nidithudipia pd act, నిందితుడిపై పీడీ యాక్ట్‌

నిందితుడిపై పీడీ యాక్ట్‌

– వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెళ్లికి నిరాకరించినందుకు విద్యార్థినిని హతమార్చిన నిందితుడిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేశారు. హన్మకొండ పరిధిలోని కిషన్‌పుర ప్రాంతంలో సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన భాధితురాలు తోపుచర్ల రవళి అనే విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన నిందితుడు వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన పెండ్యాల సాయి అన్వేష్‌పై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంపత్‌రావు కేంద్రకారాగారంలో నిందితుడికి జైలర్‌ సమక్షంలో పీ.డీ యాక్ట్‌ నిర్బంధ ఉత్తర్వులను అందజేశారు. నిందితుడు పెండ్యాల సాయి అన్వేష్‌ హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివాహనికి అంగకరించలేదని సంగెం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన తోపుచర్ల రవళిని ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదిన విధ్యార్థిని తోపుచర్ల రవళిపై పెట్రోల్‌పోసి నిప్పంటించడంతో బాధితురాలు రవళి మార్చి 4వ తేదిన హైదరాబాద్‌ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన సంఘటనపై నిందితుడిపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీ చేశామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇకపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఇలాంటి నిందితులు పాల్పడిన నేరాలను కోర్టులో నిరూపించి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి చేసుకుంటానే సాకుతో వేధింపులకు గురవుతున్న విధ్యార్థినులు మౌనంగా ఉండకుండా తమ సమస్యను పోలీస్‌ అధికారులు, తమ తల్లిదండ్రుల దష్టికి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారిపై చట్టపరిధిలో కఠినచర్యలు తీసుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *