నోటీసులతో నిజాన్ని దాచలేరు!

https://epaper.netidhatri.com/

`వాటికి నేటిధాత్రి ఏనాడు అదిరేది కాదు!

`కార్మికులకు న్యాయంగా రావాల్సింది ఇవ్వు!

`బడుగుల పొట్ట గొట్టిన బడుగు నేతగా మిగిలిపోకు!

`తిన్నది అరక్క కార్మికులు పోరాటం చేస్తున్నారా?

`పని పాట లేక న్యాయం కావాలని రోడ్డెక్కుతున్నారా?

`సమస్యలున్న చోటుకు మీడియా వెళ్తుంది.

`మీడియాకు సమస్యలు చెప్పుకుంటేనే ప్రపంచానికి తెలుస్తుంది.

`తప్పు చేసిన వాళ్లు నెపం మీడియా మీద నెట్టడం మామూలే!

`తప్పు చేయకపోతే వివరణ ఇచ్చుకోండి.

`20 సంవత్సరాల్లో నేటిధాత్రి ఇలాంటి బెదిరింపులు చాలా చూసింది.

`ప్రజల పక్షాన పోరాటమే నేటిధాత్రికి తెలిసింది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నేటిధాత్రి రాసిన వార్తను ఒకసారి చదవండి. మొదట్లోనే వార్త సారాంశం ఒక్క మాటలో చెప్పేశాం. అది మా అభిప్రాయం కాదు. అందులో భాగంగా కార్మికులు, బాధితులు అంటున్న మాట అన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. బాధితుల పక్షాన మాత్రమే వార్త రాయడం జరిగింది. లీగల్‌ గా ఎలాంటి నోటీసులకు తావు లేదు. నేటిధాత్రి వార్త ఆశామాషీగా రాసేది కాదు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే మీడియా బాధ్యత. అందులో వ్యక్తిగత బావాలకు ఎలాంటి ఆస్కారం వుండదు. కార్మికులు తమ సమస్యలను వివరిస్తూ తమ గోడును వెల్లదీసుకుంటూ వారి అసోసియేషన్‌ లెటర్‌ హెడ్‌ మీద బాధలు రాసి పంపించారు. దానిని కూడా నేటిధాత్రి ప్రచురించింది. అంతే కాదు వివరణ కోసం మల్క కొమురయ్యను సంప్రదించే ప్రయత్నం జరిగింది. వివరాలు తెలుసుకునే క్రమంలో ఫోన్‌ చేసినా మల్క కొమురయ్య స్పందించలేదు. కార్మికులు చెప్పిన విషయాలను నేటిధాత్రి ప్రచురించింది. నేటిధాత్రి వార్తను ఖండిరచే అవకాశం మల్క కొమురయ్యకు వుంది. అసలు నిజాలేమిటో మీడియా ముఖంగా చెప్పుకునే వీలుంది. కార్మికులు ఎలాంటి అన్యాయం జరగకుండానే ధర్నా చేస్తుంటే మల్క కొమరయ్య ఎందుకు వారిని ప్రశ్నించడం లేదు. మల్క కొమురయ్యది తప్పు లేనప్పుడు కార్మికుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం వుంది. అసలు కార్మికులు మీడియాకు ఎక్కక ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. కార్మికులు తమకు జరిగిన అన్యాయం గురించి అడుగడుగునా వివరిస్తున్నారు. మల్క కొమరయ్య అన్యాయం చేశాడని చెబుతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. మల్క కొమరయ్య బాధితులమని చెబుతున్న వారు ఒకరో ఇద్దరో కాదు. ఎంత మంది వున్నారో మల్క కొమరయ్య తెలుసు. దానిని కూడా మసిబూసి మారేడు కాయ చేద్దామనుకుంటే కార్మికులు ఊరుకుంటారా? ఎదిరిస్తున్నారు. తిరగబడుతున్నారు. ఏకంగా మల్క కొమరయ్య ఇంటిని కూడా కార్మికులు ముట్టడిరచారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కి కూడా మల్క కొమరయ్య బాధితులు వినతిపత్రం ఇచ్చారు. కార్మికులు తిన్నదరక్క ఇచ్చారా? పనిపాట లేకుండా ధర్నాలు చేస్తున్నారా? వాళ్ల కన్నీళ్ళు అబద్దమా? వాళ్ల ఆరాటం అబద్దమా? పోరాటం అబద్దమా? అక్షరం మీద నిందలేస్తే తప్పు ఒప్పు కాదు. నిప్పై కాలుతుంది. తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అయినా