ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం జన్మదిన వేడుకలు..
జహీరాబాద్. నేటి ధాత్రి:
టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్)మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు బి.దిలీప్ డబ్లూ హెచ్ ఆర్ పి సి ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు శంకర్, శివరాజ్ పాటిల్,నబి సాబ్, యం.జైపాల్,కె.నర్శింలు,చెంగల్ జైపాల్,జి.జగన్,బాల్ రాజ్, ఇమ్రాన్,సి.యం.అశోక్ రెడ్డి, పెంటన్న,అనిల్,తదితరులు పాల్గొన్నారు
గణపురం మండల కేంద్రంలో నారగాని మాధవి-శ్రీధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చి. ల. సౌ. అమూల్య -చి.శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గణపురం మండల బిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, యాత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్,బబ్లుగౌడ్, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు
వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదర్శ మోడల్ స్కూల్ యాజమాన్యం.
మందమర్రి నీటి ధాత్రి
మందమర్రి పట్టణం లోని తెలంగాణ ఆదర్శమోడల్ పాఠశాల లో జూనియర్ కాలేజీ విద్యార్థుల తో వార్షికోత్సవ (అనివార్సరీ) వేడుకలు ఘనంగా నిర్వహించరు ముందుగా సరస్వతి పూజ జ్యోతిప్రజ్వాల వెలిగించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్లిమా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ
Adarsh Model School.
మీ తల్లిదండ్రులు కష్టాన్ని మీరు గమనించి జీవితంలో మంచి స్థాయి కి ఎదిగి వారిని సంతోషపెట్టాలని ఆ దిశ గా లక్ష్యాన్ని ఏర్పార్చుకోవాలని కోరారు
Adarsh Model School.
విద్యార్థులు చేసిన జానపద నృత్యలు, యోగ విన్యాసాలు,వివిధ పాటలు లంబాడి నృత్యంలు పలువురు ని అలరించాయి ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ సారా తస్లిమ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయలు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు*
రాయికల్ నేటి ధాత్రి. ఏప్రిల్ రాయికల్.పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025″వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ….. పాఠశాలల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రతిభ పాటవాలు వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్న శిఖరాలను అధిరోహించాలని,సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు.వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు,కరాటే,పౌరాణిక దేశభక్తి నృత్యాలతో పలువురిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు,డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలివితక్కువవాళ్లు తప్పుడు మార్గంలో ప్రయాణించడం సహజం. కానీ తెలివిగలవాళ్లు పతన మార్గంలో పయనిస్తే పర్వర్షన్కు గురై, సమాజ క్రమాన్నే ధ్వంసంచేసే ప్రవృత్తికి దిగజారతారు. ఇటువంటివారు సమాజంలో పేరున్నవారైతే వారి కలిగించే దుష్ప్రభావం ఎంత దారుణంగా వుం టుందో చెప్పలేం. రామ్ గోపాల్‌వర్మ తెలుగు సినిమాకే కొత్త పోకడలు తీసుకొచ్చిన గొప్ప సృజ నాత్మక దర్శకుడుగా అంగీకరించాల్సిందే! కానీ తర్వాతి కాలంలో ‘నా ఇష్టం వచ్చినట్టు బతుకు తా’ అనే పంథాని అనుసరించి, చెత్త సినిమాలు సమాజం మీదికి వదలడంతో, తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్న సామెతలా పరిస్థితి తయారైంది. అటువంటి రామ్ గోపాల్ వర్మలో ఇప్పుడు జ్ఞాన సూర్యడు ఉదయించాడు. 1998లో హిట్ అందుకున్న సత్య సినిమా రెండోసారి రిలీజ్ సందర్భంగా ట్విట్టర్లో ‘తాను ఇప్పటివరకు చేసిన ప్రయాణంపై తీవ్రంగా బాధపడ్డాడు’.ఇకనుంచి మంచి సినిమాలే తీస్తానని శపథం చేశాడు. ఇప్పటివరకు లక్ష్యంలేని ప్రయాణం చేశానని, రంగీలా, సత్య వంటి సినిమాల సక్సెస్‌తో కళ్లు నెత్తికెక్కి పతనమైపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొత్త ఒరవడి పేరుతో కళ్లకు గంతలు కట్టుకొ ని అసభ్య సినిమాలు తీసానంటూ తీవ్ర ఆవేదన పడ్డాడు. తనలోని తెలివితేటల విలువలు తెలుసుకోకుండా, లక్ష్యం లేని జీవితం గడిపానంటూ బాధపడ్డాడు. చేసిన తప్పుల్ని దిద్దుకోలేకపోయినా ఇక ముందు నెంబర్ వన్ సినిమాలే తీస్తానని చెప్పాడు! మంచి మార్పులకోసం కాలం ‘పశ్చాత్తాపమనే’ అద్భుత ఔషధాన్ని ఎప్పుడూ సిద్ధంగా వుంచుతుంది. రాము ఇప్పుడు ఆ ఔషధాన్ని స్వీకరించారు. ఆయనలోని గొప్ప టాలెంట్ బ యటకు రావాలని ఆశిద్దాం!
