కలం వీరుడు…గళం ధీరుడు.

https://epaper.netidhatri.com/

`పెన్నుతో యుద్ధం చేయగల అక్షర సైనికుడు.

`అక్షరాలను విత్తులు చేసి ప్రజాస్వామ్య సాగు చేసే కిసానుడు.

`స్వేచ్చా ప్రభాత కాంతులు వెదజల్లే సూర్యడు.

`తెలంగాణ కోసం కొట్లాడిన పోరాటయోధుడు.

`ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కదం తొక్కిన కృషీవలుడు.

`నిత్య కార్మికుడు…అక్షర శ్రామికుడు.

 

`అనగారిన అక్షర సమాజ ఆశాజ్యోతి…అనంచిన్ని.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మాటల్లో వేడి, అక్షరాల్లో వాడి కలిగిన అక్షర సవ్యసాచి అనం చిన్ని వెంకటేశ్వరరావు. నిజానికి నిలువెత్తు సాక్ష్యం అనం చిన్ని. నిలువెల్ల గాయాలున్న పిల్లన గ్రోవి, ఎన్ని నిర్భందాలెదురైనా ఆగని తుఫాన్‌ అనం చిన్ని. అది ఉక్కు గుండె. ఎవరితోనైనా ఎదురొడ్డి పోరాడే ఈటె. అనంచిన్నిది ఉక్కు సంకల్పం. అన్యాయం మీద ఎక్కుపెట్టిన పాశుపతాస్త్రం. అక్రమాల మీద సందించిన గాంఢీవం. అనం చిన్ని అక్షరం ఒక నిప్పుకణం. భగభగ మండే అగ్నిగోళం. ఆ గళం ఒక రaంజామారుతం. అడుగేస్తే ప్రభంజనం. తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు ఆదర్శం. పెన్ను కదిలిస్తే ఉత్పాతం. ఈ తరం జర్నలిజానికి సునామీ కెరటం. ఎంత ఎత్తుకైనా ఎగరగలిగే కలం సముద్రపు అలల విద్వంసం. పరిశోధక పాత్రికేయంలో అనం చిన్ని ఒక శకం. జర్నలిజానికే ఒక నవతరం. అక్షర నూతన శఖారంభం. కలం విదిలిస్తే సాగించే అక్షర వ్యవసాయం. సాగును చెరిపేసే చీడపీడలను వెంటాడే మనో నేత్రం. నిన్నటి తరం ఆశావాది. నేటి తరం ఆదర్శవాది. ఆచరణ వాది. మొత్తంగా తెలంగాణ సమాజానికి వెలుగు దివిటి. నవ వసంతానికి, ప్రజా ప్రభుత్వానికి స్వాగతం పలికిన వెలుగులు జ్యోతి. సూర్యోదయంల వేకవ రేఖ. చంద్రోదయంలో వెలుగు రేఖ. తెలంగాణకు కాంత్రి రేఖ. జర్నలిస్టుల సంక్షేమానికి బాసట. జర్నలిస్టు కుటుంబంలో పెద్దన్న పాత్ర.
కొలువులు కొలువులని కొంపలు ముంచితివి.
నీళ్లు నీళ్లని నిండా ముంచితివి. నిధులు నిధులని ఆస్ధులు పోగేసుకుంటివని కేసిఆర్‌ను కడిగేసిన అక్షర సైనికుడు. తెలంగాణను దివాలాతీస్తున్నావని కేసిఆర్‌ను నిలదీసిన కలం సింహస్పప్నం అనంచిన్ని. నాలుగు కోట్ల మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసిఆర్‌ ఆగం చేస్తాడని ముందే ఊహించి చెప్పిన అక్షర శిల్పి అనం చిన్ని. ఆయన చెప్పిన మాటలు తొలుత చాల మంది నమ్మలేదు. కాలం గడుస్తున్న కొద్ది అనం చిన్ని చెప్పినవన్నీ అక్షర సత్యాలయ్యాయి. తెలంగాణ దిక్కులేనిదైంది. కేసిఆర్‌ వల్ల సర్వస్వం కోల్పోయింది. కేసిఆర్‌ తెలంగాణను ఎలా లూటీ చేస్తున్నాడన్న దానిపై అనేక వ్యాసాలు రాశాడు. అనేక విషయాలు వెలుగులోకి తెచ్చాడు. దాంతో అనం చిన్నిని కమ్మేయాలని చూశారు. లొంగపోవడంతో కుమ్మేయాలని చూశాడు. అదీ కుదరకపోవడంతో ఖైదును చేసి అనంచిన్నిని కలానికి దూరం చేయాలనుకున్నారు. ఆయన గళాన్ని నొక్కిపెట్టాలనుకున్నారు. కాని అనంచిన్నిది మొక్కవోని ధైర్యం. