భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్, ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయనున్న భద్రాచలం మాజీ జడ్పీటీసీ గుండు శరత్
భద్రాచలం, సెప్టెంబర్ 25:ఏజెన్సీ లో చట్ట విరద్దుo గా గిరిజన ఇసుక క్వార్రీల పేరు తో డబ్బులు వసూలు చేస్తున్న వారి పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని మాజి జడ్పీటీసీ గుండు శరత్ డిమాండ్ చేశారు.
బుధవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండు రోజులుగాఒక పత్రిక లో వరుస ఇసుక క్వారీ ల పేరా 7కోట్లు పెట్టుబడులు కథానాలు పై భద్రాచలం మాజి జడ్పీటీసీ గుండు శరత్ స్పందించి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోఈ విషసoస్కృతి మూలంగా గిరిజన ఇసుక సొసైటీలు నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యకత్తo చేశారు. పెట్టుబడుల్లో పోలీస్ శాఖావారి ప్రమేయం ఉన్నాయని ఆరోపణలు తో విచారణ కు ఎస్పీ బాధ్యత తీసుకోవాలి అని డిమాoడ్ చేశారు. ఏజెన్సీగిరిజన ఇసుక సొసైటీ ల్లో బినామీల పాత్ర పై త్వరలో గిరిజన సంఘాలతో ఉద్యయo చేపడతామని భద్రాచల మాజీ జడ్పిటిసి గుండు శరత్ హెచ్చరిoచారు.