నేర్పుతుంది పాఠాలా! దాడులా!!

https://epaper.netidhatri.com/

సీఎం గారు ఒక్కసారి సికేంఎం కాలేజీ బాగోతం తెలుసుకోండి.

`నేటిధాత్రి మీద దాడి చేయాలని ఉసిగొల్పుతారా?

`గురువులా మీరు?

`ఇప్పటికే కాలేజీ భ్రష్టు పట్టించారు?

`విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు?

` కేసుల పాలు చేసి వారి భవిష్యత్తు అంధకారం చేస్తారా?

`నిపుణులైన గురువులుంటే చదువు బాగా చెబుతారు?

`అడ్డదారిలో గురువులౌతే ఇలాంటివే నేర్పుతారు?

`తల్లిదండ్రులారా మీ పిల్లలకు చెప్పండి?

`నేటిధాత్రి చెబుతున్నది కూడా విద్యార్థుల మేలు కోరే!

`కాలేజీని ఆగం చేసే వారి మాయలో పడకండి.

`గురువులు పాఠాలు నేర్పాలి.

`చెడు చేసేవారికి మంచి ఎప్పుడూ నచ్చదు?

`కాలేజీ బాగుపడడం కొందరికి ఇష్టం లేదు?

`విద్యార్థులను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు?

`విద్యార్థులు జీవితాలు చిదిమేస్తున్నారు!

`కాలేజీకి పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఈ లొకంలో మంచి చెబితే ఎవరికీ నచ్చదు. అదేం దౌర్భాగ్యమో గాని మంచి దారిలో వెళ్లమంటే పట్టించుకోరు. అచ్చం వరంగల్‌లోని సికేఎం కాలేజీకి చెందిన కొందరి పరిస్ధితి అలాగే వుంది. సికేఎం కాలేజీ అన్నది ఒక ఉన్నతమైన ఆశయంలో స్ధాపించిన కాలేజీ. కొన్ని దశాబ్ధాల పాటు ఎంతో మంది మేదావులను తయారుచేసిన గొప్ప విద్యాలయం సికేంఎం. భవిష్యత్తులో ఇంకా ఎంది గొప్ప గొప్ప మేధావులు, సంస్కర్తలు, నిపుణులు తయారు కావాల్సిన అవసరం వుంది. అలాంటి కాలేజీ ఉన్నతి కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నారు. ఎయిడెడ్‌ కాలేజీ నుంచి ప్రభుత్వ కాలేజీగా మారేందుకు ఎంతో మంది కృషి చేశారు. అంత వరకు బాగానే వుంది. కాని ఎప్పుడైతే ప్రభుత్వం పరమైందో అప్పటి నుంచి కొంత మంది కాలేజీని పట్టుకొని వేళాడుతూ రాజకీయాలు చేస్తూ, ఉద్యోగాలలో లేనిపోని పెత్తనాలు చేస్తున్నారు. సంపాదనా మార్గాలుగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు ఆ కాలేజీలో చదువుకోలంటే సీటు రావడం గగనంగా వుండేది. మంచి మార్కులు వస్తే తప్ప సీట్లు దొరికేవి కాదు. నాటి అధ్యాపక సిబ్బంది కూడా ఎంతో అంకితభావంతో పని చేసేవారు. కాని కాలం మారింది. కాలేజీకి మంచి రోజులు వచ్చిన తర్వాత కొంత మంది పనిగట్టుకొని చెదలు పట్టిస్తున్నారు. కాలేజీ పేరు చెడగొడుతున్నారు. వాళ్లు ఎవరన్నది సమాజానికి తెలుసు. అయినా మేం అపర సత్యవాదులమంటూ విద్యార్ధులను జీవితాలను నాశనం చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నారు.
సహజంగా ఏ తల్లిదండ్రులైనా, ఆఖరుకు సికేఎం కాలేజీలో పనిచేసే సిబ్బందైనా సరే మంచి కాలేజీకి పిల్లలను పంపాలనుకుంటారు.
మంచి విద్యాబోధన వుందా? అని ఆరాతీస్తారు. గొప్ప ఫ్యాకల్టీ వుందా? అనే విషయం తెలుసుకున్న తర్వాతే వారి పిల్లలను కాలేజీలో చేర్పిస్తుంటారు. ఇంత గొప్ప కాలేజీలో ఎలాంటి బోధనా సిబ్బంది వుండాలి? విద్యార్ధును ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు కావాలి. సంబందిత సబ్జెక్టుల మీద పూర్తి స్ధాయి పట్టున్న అద్యాపకులు కావాలి. కాని కాలేజీకి గతంలో సంబంధం వుండి, ఇప్పుడు ఎలాంటి సంబందం అవసరం లేని వాళ్లు కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. నానా పెంట చేసేస్తున్నారు. ఒకప్పుడు సికేఎం కాలేజీ సర్టిఫికెట్‌ అంటేనే అదే గొప్ప. మరి అలాంటి కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా వుండాలి? పూర్తి స్ధాయి నిపుణులు వుండాలి. అన్ని సబ్జెక్టులలో నిష్ణాతులను నియామకం జరగాలి. కాని కొందరు ఉద్యోగాల కల్పన పేరుతో కాలేజీ వ్యవహారంలో జోక్యం చేసుకొని , సంతలో కూరగాయలు అమ్ముకుంటున్నట్లు అద్యాపక ఉద్యోగాలు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వున్నాయి. ఒక గొప్ప సమాజ నిర్మానం జరగాలంటే అది తరగతి నుంచే కావాలి. మరి అలాంటి తరగతిలోనే తప్పుడు విధానాలు చొప్పించే దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సికేఎం కాలేజీలో జరగకూడని దరిద్రాలన్నీ జరిపిస్తున్నారంటూ అనేక మంది నేటిధాత్రికి పిర్యాధులు చేశారు.
వివరాలు అందించారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే నేటిధాత్రి కాలేజీ భ్రష్టుపట్టిపోకూడదని, గతం తాలూకు గొప్ప పేరు చెడిపోవద్దని జరుగుతన్న తతంగాలను వెలుగులోకి తెచ్చింది. ఇది కొందరికి గిట్టలేదు. దాంతో కాలేజీ విద్యార్ధులు కొందరు తప్పుడు తోవలో నడిచే అద్యాపకులు రెచ్చగొడుతున్న సమాచారం. తమ కాలేజీ మంచి కోసం రాస్తున్న నేటిధాత్రి మీద దాడి చేయాల్సిన అసవరం ఏముందని విద్యార్ధులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అయినా వారిని తమ కాలేజీ పేరు బద్నాం చేసే విధంగా వార్తలు వస్తున్నాయంటే విద్యార్థులకు లేనిపోవని నూరిపోసే పని పెట్టుకున్నారు. సికేఎం కాలేజీ అంటే ప్రైమరీ స్కూల్‌ కాదు. అక్కడ చదివేది యువకులు. వారికి మంచి చెడుల విచక్షణ వుంది. విద్యార్ధి ఉద్యమాలు ఎందుకు చేస్తారో తెలియనంత అమకులు కాదు. కాని బోధకుడు ఎలా వుండాలో..ఏం చదువుకోవాలో కూడా తెలియని నకిలీలు కాలేజీలో చేరి, వ్యవస్ధను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్ధులకు లేని పోని ఆశలు కల్పించి, నేటిధాత్రి మీద దాడి చేయాలంటూ ఒత్తడి తెస్తున్నట్లు సమాచారం.
తల్లిదండ్రులారా ఒక్కసారి మీరంతా వీలు చేసుకొని, చూసుకొని కాలేజీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
మీ పిల్లలను అక్రమ మార్గాలకు మళ్లించి, పాఠాలు చెప్పకుండా, దాడులు ఎలా చేయాలో నేర్పుతున్నారు. నేటిధాత్రి మీద దాడి చేస్తే విద్యార్ధుల మీద కేసులౌతాయి. వారి జీవితాలు ఆగమౌతాయి. కొందరు స్వార్ధపరులైన అద్యాపకుల కోసం విద్యార్ధులు బలిపశువులు కావొద్దు. ఒక్కసారి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదౌతే వారి బావి జీవితం ఎన్నొ ఇబ్బందులకు గురౌతోంది. అయినా అబద్దమాడరాదు. మంచి అన్నది పెంచుము..అని చెప్పాల్సిన అధ్యాపకులు తప్పుడు దారులు ఎంచుకొని విద్యార్దులు పావులుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని అడ్డుకోవాల్సిన బాద్యత ప్రభుత్వ పెద్దలపై వుంది. విద్యాశాఖపై వుంది. విద్యార్దుల తల్లిదండ్రులపై కూడా వుంది. ఒక్కసారి సికేఎం కాలేజీలో అద్యాపకులు చేస్తున్న దందాను గుర్తించండి. అసలు ఉద్యోగాలంటే పప్పుబెల్లాలాల? అధ్యాకప ఉద్యోగాలు అంత సులువా? అందులోనూ సికెం కాలేజీలో ఉద్యోగమంటూ అంత దొడ్డి మార్గమా? అమ్ముకునేవారు అమ్ముకుంటుంటే, ప్రభుత్వం, విద్యా శాఖ గుడ్డప్పగించి చూస్తుందా? అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే దీనిపై సమగ్రమైన విచారణ జరపించాల్సిన అవసరం వుంది. అసలు కాలేజీ అభివృద్ది కోసం వచ్చిన నిధులకు లెక్కలుండవు. కాలేజీలో ఫీజలకు లెక్కలుండవు. అసలు పట్టించుకునే నాధుడుండడు. పైగా ఇప్పుడు ఉద్యోగాలను అంగడి సరుకులు చేస్తున్నారు. కాలేజీలో పనిచేసే నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అంటే వేరు..టీచింగ్‌ స్టాఫ్‌ నియాకమాలు ఒక పద్దతి ప్రకారం జరగాల్సిన అసవరం వుందా? లేదా? నిష్ణాతులైన వారి నియామకం చేపట్టాలా? వద్దా? నకిలీ సర్టిఫికెట్లుతో ఉద్యోగాలు కొట్టేసేవాళ్లు విద్యార్దులు ఏం పాఠాలు చెబుతారు? అలా తప్పుడు దృవపత్రాలు తెచ్చుకొని ఉద్యోగాలు చేసే అవకాశం వున్నప్పుడు విద్యార్ధులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? తప్పుడు సర్టిఫికెట్లను ఆపాల్సిన బాధ్యతను విస్మరించి, వాళ్లే ప్రోత్సహించడం, వారినే రిక్రూట్‌ చేసుకోవడం, ముట్ట చెప్పిన వారికి ముట్ట జెప్పినంత అన్నట్లు పంచుకోవడం ఏమిటి? అసలు సికేఎం కాలేజీలో ఈ దుకాణమేమిటో ప్రభుత్వం వెంటనే దృష్టిపెట్టాలి. కొలువులు కొట్టేసిన వారి సర్టిఫికెట్లు మళ్లీ తనికీలు చేయాలి. పాదర్శకంగా నియకాలు చేపట్టాలి. కాలేజీకి సంబంధం లేని వాళ్ల జోక్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. అప్పుడే కాలేజీకి వున్న పేరు నిలబడుతుంది. భవిష్యత్తులో మరో మంచి తరం రూపుదిద్దుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *