‘‘బొంతు’’…బరితెగింపు?
పార్టీ పరువు తీయడమే అంతరంగమా? గోడ దూకడం కోసమే ఎత్తుగడా? పార్టీ పెద్దలను కూడా ఎదిరించగలనని సంకేతమా? ప్రతిపక్షాలు తనవైపు చూడడం కోసమేనా? అసమ్మతి నేతలతో బొంతు మంతనాలు నిజమేనా? ఒక్కసారి మేయరైతేనే ఇంత హంగామానా? ఎంత సంపాదించకపోతే అంత అతివిశ్వాసముండునా? ఇంత హంగామా ఎవరూ చేయలేదు? ఉప్పల్ క్రాస్ రోడ్డులో బాణాసంచా… పొరపాటున మెట్రో స్టేషనుపై నిప్పురవ్వలు పడివుంటే? నిత్యం సందడిగా వున్న చోట ఏదైనా ప్రమాదం జరిగివుంటే? రోడ్డుకిరువైపులా ఫ్లెక్సీలు…. గంట పైగా ట్రాఫిక్…