తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో మోరే రవీందర్ రెడ్డి
* ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు
మొగులపల్లి నేటి ధాత్రి
తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించి భావితరాలకు అందించాలని బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్ నేతృత్వంలో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మోరే రవీందర్ రెడ్డి ప్రజలను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దేశానికంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే..హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం రజాకార్ల పాలనలో మగ్గింది. తెలంగాణలో నిజాం రజాకర్ల ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది. నిజాం రజాకార్లు ఇళ్లలోకి చొరబడి మగవాళ్లను కాల్చి చంపుతూ..ఆడవాళ్లను మానభంగాలు చేస్తూ..బరిబాత బతుకమ్మలను ఆడిస్తూ..వార్తలు రాసిన విలేకర్ల చేతులను నరికేస్తూ..నరకయాతనను చూపిస్తున్న రజాకారులపై తెలంగాణ ప్రజలు తిరగబడేడంతో..నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరత్వంతో తెలంగాణ విముక్తమైంది. నాటి చరిత్రను తెలంగాణకు రాబోయే పౌరులకు అందించి..తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. విమోచనమా..లేకుంటే ఎంఐఎం పార్టీతో స్నేహమా..? అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రవీందర్ రెడ్డి హెచ్చరించారు.అదే విదంగా ప్రపంచం నేచ్చిన నేత మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. అనంతరం కేకు కట్ చేసి స్విట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు కుమ్మరి సారయ్య బండారి రవీందర్, వేముల రాజయ్య,మోరే వేణుగోపాల్ రెడ్డి,బండారి శ్రీనివాస్ పులి వెంకట్ రెడ్డి,పోతుగంటి సాయిలు, సమ్మోజు భాస్కర్, బల్గురి కిషన్ రావు వైనాల ప్రియాంక శివకుమార్,తెప్ప రాజు అనుముల శ్రీనివాస్, గూడూరి మహిపాల్ రెడ్డి, జన్నె దిలీప్ రాజేశం, కాక్కర్ల వీరన్న, నర్సింహా రాములు తదితరులు
తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించాలి