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం. ఎన్నిసార్లు అరెస్టులు చేసినా వెరవలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదరలేదు. న్యూటన్‌ మూడో సిద్దాంతం ఎంత నిజమో…కేసిఆర్‌ ఎంత నిర్భంధించాలిన చూశాడో..అంతగా మరింత గొంతు సవరించుకున్న గళం అనంచిన్ని. ఎందుకంటే అనంచిన్ని అక్షరాలు ఆషామాషీ కాదు.ద అగ్గిబరాటాలు. వాటిని తట్టుకోవడం కేసిఆర్‌ వల్ల కాలేదు. తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ ఒక జర్నలిస్టు నిర్భందం అంత కాలం జరగలేదు. జైలులో అంత కాలం మగ్గలేదు. ఉద్యమ సమయంలో తెలంగాణకోసం నిర్భందాలను ఎదుర్కొన్న అనంచిన్నికి కేసిఆర్‌ నిర్భందాలు ఒక లెక్క కాలేదు. తెలంగాణ ఉద్యమంలో పుడితొక్కటి సత్తె రెండు.రాజిగ ఓ రాజిగా అన్న పాటను వల్లెవేసే ఏ ఉద్యమకారుడు సమస్యలనుంచి పారిపోడు. అదే అనంచిన్ని అనుసరించిండు. కేసిఆర్‌కు ఎదురొడ్డి పోరాడిరడు. అటు తెలంగాణ ఉద్యమకారుడిగా ఆనాడు, కలం వీరుడిగా అక్షర కవాతు చేసి రెండు పాత్రలను ఏక కాలంలో పోషించిన అనంచిన్నిని భయపెట్టడం కేసిఆర్‌కు సాధ్యం కాలేదు. దటీజ్‌ అనంచిన్ని.
అవును. అనంచిన్ని కలం వీరుడు.
ఆయన కలానికి పదునెక్కువ. ఆయన పదాలకు వాడి ఎక్కువ. ఆ నుడికారాలకు సొగసులెక్కువ. గర్జించే నలబైలకన్నా వేగమెక్కువ. గళం దీరుడు. పెన్నుతో యుద్దం చేయగల అక్షర సైనికుడు. అక్షరాలను విత్తులు చేసి, ప్రజాస్వామ్య సాగు చేసే కిసానుడు. స్వేచ్చా ప్రభాత కాంతులు వెదజల్లే సూర్యుడు. కారుకు ఎదురు తిరిగిన మొనగాడు. గులాబీ వనం వాడపోయేలా చేసిన రణధీరుడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధుడు. ప్రజా ప్రభుత్వం కొలువయ్యేందుకు కదం తొక్కిన కృషీవలుడు. కలం కార్మికుడు. అక్షర శ్రామికుడు. అణగారిని అక్షఱ సమజానికి ఆశాజ్యోతి. అనం చిన్ని అక్షర ప్రయాణం చేసిన తొలి రోజు నుంచే పరిశోధన జర్నలిజం వైపు అడుగులేశాడు. కొత్త కొత్త విషయాలు ప్రపంచానికి పరిచయం చేయడం కోసం అనేక సాహసాలు చేశాడు. అనేక రిస్కులు ఎదుర్కొన్నాడు. ఆయన పడినశ్రమకు ఫలితం గురించి ఆలోచించేవారు కాదు. ప్రజలకు తన సమాచారం చేరిందా లేదా? అన్నదానిపైనే ఎక్కువ దృష్టిపెట్టేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితాంతం రోజుకో కొత్త విషయాన్ని ప్రజలకు చేరవేయాలన్న తపనతోనే వుండేవారు. ఇప్పుడంటే అరచేతిలో వైకుంఠం అన్నట్లు సమచారం క్షణాల్లో తెలిసిపోతోంది. కాని ఒకప్పుడు అది కాదు. ఒక సమాచారం ప్రజలకు చేరాలంటే కొన్ని వారాలు పట్టేది. కొన్ని విషయాలు మరురున పడిపోయేవి. ముఖ్యంగా వ్యవస్ధలో జరిగే అవినీతి బైటకు కనిపించేది కాదు. కాని