కాశీకి వెళుతూ..”నలుగురు భక్తుల దుర్మరణం”..!
మృతుల్లో ఇద్దరు భార్యా, భర్తలు
మరో ముగ్గురి పరిస్థితి విషమం..
జహీరాబాద్. నేటి ధాత్రి:
ప్రయాగ్ రాజ్ లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, మామిడిగి, గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (46) (ఇరిగేషన్ డి ఈ), భార్య విలాసిని (40), మల్గి గ్రామానికి చెందిన మల్ రెడ్డి (40)తో పాటు కారు డ్రైవర్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి ప్రయాగ్ రాజ్, త్రివేణి సంగమంలో స్నానాలు చేపట్టిన అనంతరం శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించు కునేందుకు బయలు దేరుతుండగా మార్గమధ్యలో రాత్రి 10:40 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.