పరకాల నేటిధాత్రి
బుధవారం రోజున పరకాల పట్టణంలోని 2వ వార్డులో ములుగు జిల్లా పంచాయితీ అధికారి ఒంటేరు దేవరాజు తండ్రి ఒంటేరు సారయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.భాదిత కుటుంబాన్ని బిఎస్పీ పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవళి సారయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు ఆర్పించారు.అనంతరం మడికొండ రవళి మాట్లాడుతు సారయ్య కాయకష్టం చేసి తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించి నేడు జిల్లా అధికారిగా చేసారని అందువలన సారయ్య ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.ప్రతి తల్లి తండ్రులు సారయ్యను ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను కూడా ఉన్నత స్థాయిలో ఉంచాలని కోరారు.
సారయ్య పార్దివదేహానికి నివాళులు అర్పించిన బిఎస్పీ పట్టణ అధ్యక్షురాలు రవళి