ఆయన రోజుల్లోనే ఎంతో శ్రమకోర్చి, ఎంత దూరమైనా వెళ్లి సమాచారం సేకరించేవారు. సేకరించిన సమాచారం నిర్భయంగా, పరిపూర్ణం అనుకున్నప్పుడు నిజాన్ని వెలుగులోకి తెచ్చేవారు. అలా వెలుగులోకి తెచ్చిన వర్తాలు కొకోల్లలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎనభైవ దశంలో ప్రపంచ మూలలో ఏం జరుగుతుందో, దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రజలు సమాచారాన్ని చేరవేసిన వార్తవారధి అనం చిన్ని. అందుకే అప్పటి వారపత్రికల్లో, పక్షపత్రికల్లో, మాసపత్రికల్లో అనంచిన్న వార్తల కోసం జనం ఎదరుచూసేవారు. అలాంటి అనంచిన్ని తెలంగాణ ఉద్యమ రచన వైపు వార్త ప్రస్తానం మళ్లించారు. అయితే పరిశోధక జర్నలిజాన్ని పూర్తిగా మానుకోలేదు. 2000 నుంచి రెండు రకాల వ్యార్తావ్యాసంగాన్ని ఎంచుకున్నారు. అటు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఎలా జరుగుతుందనేది చెప్పేవారు.
తెలంగాణ ఉద్యమాన్ని డిల్లీ పెద్దలకు దృష్టికి తీసుకెళ్లడంలోనూ కీలకభూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎలా చల్లార్చాలని చూస్తున్నారో, ఆనాటి సీమాంధ్ర నాయకులు ఎలాంటి పన్నాగాలు పన్నేవారో వెలుగులోకి తెచ్చి సంచనాలు సృష్టించిన విలేఖరి అనంచిన్ని. అనం చిన్ని దగ్గర అక్షర నడకలు నేర్చుకున్నవారు ఎంతో మంది ఇప్పుడు మంచి మంచి స్ధానాలలో వున్నారు. అన్నంచిన్న సలహాలతోముందుకు సాగిన నాయకులు ఎంతో మంది మంచి పదవుల్లో వున్నారు. ఎనభైవదశంలోనే మిస్టర్‌ ఆంధ్ర ప్రదేశ్‌ అనే అవార్డును అనంచిన్న వింకటేశ్వరరావు సంపాదించుకున్నారు. ఆయన రచనా వ్యాసంగం అంతా కొత్త ఒవడిలో సాగుతుంది. అదే పాఠకలోకాన్ని ఆకర్షించింది. తెలంగాణ వచ్చే దాకా పోరాటం చేసిన అనంచిన్ని, తెలంగాణ వచ్చిన తర్వత కూడా ఉద్యమం ఆగకూడదన్న జయశంకర్‌ సార్‌ మాటలను అక్షరాల తుచ తప్పకుండా పాఠించాడు. ఆచరించాడు. అందుకే గత ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వంచేసే తప్పులను ఎత్తి చూపాడు. ఏం చేస్తే బాగుంటుందన్నదానిని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాడు. సహజంగా ప్రభుత్వాలకు మంచి సూచనలు నచ్చవు. అనంచిన్ని లాంటి వారు చెప్పిన మంచి బావాలు, భావనలు వారికి నచ్చలేదు. అయినా తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం మాత్రం అనంచిన్ని ఏ రోజూ ఆపలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఏర్పాటు దాకా పదేళ్ల క్షణం విశ్రాంతి తీసుకోలేదు. ఆ పెన్నుకు అలుపు లేదు. ఆ ప్రశ్నకు విరామం లేదు. ఆ ఆలోచనలకు అవదులు లేవు. అవే అనంచిన్ని కలం నుంచి జాలువారే నిజాలు..అనంచిన్ని ఒక బ్రాండ్‌. అనం చిన్ని ఒక ర్యాంక్‌. ఆ బ్రాండ్‌ ఇంకొకరికి రాదు. ఆ ర్యాంకు ఇంకెవరు టచ్‌ చేయలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *