అల్లు అర్జునా? విజయ్ దేవరకొండనా? ఇద్దరిలో ఎవరు బెస్ట్? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర సమాధానమిచ్చింది. అల్లు అర్జున్‌తో రష్మిక మందన్నకు మంచి స్నేహం ఉంది. పుష్ప, పుష్ప 2 సినిమాల్లో వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు రష్మిక మందన్న తెలివిగా ఆన్సర్ ఇచ్చింది.
‘విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా వండర్‌తో సమానం. వీరిద్దరూ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ట్యాలెంట్ యాక్టర్స్ లో నిలుస్తారు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల గురించి నాలాంటి నటిని అభిప్రాయం అడగడం సరికాదు. . ఇతరుల ప్రతిభతో సమానమైన వారికే వారి గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు, అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరి ట్యాలెంట్‌పై వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు’ అని ఇంటెలిజెంట్ గా రిప్లై ఇచ్చింది రష్మిక.