మల్క కొమరయ్య మీద రాసిన వార్త వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించినది కాదు. కార్మికుల కష్టం గురించి. కార్మికుల నష్టం గురించి, కార్మికుల ఆకలి గురించి. కార్మికుల జీవితాల గురించి. వారికి న్యాయం జరగడం గురించి. అంతే కాని అక్కడ వ్యక్తి, ప్రతిష్ఠ అనే దానికే తావులేదు. అలాంటి వాటితో నేటిధాత్రికి సంబంధం లేదు. నేటిధాత్రి చెప్పేది ఒక్కటే…కార్మికులకు న్యాయం. ఆ న్యాయం జరిగితే అందరికీ సంతోషం. నిజం ఎప్పుడూ ప్రచారంలోనే వుండాలి. లేకుంటే అబద్దాన్నే నిజమని నమ్మే ప్రమాదముందని డాక్టర్‌. బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ ఏనాడో చెప్పాడు. మీడియా అంటే దాని మీద అవగాహన లేని వాళ్లు చాలా మంది వుంటారు. వారు చేసే విచిత్రమైన ఆలోచనలు వింతగా వుంటాయి. మీడియా అన్నది హంస లాంటింది. అది ఎప్పుడూ నిజాన్ని మాత్రమే ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తప్పులను ఎత్తి చూపుతోందంటేనే నిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లు లెక్క. పాలు,నీళ్లను వేరు చేసినట్లే, తప్పులు, ఒప్పులను పక్క పక్కన చేర్చి చూపించడమే మీడియా కర్తవ్యం. మీడియా ఆ బాధ్యతనుంచి ఎప్పుడూ తప్పుకోలేదు. అది సాధ్యం కాదు కూడా. అందుకే నిజాలు చెప్పే మీడియా అంటే తప్పుడు పనులు చేసేవారికి నచ్చదు. తమ తప్పులను వేలెత్తి చూపడం తప్పుడు మనుషులకు గిట్టదు. సమాజంలో సామ్యవాదం కోసం పనిచేసేదే మీడియా. సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతే మీడియా లక్ష్యం. అంతే కాని దోచుకునేవారికి కొమ్ము కాయడం అన్నది ఏ మీడియా చేయదు. నేటిధాత్రి దిన పత్రిక పురుడుపోసుకున్న నాటి నుంచి కూడా ఎక్కడ అన్యాయాన్ని సహించలేదు. ఎక్కడ అక్రమాన్ని ఉపేక్షించలేదు. ఎంత పెద్ద నాయకుడ్కెనా విడిచిపెట్టలేదు. ఎంతటి ఉన్నతాధికారి చేసిన తప్పులన్కెనా ప్రపంచానికి చాటకుండా ఊరుకోలేదు. నిజాన్నే మీడియా సమర్ధిస్తుంది. అన్యాయాన్ని ప్రతి క్షణం ఖండిస్తుంది. జనానికి చేరవేస్తుంది. అలాంటి నిజాలను దిగమింగుకోలేని వారు చూసే ఆరోపణలు మీడియాకు కొత్తకాదు. ఏ ఆరోపణలకు మీడియా తలొంచేది కాదు. అందుకే నిజానికి శత్రువులెక్కువ. అబద్దానికి మిత్రులెక్కువ. నిజాలు రాసే పత్రికలపై దుష్ట ప్రచారాన్ని ఏడాడు జనం నమ్మరు. నిజం మాట్లాడలేని వ్యక్తికి కోపమెక్కువ. నిజం చెప్పకపోతే పత్రిక ప్రజల ఆదరణ తక్కువ. ప్రజలకు నిజాలు చెప్పడంలో ఎల్లప్పుడూ నేటిధాత్రి ముందుంటుంది. నేటిధాత్రి అనేది నిప్పుకణం. దానికి చెదపట్టించాలని చూలా మంది చూశారు. కాని కుదరలేదు. నేటిధాత్రి మీద నిందలేస్తే నిప్పుతో తల గోక్కున్నట్లే..! నేటి ధాత్రి రాసే ప్రతి అక్షరం ఒక నిబద్దతతో కూడుకున్నదే. చర్యకు ప్రతి చర్య వుంటుంది. నేటిధాత్రికి అక్షర పోరాటమే కాదు, న్యాయ పోరాటం కూడా తెలుసు. ఇలా తప్పులు చేసే వారే బెదిరింపులకు గురి చేస్తామంటే వెనుకడుగు అలవాటు నేటిధాత్రికి లేదు. నోటీసులతో పవిత్రమైన అక్షర యజ్ఞం చేస్తున్న నేటిధాత్రిని బెదిరించాలని చూస్తే కుదరదు. నోటీసులు నేటిధాత్రి కూడా పంపగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *