పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.
ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
వేములవాడ నేటిధాత్రి
ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..
ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.