తూర్పు హైదరాబాద్ ప్రాంత వాసులకు ఎంతో సౌకర్యం
నగరంలో చర్లపల్లి ఐదో టెర్మినల్
ఇక్కడికి చేరుకోవడానికి అప్రోచ్ రోడ్లు అవసరం
అమృత్‌భారత్ పథకం తెలంగాణలో 38 రైల్వేస్టేషన్ల అభివృద్ధి
స్థానిక అభివృద్ధి నమూనాలుగా రైల్వే స్టేషన్లు
త్వరలో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు
ఆధునికత దిశగా దూసుకెళుతున్న రైల్వేలు
షంషాబాద్ ఎయిర్పోర్ట్ స్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి
హైదరాబాద్,నేటిధాత్రి:
సుమారు రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సోమవారం ప్రధానిన రేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ ప్రారంభం కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు వర్చువల్‌గా హాజరయ్యారు. నిజానికి ఈ టెర్మినల్‌ను ప్రారంభించడానికి డిసెంబర్ 28 ముహూర్తంగా నిర్ణయించినా ఆరోజున మాజీ ప్రధాని మన్మో హన్‌సింగ్ దివంగతులు కావడం ప్రభుత్వం వారంరోజులు సంతాప దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో వాయిదా పడిరది. ప్రస్తుతం ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో సికింద్రాబాద్,నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైవత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. విశేషమేంటంటే ఈ టెర్మినల్ ఔటర్ రింగ్‌రోడ్డుకు దగ్గర వుండటం వల్ల నగరవాసులకు ఇక్కడికి చేరుకోవడం సులభమవుతుందని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రవాణాపరంగా మౌలిక సదుపాయాలను విస్తృతం చేసేందుకు కృషిచేస్తోంది. ఇందులో భాగమే రైల్వే రవాణా వ్యవస్థను కూడా మరింత సౌకర్యవంతంగా, వేగంగా గమ్యాలకు చేర్చే రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని ప్రారంభించిన చర్లపల్లి టెర్మినల్ అత్యంత ఆధునిక సదుపాయాలతో విమానాశ్రయానికి తీసిపోని రీతిలో నిర్మించడం విశేషం. ఈ టెర్మినల్ ప్రారంభంతో త్వరలో చాలా రైళ్లు ఇక్కడినుంచే ప్రారంభం కావడం లేదా, సికింద్రాబాద్‌తో పనిలేకుండా ఇక్కడినుం రూటు మార్చుకొని ప్రయాణించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం కింద దేశంలోని రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగానే వందేభారత్, అమృత్‌భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. త్వరలోనే దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగెత్తనుంది.
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హైవేలు, రైలు మార్గాలు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, రైళ్ల వేగం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆ దిశగా కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తోంది. గత పదేళ్ల కాలంలో 30వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణా న్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ఈ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బందరు పోర్టుకు రైల్వేలైన్ కోసం విజ్ఞప్తి చేయడం గమనార్హం. నిజానికి తెలంగాణకు సముద్రతీరం లేకపోవడం ఒక లోపం. ఈ కనెక్టివిటీ కావాలంటే అంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్టుకు కనెక్టివిటీ వున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో తయారయ్యే వస్తువుల ఎగుమతులు, అవసరమైన దిగుమతులు చేసుకోవడానికి అనువుగా వుండగలదు. అదీకాకుండా హైదరాబాద్ ప్రస్తుతం ఫార్మా హబ్‌గా కొనసాగుతున్నదన్న సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా 374 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో, రీజినల్ రైల్ రింగ్ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రైల్ రింగ్ సదుపాయం కల్పించమని ప్రధాని నరేంద్రమోదీని కోరడం విశేషం. అదేవిధంగా వికారాబాద్ నుంచి కొండగల్ మీదుగా కర్ణా కకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ స్థాయికి చేరుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అందించాలని ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు.