NETIDHATHRI HYDERABAD: తెలుగు సినీ నిర్మాత డ్రగ్స్ వ్యాపారిగా మారిన కేపీ చౌదరి అలియాస్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చౌదరి మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి గోవాలో ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో కలత చెందాడని ఫిల్మ్ సర్కిల్స్‌లోని అతని స్నేహితులు చెప్పారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కె.పి.చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.తెలుగు సినిమా కబాలికి నిర్మాతగా వ్యవహరించారు. 2023లో 93 గ్రాముల కొకైన్‌తో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చౌదరి ఖాతాదారులు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు మరియు నటీమణులతో సహా సినీ సర్కిల్‌లలో మరియు వ్యాపార వర్గాల్లో కూడా విస్తరించి ఉన్నారని పోలీసులు కనుగొన్నారు.
అతను నైజీరియన్ జాతీయుడైన పెటిట్ ఎబుజర్ నుండి గంజాయిని సేకరించాడని మరియు దానిని తన సర్కిల్‌లలో స్వీయ వినియోగం మరియు సరఫరా కోసం ఉపయోగిస్తున్నాడని నివేదించబడింది. అతను గతంలో HNEW చేత అరెస్టు చేయబడిన డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్ నూన్స్తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.
గోవాకు మకాం మార్చిన చౌదరి అక్కడ క్లబ్‌ను ప్రారంభించాడు. అయితే, అతని వ్యాపారం మునిగిపోయింది. అతను ఇతర సినిమాలకు పంపిణీదారుడు కూడా. అతను నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, చౌదరి పరిశ్రమలోని ప్రముఖులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
టాలీవుడ్లో ఆదాయపు పన్ను దాడులు జరుగుతుండటం ఒకింత అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లపై మంగళవారం ప్రారంభమైన దాడులు బుధవారం కూడా కొనసాగుతుండటం విశేషం. ఇంత ఆకస్మికంగా ఉరుములేని పిడుగు మాదిరిగా ఈ ఐ.టి.దాడులకు కారణమేంటనేది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కాకపోతే ఇటీవలి కాలంలోపుష్ప`2, ప్రపంచ వ్యాప్తంగా రూ.1734.65 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించిందంటూ ప్రచారం కావడం, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్లపై ఎప్పటికప్పుడు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయా చిత్రాల నిర్మాణ సంస్థల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు తదితర ఆర్థిక అంశాల వివరాలను సేకరించి పన్ను చెల్లింపులో నిజాయతీగా వ్యవహరిస్తున్నారా? లేదా? అనే అంశంపైనే ఈ దా డులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవచ్చునంటున్నారు. పుష్ప`2 ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా, సినిమా విడుదల కాకముందే వెయ్యికోట్ల బిజినెస్ చేసిందని గొప్పగా చెప్పడం, కలెక్షన్లపై డైలీ అప్డేట్లు వంటి ఒవర్ యాక్షన్లు, సినిమాకు ప్రేక్షకుల మాట ఎట్లా వున్నా ఐ.టి.శాఖవారికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినట్లయింది. ‘ఓవర్ పబ్లిసిటీ ఎప్పటికీ ప్రమాదమే’ అన్న సత్యాన్ని పుష్ప`2 మరోసారి రుజువు చేసింది.మీడియా వార్తలను బట్టి చూస్తే 55 ఐ.టి.టీమ్‌లు నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఒకే సారి ఈ దాడుల్లో పాల్గంటున్నట్టు తెలుస్తోంది. బయటకు వెల్లడిరచని లావాదేవీలను వెలికి తీయడం కూడా ఈ దాడులకు ప్రధాన లక్ష్యం కావచ్చు. విచిత్రమేమంటే గతంలో బాహుబలి, పుష్ప`1 వంటి అనేక చిత్రాలు భారీ బడ్జెట్‌తో తీసినవే. అప్పట్లో కూడా ఎప్పటికప్పుడు వాటి వసూళ్లపై వార్తలు వచ్చాయి. మరి ఆదాయపుపన్ను శాఖ అప్పట్లో స్పందించలేదు! ని జం చెప్పాలంటే టాలీవుడ్లో చిత్రం విడుదల సమయం నుంచి ఆదాయాలపై మీడియాకు లీకులివ్వడం ఒక అలవాటుగా మారిపోయింది. తమ చిత్రాల కలెక్షన్లకు మరింత బూస్టప్ ఇచ్చుకోవడానికి సినీ నిర్వాహకులు ఈ వ్యాపార టెక్నిక్‌ను ఉపయోగిస్తూ వచ్చారని భావించవచ్చు. ఈవిధంగా బయటకు ప్రకటించే కలెక్షన్ల వివరాలు, నిజమైన వసూళ్లకు పొంతన వుండదని, వసూళ్లలో మతలబు కేవలం నిర్మాతలకు మాత్రమే తెలుస్తుందని చెబుతుంటారు. అయితే ఎంతో కాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పుడే ఈ దాడులు జరపడంలో అంతరార్థమేంటనేది ఇంకా వెల్లడికావాల్సి వుంది.
ప్రస్తుతం ఐ.టి.దాడులు ఏ ఒక్కరిపైనో పరిమితం కావడంలేదు. ప్రముఖులందరి ఇళ్లపై దాడు లు జరుగుతున్నాయి. మొట్టమొదటగా దాడుల విషయంలో పేర్లు పైకి వచ్చింది దిల్ రాజు, మె ౖత్రీ మూవీ మేకర్స్. దిల్‌రాజు ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వున్నా రు. ఇటీవల మైత్రీమూవీ మేకర్స్ తీసిన చిత్రం పుష్ప`2 బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిం చింది. వీరి ఆధ్వర్యంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (అజిత్‌కుమార్ హీరో), ‘జాట్’ (సన్నీడియోల్) వంటి భారీ చిత్రాలు నిర్మాణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరి ఆర్థిక లావాదేవీల పారదర్శకతపై అనుమానంతో ఈ దాడులు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజం చెప్పాలంటే పుష్ప`2 విడుదల సందర్భంగా సంధ్య ధియేటర్ సంఘటన తర్వాత చిత్రపరిశ్రమ ఒక రకమైన అస్థిరతను ఎదుర్కొంటున్నదనే చెప్పాలి. ఈ తొక్కిసలాట సంఘటన తర్వాత సినీ పరిశ్రమ పెద్దలను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లడంలో దిల్‌రాజు కీలకపాత్ర పోషిం చారు. అంతేకాదు వివాదం సర్దుమణిగేలా చేయడంలో కూడా విజయం సాధించారు. ఇదిలా వుండగా అంతకుముందు యదేచ్ఛగా రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్షోలు వేసుకోవడం వంటి అంశాల్లో ఏవిధమైన ఇబ్బంది లేకుండా తమ వ్యాపారాన్ని సజావుగా నడుపుకున్న చిత్రమపరిశ్రమ నిర్వాహకులను సంధ్య థియేటర్ సంఘటన పెద్ద కుదుపునకు లోను చేసిందనే చెప్పాలి. సంక్రాంతికి ముందు విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నా, డాకూ మహరాజ్ వంటి సినిమాల విడుదల గతంలో సంక్రాంతి విడుదల సమయాల్లో చేసినంతటి హడావిడి కనిపించ కుండానే తెరపైకి వచ్చేశాయి. మొత్తంమీద చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఐ.టి. దాడులు సినీపరిశ్రమ భవితవ్యాన్ని డోలాయమానంలోకి నెట్టేస్తాయనడంలో సందేహం లేదు. డబ్బుపై నడిచే ఈ రంగుల ప్రపంచంపై, ఐ.టి.దాడులు తాత్కాలికంగానైనా దాని గమనాన్ని నిదానింపజే స్తాయక మానవు. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా సాధిస్తున్న బాక్సాఫీసు విజయాలు సహజంగానే ఐ.టి.శాఖ దృష్టిని ఆకర్షించి వుండవచ్చు. ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడికావు. కొంత సమయం పడుతుంది. మరి ఈ దాడులు సినీపరిశ్రమలో చోటుచేసుకునే ఆర్థిక అవకతవకలను బయటపెడతాయా లేక ఇది మరో వివాదానికి దారితీస్తుందా అనేది తెలియాలంటే వేచిచూడక తప్పదు.
దిల్ రాజుకు (వి.వెంకటరమణారెడ్డి) చెందిన రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. మొదటిది గేమ్ ఛేంజర్ (రామ్‌చరణ్ హీరో) కాగా రెండవది సంక్రాంతికి వస్తున్నాం (వెంకటేష్ హీరో). ఈ రెండిరటిలో గేమ్ ఛేంజర్ బాక్సాఫీసు వద్ద చతికిల పడినా, సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నట్టు వార్తలు తెలుపుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వరా మూవీ క్రియేషన్స్’ బ్యానర్‌పై మంచి హిట్ చిత్రాలు నిర్మించారు. దిల్, ఆర్య, బమ్మరిల్లు, శతమానంభవతి వంటి చిత్రాలు మైలురాళ్లనదగ్గ విజయాలు సాధించాయి. శాకుంతలం చిత్రాన్ని సమంత రుతు ప్రభుతో కలిసి నిర్మించారు. ఫ్యామిలీస్టార్ కూడా ఈయన నిర్మించిందే. ఈ రెండు చిత్రాలు చిత్రపరిశ్రమలో దిల్రాజును ఒక దిగ్గజంగా నిలబెట్టాయి.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలను రవిశంకర్ యలమంచిలి, నవీన్ యర్నేనిలు స్థాపించారు. మంచి విజయవంతమైన చిత్రాలను తీసి, విజయం ‘అలవాటు’గా మారిన స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. పుష్ప`2 విజయవంతంతో ఈ సంస్థ ప్రాభవం బాగా పెరిగింది. అంతకుముందు రంగస్థలం, జనతాగ్యారేజ్ వంటి విజయవంతమైన చిత్రాలు ఈ నిర్మాణసంస్థ నుంచే వచ్చాయి. భవిష్యత్తులో ఈ సంస్థ అజిత్ కుమార్, పవన్‌కళ్యాణ్, రిషభ్‌శెట్టి వంటి నటులతో చిత్రాల నిర్మాణం చేపట్టే పనిలో వుంది. ఇదిలావుండగా మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
ఐ.టి. దాడులు ఇప్పుడు గాయని సునీత భర్త రామ్ వీరపనేనికి చెందిన మ్యాంగో మీడియాపై కూడా కొనసాగాయి. ఈయన దిల్‌రాజు వ్యాపార భాగస్వామి. వరుసగా రెండోరోజు బుధవారం పుష్ప`2 దర్శకుడు సుకుమార్ ఆఫీసులు, ఇంటిపై కూడా ఐ.టి. దాడులు జరిగాయి. పుష్ప`2కు సంబంధించి భారీ రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటాలు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విమానంలో హైదరాబాద్‌లో దిగిన వెంటనే అధికార్లు ఆయన్ను రై టింగ్స్ ఆఫీసు, ఇంటికి తీసుకెళ్లారు.ఆదాయపుపన్ను శాఖ దాడులు హైదరాబాద్‌లో చాలావరకుతగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం అధికార్లు దాడులు చేస్తున్నారంటే పన్ను ఎగవేతకు సంబంధించి స్పష్టమైన ఆధారాలుండటమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐ.టి.దాడులు ఊరికే చేయడు. స్పష్టమైన ఆధారాలతో తమపని కానిచ్చేస్తారు. అటువంటి ఆధారాలు లేకపోతే ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్’నుంచి వీరికి దాడులకు అనుమతి లభించదు!
ఇపట్లో ఒక హీరో ఒక్క సినిమా చేయడానికే రెండు మూడు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. కానీ నట సింహం బాలయ్య మాత్రం ఒకే రెండు సినిమాలు రిలీజ్ చేసి జై బాలయ్య అనిపించుకున్నారు. 1993 సెప్టెంబరు 3 ఒకే రోజు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే రెండు సినిమాలు హిట్ అయ్యాయి. సుదర్శన 35 ఎంఎంలో నిప్పురవ్వ, సంధ్య 35 ఎంఎం.లో బంగారు బుల్లోడు రిలీజ్ అయ్యాయి. నిప్పురవ్వ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. బంగారు బుల్లోడును రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. కాకపోతే ఎన్నో అంచనాలతో వచ్చిన నిప్పురవ్వ కొంత చతికిలపడింది. ఆవరేజ్ అనుకున్న బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయ్యింది. దటీజ్ బాలయ్య అని అప్పట్లోనే కొనియాడేలా చేసుకున్నారు.
నాగార్జున సినీ కేరిర్‌లో అత్యధికంగా హిట్లు పడిన ధియేటర్ హైదరాబాదులోని దేవీ ధియేటర్ను చెబుతారు. దేవి ధియేటర్లో అందరి హీరోలన్నా నాగార్జున షీల్డులే ఎక్కువ కనిపిస్తాయి. గీతాంజలి, శివ, నిన్నే పెళ్ళాడతా, హలో బ్రదర్, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, అన్నమయ్య ఇలాంటి సూపర్ డూపర్ హిట్లన్నీ దేవీలోనే ప్రదర్శించబడ్డాయి. ఇవే కాకుండా అనేక హిట్ సినిమాలు దేవీలోనే ఎక్కువ కాలం ఆడాయి. రికార్డులు సృష్టించాయి. శివ, నిన్నే పెళ్ళాడతా సినిమాలు సంవత్సరానికి పైగా ఆడాయి. నాగార్జున రికార్డులు నాగార్జునే బ్రేక్ చేసేవారు. నాగార్జున సినిమా బొమ్మ దేవిలో పడితే హిట్ అని ముందే అంచనా వేసేవారు. కొన్ని సెంటిమెంట్లు అలా వర్కవుట్ అయ్యేవి. అందుకే నాగార్జున సినిమా అంటే దేవీలో రిలీజ్ అయ్యేది
ఏ అభిమాన నటుడుని మరో నటుడు ఆరాధిస్తాడో అదే ఇష్టమైన నటుడు తొక్కేస్తే ఎలా వుంటుంది? అవును తెలంగాణకు చెందిన గొప్ప మిమిక్రీ కళాకారుడు, సినీ నటుడు శివారెడ్డి సినీ జీవితాన్ని నాశనం చేసింది ఎవరో కాదు…బ్రహ్మానందం!
అందరి చేత నవ్వుల రారాజుగా పేరు పొందిన బ్రహ్మానందంలో వుండే మరో కోణం ఇది. బ్రహ్మానందం గురించి తెలంగాణకు చెందిన ఏ నటుడు గొప్పగా చెప్పరు. కారణం బ్రహ్మానందం అహంభావం. పైకి కనిపించకపోయినా ఎంతో మంది తెలంగాణ కళాకారుల జీవితాలను ఆగం చేసిన వ్యక్తి బ్రహ్మానందం. అవును.. ఆంద్రాకు చెందిన కళాకారులను ఒక రకంగా, తెలంగాణకు చెందిన నటులను మరో రకంగా చూసిన నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం నవ్వుల వెనుక శాడిజం వుందని చాలా మంది చెప్పారు. ఇప్పటికీ చెప్పుకుంటారు. బ్రహ్మానందం ఎదగడానికి ఎంతో మంది దోహదపడ్డారు. తనకు పోటీ అనుకున్న వారిని తొక్కేయడానికి కూడా అంతే సినీ పెద్దలను బెదిరించారు. ఎప్పటికైనా సరే ఆంద్రా కళాకారులు తెలంగాణ కళాకారులను ఎదగనివ్వరని చెప్పడానికి శివారెడ్డి సినీ జీవితమే సాక్ష్యం. ఒక హీరోకు వుండాల్సిన అన్ని అర్హతలు వున్న శివారెడ్డి సినీ జీవితం ఆగమ్య గోచరం కావడానికి బ్రహ్మానందమే కారణమని సినీ వర్గాలందరికీ తెలుసంటారు. నవ్వుల వెనక విషాదం అంటే ఇదే మరి. నవ్వు నాలుగు రకాల చేటుకు ఇది కూడా సంకేతమే! అవునో కాదో మీ అభిప్రాయం చెప్పండి.
అల్లు అర్జునా? విజయ్ దేవరకొండనా? ఇద్దరిలో ఎవరు బెస్ట్? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర సమాధానమిచ్చింది. అల్లు అర్జున్‌తో రష్మిక మందన్నకు మంచి స్నేహం ఉంది. పుష్ప, పుష్ప 2 సినిమాల్లో వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు రష్మిక మందన్న తెలివిగా ఆన్సర్ ఇచ్చింది.
‘విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా వండర్‌తో సమానం. వీరిద్దరూ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ట్యాలెంట్ యాక్టర్స్ లో నిలుస్తారు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల గురించి నాలాంటి నటిని అభిప్రాయం అడగడం సరికాదు. . ఇతరుల ప్రతిభతో సమానమైన వారికే వారి గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు, అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరి ట్యాలెంట్‌పై వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు’ అని ఇంటెలిజెంట్ గా రిప్లై ఇచ్చింది రష్మిక.
2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితా రిలీజ్ అయింది. అయితే అందులో ఈ ఏడాది అత్యధికంగా వెతికన టాపిక్స్‌లో క్రికెట్ లవర్స్ ఎంతో ఇష్టంగా చూసే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టాప్‌లో ఉన్నాయి. వీటితో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలూ ఉన్నాయని తెలుస్తోంది. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి కూడా చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే మూవీ లవర్స్ మోస్ట్ సెర్చ్డ్ టాపిక్ లిస్ట్‌లో బాలీవుడ్ మూవీ ‘స్త్రీ2’ పేరు టాప్‌లో ఉంది. ఇక ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’, ‘సలార్’ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారని గూగుల్ వెల్లడించింది. వీటితో పాటు ప్రశాంత్ వర్మ – తేజా సజ్జా కాంబోలో తెరకెక్కిన ‘హనుమాన్’ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ‘మీర్జాపూర్’, ‘హీరామండీ’ షోస్ గురించి కూడా గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు తేలింది.
రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్ ఫొగాట్ గురించి కూడా చాలా మంది వెతికారని గూగుల్ వెల్లడించింది. ముఖ్యంగా మెస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బిహార్‌కు చెందిన నీతీశ్ కుమార్, చిరాగ్ పాసవాన్ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారని తెలుస్తోంది. మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా టాప్ సెర్చ్‌లో ఉన్నారు. వ్యక్తుల లిస్ట్‌లో ఆయన ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
VOICE మంచు కుటుంబంలో మొదలైన తుపాను సునామీగా మారింది. మంగళవారం రాత్రి వరకు మోహన్ బాబు వర్శెస్ మనోజ్ అన్నట్టు సాగిన వివాదం ఒక్కసారిగా మరో టర్న్ తీసుకుంది. మీడియా ప్రతినిధులపై దాడితో మోహన్ బాబు వర్శెస్ మీడియాగా పరిస్థితి మారిపోయింది. కుటుంబంలో ఉన్న వివాదంపై ప్రశ్నించిన మీడియాపైనే దాడికి మోహన్ బాబు తెగబడటంతో విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. ఒకే రోజులు రెండు సార్లు మీడియా ప్రతినిధులపై దాడుల చేశారని మాట వినిపిస్తోంది.
మోహన్ బాబు ప్రవర్తను మీడియా సంఘాలు, రాజకీయ నాయకులు ఖండించారు. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనపై కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 118 కింద కేసు రిజిస్టర్ చేశారు. అంతే కాకుండా ఆయనకు కేటాయించిన బౌన్సర్లను బైండోవర్ చేయనున్నారు. గన్ కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. దాడి ఘటనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖండించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. గాయపడిన జర్నలిస్ట్‌కు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశించారు.
కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు దంపతులు ఆసుపత్రి పాలైనట్ట వార్తలు వస్తున్నాయి. గొడవలతో కలత చెందిన మనోజ్ తల్లి సాయంత్రమే అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు చెబుతున్నారు. మరో వైపు తన నివాసంలో మనోజ్ చేసిన హంగామా, మీడియా ప్రతినిధులపై దాడి అనంతరం మోహన్ బాబు కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇద్దర్నీ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా మోహన్ బాబు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం లేదని సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
సినిమాల్లో కొన్ని సందర్భాల్లో ఫోన్ నంబర్లు వాడుతుంటారు. ఆ ఫోన్ నంబర్లు నిజంగా వారివి కాదన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ కొంత మంది పిచ్చి ఫ్యాన్స్, అమాయకపు అభిమానులు ఆ నంబర్లు సదరు హీరో, హీరోయిన్లవే అనుకుంటారు. ఇక పదే పదే ఆ నంబర్లకు ఫోన్ చేస్తుంటారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. రీసెంట్గా అమరన్ చిత్రానికి సంబంధించిన ఓ సీన్లో హీరోయిన్ పాత్ర తన ఫోన్ నంబర్‌ను హీరోకి కాగితం మీద రాసి విసురుతుంది. అందులో ఫోన్ నంబర్ క్లియర్‌గా కనిపిస్తుంది.
చాలా వరకు ఇలాంటి నంబర్లను చూపించే టైంలో బ్లర్ చేసి చూపిస్తుంటారు. అలా బ్లర్ చేస్తే ఏ గొడవ ఉండదు. కొన్ని సార్లు మేకర్లు ఆ నంబర్లను చెక్ చేసుకుని సినిమాల్లో పెడుతుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఏదో ఒక ఫోన్ నంబర్ పెడుతుంటారు. అది ఇంకెవరిదో అయి ఉంటుంది. సినిమా ప్రభావం వల్ల ఆ ఫోన్ నంబర్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇక ఆ ఫోన్ నంబర్ ఉన్న వ్యక్తికి ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తుంటారు.
అలా ఇప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ అంతా కూడా అమరన్ మూవీలో చూపించిన ఫోన్ నంబర్ మీద పడ్డారు. సాయి పల్లవి నంబర్ అనుకుని కొంత మంది పదే పదే ఫోన్లు చేస్తున్నారట. దాని వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండాపోయిందంటూ చెన్నైకు చెందిన విఘ్నేశన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగు వేల కాల్స్ తనకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు రూ.1.1 కోటి పరిహారం కోరుతూ మూవీ టీమ్‌కు లీగల్ నోటీసులను సైతం పంపించాడు. అయినప్పటికీ టీమ్ నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇటీవల అతడు మద్రాస్ హైకోర్టులో ఈ విషయంపై దావా వేశాడు. దీంతో ఈ వివాదంపై మేకర్స్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ వివాదానికి కారణమైన నంబర్‌ను ఓటీటీ వెర్షన్లో బ్లర్ చేసింది. అంతేకాకుండా యూట్యూబ్‌లోనూ ఈ పాటకు సంబంధించిన వీడియోలోనూ నంబర్‌ను పూర్తిగా బ్లర్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి తాజా తన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ యంగ్ డైరెక్టర్ కథకు ఆయన రీసెంట్గా ఓకే చెప్పారు. గతంలో ఈ రూమర్స్ తెగ ట్రెండ్ అవ్వగా, ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఓ అధికారిక అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రానికి సమర్పకుడిగా నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఇక చేతులకు రక్తం కారుతున్న ఓ పోస్టర్‌ను షేర్ చేసి “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అంటూ ఓ పవర్ఫుల్ క్యాప్షన్‌ను జోడించారు. అనానిమస్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా రూపొందుతోంది. దీని తర్వాత చిరు ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల మాట.
వివాదాస్పద పోస్టులు పెట్టడం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. తాజాగా ‘పుష్ప-2’ సినిమా విడుదల సందర్భంగా వర్మ మరో వివాదాస్పద పోస్టు పెట్టారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ… మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని… ఆయన కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని… దీనికి మూడు కారణాలున్నాయని వర్మ తెలిపారు.
తొలి కారణం… ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘పుష్ప-2’ అత్యంత భారీగా విడుదల కాబోతోందని వర్మ అన్నారు. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు బాక్సాఫీస్ ప్రపంచంలోని స్ట్రాటోస్పియర్ ని బ్రేక్ చేస్తాయని చెప్పారు.
రెండో కారణం… భూగ్రహంపై ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విడుదలవుతోందని వర్మ అన్నారు. అందుకే అల్లు అర్జున్ ఈ ప్రపంచంలో ఏకైక ప్లానెట్ స్టార్ అని కితాబునిచ్చారు.
మూడో కారణం… ‘పుష్ప-2’ చిత్రానికి అల్లు అర్జున్ 287 కోట్ల 36 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారని… ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువని వర్మ చెప్పారు. సినీ చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంత ఎత్తుకు ఎదగలేదని… అందుకే అల్లు అర్జున్ నిజమైన టవర్ స్టార్ అని కొనియాడారు.
పాన్ఇండియా స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రానున్న భారీ బడ్జెట్ మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతన్నా కొద్దీ ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఇచ్చారు. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
శ్రీలీల ఎనర్జిటిగ్గా స్టెప్ వేస్తున్న ఫొటో ఒకటి రిలీజ్ చేశారు. ‘పుష్ప -2 టీమ్‌లోకి డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు స్వాగతం పలుకుతున్నాం. కిసిక్ పాట సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. ఇది డ్యాన్స్, మ్యూజికల్‌గా హిట్ కానుంది’ అని మేకర్స్ పోస్ట్‌కు రాసుకొచ్చారు. ఇక కొన్నిరోజులుగా స్పెషల్ సాంగ్‌లో బన్నీతో కలిసి ఏ హీరోయిన్ కలిసి స్టెప్పులేస్తుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూశారు. అయితే శ్రీలీల ఓకే అయ్యిందని తెలిసినా, అధికారికంగా మాత్రం ఇప్పుడే కన్ఫార్మ్ అయ్యింది. ఇక బిగ్ స్క్రీన్‌పై బన్నీ- శ్రీలీల చేసే ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల నాగ చైతన్య శోభితతో నిచ్చితార్ధం చేసుకొని త్వరలోనే రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అయితే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలో సమంత – చైతన్య మీద కామెంట్స్ చేసినట్టే ఈసారి కూడా నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని నిశ్చితార్థం అయినప్పుడే వ్యాఖ్యలు చేసాడు. వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అలాగే శోభిత, సమంత.. ఇలా సినిమా మహిళల పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేస్తున్నందుకు గాను కొన్ని రోజుల క్రితం ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పింది. అయితే వేణుస్వామి మాత్రం మహిళా కమిషన్ కు ఆ అధికారం లేదంటూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. తాజాగా నేడు ఆ స్టే ఎత్తివేస్తూ కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని హై కోర్ట్ తెలిపింది. అలాగే వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి వేణుస్వామి ఇప్పుడైనా మహిళా కమిషన్ ముందు హాజరవుతారా చూడాలి
ఎన్టీఆర్ @tarak9999 కొన్ని రోజుల క్రితం జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా అతని చేతిని తారాగణంతో కదలించారు. గాయపడినప్పటికీ ఎన్టీఆర్ నిన్న రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నాడు. తారాగణం రెండు వారాల్లో ఆఫ్ అవుతుంది మరియు అతను త్వరలో తిరిగి వస్తాడు.
ఇటీవల విడుదలైన డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం చిత్రం ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్‌పై ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ తమిళ సినిమా ఐకాన్ కమల్ హాసన్, తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే వంటి ప్రముఖ తారలు ఉన్నారు.
సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ప్రకారం, ఇది సోమవారం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్కును దాటింది, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.625 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం యొక్క భారతదేశంలో నికర కలెక్షన్లు రూ. 343.6 కోట్లుగా ఉన్నాయి, తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలెక్షన్లలో ప్రధాన భాగాన్ని అందించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.182 కోట్లు వసూలు చేసింది. ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం, హిందీ సర్క్యూట్ రూ. 128 కోట్ల కలెక్షన్లతో రెండవ అతిపెద్ద మార్కెట్. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ ప్రాంతాలలో ఈ చిత్రం యొక్క నైట్ షో ఆక్యుపెన్సీ స్వల్పంగా తగ్గింది.
5వ రోజు తెలుగు ప్రాంతంలో 3డి నైట్ షోల ఆక్యుపెన్సీ 55.43 శాతం ఉండగా, తమిళ్ సర్క్యూట్ నైట్ షోలకు 28.14 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది, హిందీలో థియేటర్లలో 47.28 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.
కల్కి 2898 AD ఆరు నెలల ప్రశాంత కాలం తర్వాత పెద్ద కలెక్షన్ల పరంగా టిక్కెట్ విండోలకు చాలా అవసరమైన విశ్రాంతిని తెచ్చిపెట్టింది. 800 కోట్లకు చేరుకోగానే ఈ చిత్రం తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.