్ శ్రీనివాస్ నాగరాజు కిషోర్ రాజు సీనియర్ ప్లేయర్ దేవుడు కుమార్ కోటి గుర్రపు కొడారి రాజ నరేష రాజన్న ఇంకేందిరాపాల్గొన్నారు
క్రీడాకారుని అంత్యక్రియల్లో పాల్గొన్న క్రీడాకారులు
