భద్రాచలం నేటి ధాత్రి
ఆకలి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది
సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు
పోరాటాలే ఎజెండాగా అశోక్ నగర్ శాఖ మహాసభ.
కమ్యూనిస్టుల పని అయిపోయిందని కమ్యూనిజానికి కాలం చెల్లిందని కారు కూతలు కూసే మత ఛాందసవాదులకు శ్రీలంక ఎన్నికల ఫలితాలు ఒక చెంపపెట్టు లాంటిది అని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. బుధవారం అశోక్ నగర్ శాఖ ఏడవ మహాసభ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ సమాజంలో ఆకలి బాధలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని సమస్యలు ఉన్నంతకాలం పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. దేశంలో రోజు,రోజుకు పెరిగిపోతున్న మతోన్మాదులకు బుద్ధి చెప్పేది ఒక కమ్యూనిస్టు పార్టీ లేనని అన్నారు. రాష్ట్రంలో కూడా పోరాటాలను ప్రారంభించే సమయం ఆసన్నమైందని ఎన్నికల అప్పుడు రేవంత్ ఇచ్చిన ఐదు గ్యారెంటీ లపై పోరాటాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అశోక్ నగర్ కాలనీలో నెలకొన్న స్థానిక సమస్యలను అధ్యయనం చేసి ఈ మహాసభల వేదికలో పోరాటం రూపొందించుకోవాలని ప్రజా సమస్యలపై పోరాటాలే ఎజెండాగా మహాసభలు నిర్మించాలని మచ్చా కోరారు. శాఖ నుండి ఆల్ ఇండియా వరకు సాగే మహాసభలలో భవిష్యత్తు ఉద్యమాలకు కావలసిన పలు తీర్మానాలను మహాసభలు ఆమోదిస్తున్నాయని ఈ మహాసభలకు ప్రజల నుండి కూడా అపూర్వ స్పందన కలుగుతుందని మచ్చ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్ అధ్యక్షత వహించగా మాజీ పార్లమెంట్ సభ్యులు విజయం బాబురావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట రామారావు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించగా పట్టణ కమిటీ సభ్యులు నాగరాజు, డి సీతాలక్ష్మి స్థానిక నాయకులు డి సతీష్ బాబు పుణ్యవతి తడికల కుమారి గణపతి అమ్మ, సూరమ్మ, సావిత్రమ్మ, రాణి ,వెంకటేశ్వర్లు, శివకుమారి, సీతమ్మ ,రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు