అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలి *సిపిఎం ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతి బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలని సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతన బాద్యతలు చేపట్టిన తహశీల్దార్ పుష్పలతను సీపీఎం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఇసుక, చెరువు మట్టి అక్రమాలపై వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ అక్రమ ఇసుక, మట్టి కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచా అశోక్, సిపిఎం పార్టీ నాయకులు ఎలిగేటి రాజశేఖర్ పాల్గొన్నారు.

సిపిఎం ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతి బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలని సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతన బాద్యతలు చేపట్టిన తహశీల్దార్ పుష్పలతను సీపీఎం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఇసుక, చెరువు మట్టి అక్రమాలపై వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ అక్రమ ఇసుక, మట్టి కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు….

Read More

యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఉపాధి కల్పన శిక్షణ తరగతులు

యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్.పి. అమరవేణి ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారు ఒక వారం పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపాధి కల్పన, శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, రెస్యుమే రైటింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు త్వరలోనే మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు నిర్వహించి…

Read More

మత్స్యశాఖ ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం మత్స్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు చేస్తూ మాసబ్ ట్యాంక్ లోని మత్స్యభవన్ ముందు 193 కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read More

పద్మశాలి రాజకీయ యుద్ధభేరి కోరుట్ల బహిరంగ సభ విజయవంతం చేయాలి.

యుద్ధభేరి ఆహ్వాన కమిటీ ‌సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటి ధాత్రి లగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 13న ఆదివారం నాడు కోరుట్లలో పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు విజయవంతం చేయాలని పద్మశాలి రాజకీయ యుద్ధభేరి ఆహ్వాన సభ్యులు లైసెడ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు, సిరిసిల్లలో పద్మశాలి సంఘ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పద్మశాలి లకు ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదని రాష్ట్రవ్యాప్తంగా…

Read More

గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజానీకానికి వారధిలా క్రమశిక్షణతో పని చేయాలి….ఎంపీపీ పడిగల మానసరాజు

ఈరోజు తంగళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం JPS లను రెగ్యులర్ చేసినటువంటి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నటువంటి తంగళ్ళపల్లి మండల JPS లు ఎంపీపీ పడిగల మానస గారిని, ఎంపీడీవో లచ్చాలు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో ఎంపీపీ పడగల మానస మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజానీకానికి వారధిగా క్రమశిక్షణతో పని చేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లచ్చాలు, పడిగల రాజు, JPS లు పాల్గొన్నారు

Read More

బీసీ బందు చెక్కు పంపిణీ..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగడపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అల్వాల రేణుకకు స్థానిక సర్పంచ్ శ్రీ వాణి రమేష్ చేతుల మీదుగా బిసి బందు బందు చెక్కు అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ బీసీ అనగా రీనా వర్గాలకు 14 కుల వృత్తుల వారికి బీసీ బందు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని బీసీ బందు అనే పథకం నిరంతర ప్రక్రియ అని ఎప్పటికీ కొనసాగుతుందని…

Read More

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోడ్డుకు మోక్షం ఎప్పుడో! *శాయంపేట- ఆత్మకూర్ రోడ్డు పని పూర్తి చేయలేక నిరీక్షణ.

డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు అస్తవ్యస్తం శాయంపేట నేటి ధాత్రి : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం నుండి ఆత్మకూరు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ భాగంలో గత ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించారు. రోడ్డు వెడల్పు భాగంలో ఇండ్లు కోల్పోయిన ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిసి రోడ్ పక్క భాగంలో డ్రైనేజీ లేక మురికి నీరు ఇంటి ఆవరణంలో ముందు భాగంలో విచ్చలవిడిగా ప్రయాణిస్తుంది ప్రజలందరూ, వాహనదారులు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇల్లు కోల్పోయిన…

Read More

నియోజకవర్గంలో నూతనంగా 7 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు.

నూతన రోడ్లకు సీఎం కేసీఆర్ 50కోట్ల నిధులు మంజూరు. వరదపై బురద జల్లే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే బుద్ది చెప్తారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి రైతులకు ఎంతో మేలు చేస్తూ ప్రభుత్వ పథకాలని అమలు చేస్తోన్న ప్రభుత్వం. ఉచితంగా 24గంటల విద్యుత్,…

Read More

మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి

ఎమ్మెల్యేకు ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వినతి వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 235 మంది ఉద్యోగులు శుక్రవారం వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబును సంగీత నిలయంలో కలిసి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. దీనికి ఎమ్మెల్యే స్పందించి మీ సమస్యను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కమీషనర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని…

Read More

సివిల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి.

చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున మన ఊరు మన బడి కార్యక్రమం స్పష్టికర్త జనగామ ముద్దు బిడ్డ తిమ్మయ్య సుభాష్ రెడ్డి* జన్మదిన వేడుకలను మిట్టపల్లి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అని మండలి వ్యవస్థపాక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్ తెలిపారు, వారు మాట్లాడుతు ప్రజా సేవ చేయడం లో అన్ని వర్గాల వారిని ఆదుకొని గొప్ప మనసు వున్నా వ్యక్తి…

Read More

మెదక్ జిల్లా రామయంపేటలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం.

రామాయంపేట మున్సిపాలిటీలో మూడు నెలలుగా కొనసాగుతున్న అన్న ప్రసాద వితరణ కేం ద్రం. రామయంపేట (మెదక్)నేటి ధాత్రి. ..శ్రీమతి అంశానిపల్లి కన్నోజ్ వరలక్ష్మి బ్రహ్మయ్య చారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగభూషణాచారి నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కేంద్రం లో గతస్ మూడు నెలాడ్లుగా కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగింది. రామాయంపేటలో గత మూడు నెలలుగా బాటసారులకు అన్నప్రసాధ అన్న వితరణ కార్యక్రమం మరియు అంబలి మజ్జిగ వితరణ కొనసాగుతుంది. మానవసేవయే మాధవ సేవగా భావించి ఇట్టి…

Read More

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ 15వ వార్డులో ఆది శ్రీనివాస్ సందర్శన వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 15వ వార్డు బాలనగర్ ను శుక్రవారం జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ వార్డు ప్రజలతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. నిత్యవసర ధరలు పెంచి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో…

Read More

యువతికి బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి అభినందన

వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల లింగమూర్తి- పావని దంపతుల కుమార్తె కొప్పుల స్వాతి ఎస్సై ఉద్యోగానికి ఎంపికావడం అభినందనీయమని బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్బంగా ఏనుగు మనోహర్ రెడ్డి శుక్రవారం కొప్పుల స్వాతిని శాలువాతో సన్మానించి, ప్రత్యేకంగా అభినందించారు. స్వాతి ఎస్సై ఉద్యోగంలో రాణించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుక అంజిబాబు, సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి, కౌన్సిలర్…

Read More

మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శ

వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపెల్లి, ఎదురుగట్ల గ్రామాలలో ఇటీవల మరణించిన తుపాకుల రాములు, కొల్లూరి బక్కయ్య, ఐలవేణి నారాయణ కుటుంబాలను శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబ సభ్యులకు ఏనుగు మనోహర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట చెక్కపెల్లి గ్రామ ఉపసర్పంచ్ తలారి మంజుల-సురేష్, మండల రెడ్డి సంఘం నాయకులు రాఘవరెడ్డి, బొంగరపు రామేశ్వర్ రెడ్డి, నేరెళ్ళ నర్సయ్య,…

Read More

ఇండ్ల స్థలాల కేటాయింపు కై జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్లస్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నీ జర్నలిస్టులు కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు కలెక్టర్ నీ కలిసి ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరారు. ఇతర జిల్లాలో ఇచ్చిన ప్రోసెడింగ్ జీవో కాపిని అందజేస్తూ అదే విధంగా తమకి ఇవ్వాలని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులoదరికీ ఇళ్లస్థలాల కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Read More

అంగన్వాడీ టీచర్లకు బీఎల్ఓ డ్యూటీలు వేయద్దని వినతి

నర్సంపేట,నేటిధాత్రి : రాబోయే ఎన్నికల దృశ్య అంగన్వాడి టీచర్లకు బూత్ లెవెల్ అధికారులుగా డ్యూటీలు వేయొద్దని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బీఅర్టియు ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలో నర్సంపేట ఆర్డీవో కృషవేణి,ఎమ్మార్వో విశ్వప్రసాద్ లని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ఐసిడిఎస్ లో అంగన్వాడి కేంద్రాలు పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా నిర్వహిస్తున్నామని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు…

Read More

నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది

డిఎస్పీ నాగేంద్రచారి రుద్రంగి మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం రుద్రంగి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు. రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనిలో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి, సరైన పత్రాలులేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపించి, వాహనాలు తీసుకవేళ్ళవచ్చన్నారు. గొళ్ళెం రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా జంతువులను వేటాడటానికి ఏర్పాటు చేసుకున్న…

Read More

ఘనంగా బోయినపల్లి వినోద్ కుమార్, జోగినిపల్లి సంతోష్ కుమార్

పెళ్లి రోజు వేడుకలు మొక్కలు నాటిన బీఆర్ఎస్ నాయకులు హైస్కూల్, ప్రైమరీ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ బోయినిపల్లి,నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బొయినిపల్లి వినోద్ కుమార్-మాధవి, రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్-రోహిణి పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ…

Read More

అంగన్వాడి కేంద్రంలో ఫ్రీ స్కూల్ కిట్టు పై పిల్లలకు అవగాహన

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లలో శుక్రవారం రోజున ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి పిల్లలకు ప్రీస్కూల్ కిట్టు పై అవగాహన నిర్వహించడం జరిగిందని సూపర్వైజర్ జయప్రద తెలిపారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ పూర్ణచందర్రావు పాల్గొన్నారు, సూపర్వైజర్ జయప్రధ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఎల్కేజీ యూకేజీ నర్సరీ కి సంబంధించిన ప్రీస్కూల్ కిట్టును మహిళా శిశు సంక్షేమ శాఖ…

Read More

ఉపాధ్యాయ సంఘాల ధర్నాను విజయవంతం చెయ్యాలి

పరకాల నేటిధాత్రి(టౌన్) యూఎస్ పిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి ఆధ్వర్యంలో సమస్యల సాధనకై ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీ, ధర్మాను విజయ వంతం చేయాలని యూఎస్ పిసి బాధ్యులు మేరుగు ప్రసన్న రాజారాం ఉపాధ్యాయులకు పిలుపు నిచ్చారు. మండలంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పిఆర్సి కమిటీ వేయాలని, జులై 1 నుంచి ఐఆర్ మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, కొత్త…

Read More