నిజం చెప్పాలంటే వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడం మనదేశంలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. ప్రస్తుతం రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు రైల్వేశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇదిలావుండగా ఇక ముందునుంచి చాలా రైళ్లు ఇక్కడినుంచే ప్రారంభం కావడంతో, ప్రయాణికులు ట్రాఫిక్ అగచాట్లు లేకుండా ఇక్కడికి చేరుకోగలుగుతారు. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఘటకేసర్‌కు ఈ స్టేషన్ ద్వారానే వెళ్లడం వల్ల ప్రయాణికులకు ఇక్కడికి చేరుకోవడానికి రవాణాపరంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం వుండదు. ప్రస్తుతం రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 1300 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. రూ.720కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కూడా ఇందులో భాగమే. ఇప్పటివరకు తెలంగాణకు ఐదు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కాజీపేటలో రైల్వే తయారీ కర్మాగారం నిర్మాణంలో వుంది. చర్లపల్లి స్టేషన్‌కు రావాలంటే అప్రోచ్‌రోడ్ల నిర్మాణం జరగాల్సివుంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అంతేకాదు ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను మరింతగా విస్తరించాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు మరింత సదుపాయం ఏర్పడగలదు. ప్రస్తుతం తెలంగాణలో రూ.2వేల కోట్లతో కేంద్రం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది.
ప్రస్తుతం చర్లపల్లి టెర్మినల్‌ను నేటి ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇందులో ఆరు టిక్కెట్ కౌంటర్లు, స్త్రీ`పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు నిర్మించారు. మొత్తం 9 ప్లాట్‌ఫా రాలు అందుబాటులో వుండగా, ఒక ప్లాట్‌ఫాం నుంచి మరోదానికి తేలిగ్గా వెళ్లేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫూట్‌ఒవర్ బ్రిడ్జి, ఆరు మీటర్ల వెడల్పుతో మరో ఫూట్‌ఒవర్ బ్రిడ్జిని నిర్మిం చారు. బస్సులు, కార్లు ఇతర వాహనాలకోసం విశాలమైన పార్కింగ్ సదుపాయం కూడా వుంది. ఇదిలావుండగా ఈ రైల్వే టెర్మినల్ నుంచి అదనంగా 15 జతల రైళ్లను నడపవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి తూర్పు భాగంలో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం జరగడం వల్ల ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ స్టేషన్ వల్ల ఈ ప్రాంతాల ప్రజలకు రవాణాపరంగా ఎంతో ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం జంట నగరాలకు సి కింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి టెర్మినల్స్ వుండగా చర్లపల్లి ఐదో టెర్మినల్ కాను న్నది. స్టేషన్ మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్లు, రెస్ట్ రూం సదుపాయాలను కల్పించారు. స్టేషన్లో వున్న మొత్తం 9 ప్లాట్‌ఫారాలకు ఏడు లిఫ్ట్‌లు, ఆరు ఎస్కలేటర్ల సదుపాయం కల్పించారు. ఇదిలావుండగా చర్లపల్లిలో కోచ్‌ల నిర్వహణ సదుయాన్ని కూడా అందుబాటు లోకి తేవడం గమనార్హం.
అమృత్‌భారత్ పథకం కింద దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలోని 38 రైల్వేస్టేషన్లను రూ.1830.4కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే చర్లపల్లిని ‘శాటిలైట్ టెర్మినల్’గా రూపొందించారు. ఈవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆయా ప్రాంతాలకు రైల్వే స్టే షన్లు అభివృద్ధి నమూనాలుగా రూపొందగలవని ద.మ.రైల్వే అంచనా వేస్తోంది. ఈ అన్ని ప్రాజె క్టులకు ప్రధాని నరేంద్రమోదీ 2023లో శంకుస్థాపనలు చేశారు. ఇదిలావుండగా ప్రస్తుతం రూ.720కోట్లతో అభివృద్ధి చేస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, షంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దీటుగా తయారవుతుందని చెబుతున్నారు. 2025 డిసెంబర్ నాటికి ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్‌గా సికిం ద్రాబాద్ ప్రారంభమవుతుందని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలపడం గమనార్హం. ఎంఎంటీఎస్ సర్వీసులను యాదాద్రివరకు పొడిగించడానికి వీలుగా టెండర్లను పిలిచినట్లు కూడా ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో 268 రోడ్స్ అండర్ బ్రిడ్జ్‌లు (ఆర్యూబీ), 42 ఫూట్‌ఒవర్ వంతెనల నిర్మాణం పూర్తయ్యాయని కూడా కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 176 రైల్వేస్టేషన్లలో హై స్పీడ్ వైఫై సదుపాయాన్ని కల్పించారు.