`సిద్దిపేటే కుటుంబం… కేసిఆరే ప్రపంచం.

https://epaper.netidhatri.com/

`ప్రజా మది, పార్టీ హృది హరీష్‌!

`ఉద్యమ బాట…రాజకీయ వేట!

`అటు పోరాటం.. ఇటు ప్రగతి ఆరాటం.

`సగటు జీవితమంతా జనం కోసం.

`ప్రతి క్షణం ప్రజల కోసం.

`ప్రతి మాట వారి హితం కోసం.

`ప్రతి అడుగు పార్టీ కోసం.

`ప్రతి వ్యూహం గెలుపు కోసం.

`ప్రతి దారి గులాబీ జెండా కోసం.

`కేసిఆర్‌ నాయకత్వం పదిలం కోసం.

`కార్యకర్తల సంక్షేమం కోసం.

`పదికాలాల పాటు పార్టీ మనుగడ కోసం.

`నమ్మకున్న వారికి అండగా నిలబడడం కోసం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అవును హరీష్‌రావుకు సిద్దిపేట అంటే ప్రాణం. ఆ ప్రాంతాన్ని ఆయన ఎంత సుందరంగా తీర్చిదిద్దారో చూస్తే ఆయనను ఆ ప్రాంతం మీద వున్న మక్కువ, ప్రేమ కనిపిస్తుంది. తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లినా కలగని అనుభూతి ఒక్క సిద్దిపేటకు వెళ్తేనే కలుగుతుందని ఎంతో మంది అంటారు. గతంలో ప్రకృతి ప్రేమికులైనా, ఏదైనా ప్రాంతాలను సందర్శించేవారైనా దర్శనీయ స్థలాలో దేవాలయాలున్న ప్రాంతాలను ఎంచుకునేవారు. కాని ఇప్పుడు సిద్దిపేట ఎలా వుందో చూద్దామని తెలంగాణలోని ఇతర ప్రాంతాలనుంచి వస్తున్నారు. అంటే ఒక ప్రాంత అభివృద్ది అన్నది నాయకుడి పనితీరుకు గీటురాయిగా నిలుస్తుంది. అందుకే సిద్దిపేట అందర్నీ ఆకర్షిస్తుంది. అందుకు కారణం హరీష్‌రావు. తన సిద్దిపేటను ఎంతో సుందరంగా తీర్దిదిద్దాలనుకున్నాడు. సొగసులద్దాడు. తన నియోజక వర్గం అన్ని నియోజకవర్గాల కన్నా గొప్పగావుండాలనుకున్నాడు. ప్రతి ఊరును అభివృద్దిచేశాడు. ప్రతి పల్లెను సింగారించాడు. అందుకే సిద్ధిపేట అంటే హరీష్‌రావుకు కుటుంబం. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ అంటే ప్రపంచం. ఇప్పటి వరకు కేసిఆర్‌ గీసిన గీత దాటలేదు. కేసిఆర్‌ చెప్పిన ప్రతి పనిలో విజయం చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే హరీష్‌రావు అంటే ప్రజా మది. అంటే నిత్యం ఆయనలో ప్రజలు, వారి సమస్యలు, వారికి మేలు ఎలా చేయాలన్న తపనే కనిపిస్తుంది. సహజంగా ఈ రోజు ఎంత సంపాదించామని అందరూ ఆలోచిస్తారు. కాని ఈ రోజు ఎంత మందికి మేలు చేశాం.ఎంత మందికి సేవ చేశామని మననం చేసుకొని నిద్రపోయే నాయకుడు హరీష్‌రావు. అందుకే ఆయన ప్రజల నాయకుడయ్యాడు. బిఆర్‌ఎస్‌ పార్టీకి హృదయమయ్యాడు. ఎందుకంటే ఆయన అడుగులు వేసింది ఉద్యమ బాట నుంచి. ఆయన రాజకీయాలలోకి వచ్చింది పోరాట వనం నుంచి. అందుకే రాజకీయాల్లో ఆటైనా ఆయనకే సొంతం. ఎన్నికల్లో ఓట్ల వేటైనా ఆయనకే సొంతం. ఒక నాయకుడికి జీవితంలో ఎన్ని కోణాలున్నా, పోరాటం, ప్రగతి అన్నది రెండు కళ్లు. అవి హరీష్‌ రాజకీయానికే వన్నె తెచ్చాయి.
ఉద్యమ కాలంలో హరీష్‌ పాత్ర మీద ఎంత రాసిని ఒడువని ముచ్చటే.
పిలిస్తే పలికే నాయకుడు. సమాచారం అందిస్తే క్షణాల్లో స్పందింస్తాడు. పార్టీ అప్పగించిన పనిని విజయవంతం చేస్తాడు. ఉద్యమ కాలంలో కాలుకు బలం కట్టుకొని తిరిగి, ఊరూర తెలంగాణ ఉద్యమ చైతన్యం నింపాడు. నాయకుల్లో తెలంగాణ ఆవశ్యకత పెంచాడు. వారిలో జై తెలంగాణ నినాదం నింపాడు. వారి ఎన్నికల్లో అన్నీ తానై ప్రచారం చేశాడు. వారి గెలపులో కీలకభూమిక పోషిస్తూ వచ్చాడు. ఏ ఎన్నికైనా సరే తన భుజస్కంధాల మీద వేసుకొని, ఆ నాయకులను గెలిపించుకుంటూ వచ్చారు. పార్టీ బలం పెంచుకుంటూ పోయారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు బలమైన పునాదులు పడడంలో హరీష్‌రావు అహర్నిషలు శ్రమించారు. పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. అందుకే ట్రబుల్‌షూటర్‌ అంటారు. ప్రజలు అడిగింది చేసి పెడతాడు. ప్రజలకు ఆపద్భాందవుడుగా కనిపిస్తాడు. ఆత్మీయత కురిపిస్తాడు. అండగా వుంటాడు. నమ్ముకున్నవారికి దేవుడౌతాడు. వారిని కాపాడుకుంటాడు. భరోసా కల్పిస్తాడు. ఏ కష్టమొచ్చిందని ఎవరు వెళ్లినా ఆదుకుంటాడు. ఆపదలో వున్నారని తెలిస్తే అక్కడ వాలిపోతారు. ప్రజలకు చేరువగా వుంటారు. పేదలంటే ఎనలేని ప్రేమ, గౌరవం. ప్రజలంటే ఆయనకు ప్రాణం. ప్రజలు ఆయన దగ్గరకు రావడానికి జంకరు. బంధువొచ్చినంత సంతోషంగా ఆయన దగ్గరకు వెళ్తారు. ఎక్కడా హంగూ, ఆర్భాటం వుండదు. సామాన్యులతో కలిసి కలివిడిగా వుంటాడు. దర్పం ఎక్కడా కనిపించదు. సామాన్యుడిలా ప్రజల మధ్యనే వుంటాడు. అందుకే ప్రజలు కూడా ఇంటి మనిషికి చెప్పుకున్నట్లే సమస్యలు చెప్పుకుంటారు. నిత్యం జాతరే…ప్రజలకు సేవ చేయడం హరీష్‌రావు అదృష్టంగా భావిస్తారు…హరీష్‌ రావు ప్రజా నాయకుడుగా దొరకడం సిద్దిపేట ప్రజలు తమ భాగ్యంగా చెప్పుకుంటారు.
హరీష్‌రావు సేవా భావం గురించి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఊరు చెబుతుంది.
ప్రతి ఒక్కరూ చెబుతారు. అంతగా ప్రజలతో మమేకమై రాజకీయాలు చేసే నాయకులు చాలా తక్కువ. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏ గ్రామ వాసి తన వద్దకు వచ్చినా గుర్తుంచుకొని పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి ఆయనది. అందుకే చాలా మంది నేను ఫలానా చెప్పుకోవాల్సినంత అవసరం లేకుండానే వారి సమస్యలు తీర్చుతుంటారు. అందుకే పేదల దేవుడని అందరూ కొనియాడుతుంటారు. ఉద్యమ కాలంలో ఆయన వేసిన రాజకీయ అడుగులే బలమైన పునాదులుగా సేవా ప్రపంచం సృష్టించాడు. ప్రజా సేవకు అంకితమైన నాయకుడు హరీష్‌రావు అని కీర్తించబడుతుంటాడు. ఎప్పుడైతే తాను ఎమ్మెల్యే అయ్యాడో అప్పటినుంచి సిద్ధిపేటను అభివృద్ధిలో పరుగులుపెట్టించారు. ఓ వైపు ఉద్యమం, మరో వైపు అభివృద్ధి మంత్రంతో ఆయన అలుపెరగని ప్రయాణం సాగించాడు. ఉద్యమ కాలంలో ఓ వైపు తెలంగాణ అంతా తిరగాల్సిన పరిస్ధితి. మరో వైపు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఈ రెండూ ఏ కాలంలో నిర్వర్తించి, ప్రజల మన్ననలు పొందిన నాయకుడు హరీష్‌రావు. ఒకనాడు సిద్దిపేట కరువుతో అల్లాడిన ప్రాంతం. ఇప్పుడు సస్యశ్యామలానికి నిదర్శనం. ఎటు చూసినా నీళ్లే…ఎక్కడ కనిపించినా కాలువలే…పక్కనే రంగనాయక సాగర్‌ లాంటి రిజర్వాయర్‌ నిర్మాణం. తెలంగాణలో చెరువుల పండగను తెచ్చిన నాయకుడు హరీష్‌రావు.
ఇక మంత్రి ఆయన పరిపాలనా పరమైన పనుల్లో ప్రతి క్షణం పరిపూర్ణం.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన చేసి సేవ అనన్య సామాన్యమైంది. ఏక కాలంలో అటు మిషన్‌ కాకతీయ, ఇటు ప్రాజెక్టుల నిర్మాణాలను సమన్వయం చేసుకుంటా ఆయన చూపిన చొరవ సామాన్యమైంది కాదు. తెలంగాణలోని సుమారు 46 వేల చెరువుల పునరుద్దరణ అన్నది ఒక యజ్ఞంలా చేపట్టి, మూడేళ్లలో చెరువులకు జలకళ తీసుకురావడం అన్నది సామాన్యమైన విషయంకాదు. ఇలాంటి పనులు అందరి వల్ల కాదు. ఇక కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం రాత్రిపగలు అన్న తేడాలేకుండా, ప్రాజెక్టు వద్దనే నిద్రలు చేసి, దగ్గరుండి పూర్తి చేయించిన నాయకుడు హరీష్‌రావు. ప్రపంచంలో అలా మనసుపెట్టి పనులు పూర్తి చేసిన నాయకుడు మరొకరు కనిపించరు అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా వుంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మిషన్‌ కాకతీయ పనులు మొదలయ్యాయి. కాని హరీష్‌రావు తాను ఎమ్మెల్యేగా వున్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో శ్రమదానం పేరుతో తన నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో చెరువుల మరమ్మత్తులు దగ్గరుండి చేసిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. అలా మిషన్‌ కాకతీయకు అడుగు పడిరది. ఆ తర్వాత తెలంగాణకు వరమైంది. ఎండిన పల్లెల గొంతులు మిషన్‌ కాకతీయతో పడిపారు. ఊరూరు పచ్చదనం వెల్లివిరిసేలా చేశారు. కాలువలు తవ్వించి మరీ చెరువులు నింపారు. ఎండా కాలంలో కూడా ఎక్కడా చెరువులు ఎండకుండా చూసుకున్నారు. నిత్యం నీటితో చెరువులు కళకళలాడేలా చేశారు.
మంత్రిగా తెలంగాణకు వైద్యం చేశారు.
తెలంగాణ వైద్య రంగంలో విప్లవాన్ని తెచ్చారు. తెలంగాణలో సామాన్యులకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువ చేశారు. అటు ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని పరిపుష్టి కల్పించారు. ఉమ్మడి పాలకుల శాపం మూలంగా తెలంగాణకు ప్రభుత్వ వైద్యం కరువైంది. సరైన వైద్య సదుపాయాలు వుండేవి కాదు. కాని తెలంగాణ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో హరీష్‌రావు చేసిన ఎంతో గొప్పది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీల ఎర్పాటు చేసి పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవడం లో హరీష్‌రావు చేసిన కృషి అమూల్యమైంది. ఇప్పటికే చాలా జిల్లా మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అనేక జిల్లాలో వంద పడకల ఆసుపత్రుల నిర్మాణాలు జరిగాయి. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అంటే అది హరీష్‌రావు పుణ్యమే అని చెప్పకతప్పదు. వరంగల్‌ లాంటి మహానగరంలో సుమారు 2వేల పడకల అత్యాధునికి సదుపాయాలా ఆసుపత్రి నిర్మాణం శరవేంగంగా జరుగుతోంది. హైదరాబాద్‌ చుట్టూ నాలుగు వైపుల నాలుగు అతి పెద్ద ప్రభుత్వాసుపత్రుల నిర్మాణం మొదలైంది. ఇక ప్రతి ఊరిలోనూ ఆసుపత్రుల ఏర్పాటు, నగరాల్లో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసి, పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడం జరిగింది. ఇదంతా కార్యదక్షత వున్న నాయకుడైన హరీష్‌రావు చొరవకు నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *