`వైరా సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్.
`రెండు సార్లు రాంచంద్రయ్యను సస్పెండ్ చేయించిన ఘనత నేటిధాత్రి దే.
`మొదటి సారి నిబంధనలకు విరుద్ధంగా పని చేసి కొలువు పోగొట్టుకున్నాడు.
`ఇప్పుడు అర్థరాత్రి దాక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి సస్పెండ్ అయ్యాడు.
`మొదటి సారి నాలుగు నెలలకే మళ్ళీ కొలువు తెచ్చుకున్నాడు.
`ఇప్పుడూ ఆ ప్రయత్నంలోనే వుంటాడు.
`మళ్ళీ మళ్ళీ కొలువు ఇవ్వడం ఎందుకు?
`అక్రమాలు చేసి పట్టుబడినా ఉద్యోగం ఎందుకిస్తున్నట్లు?
`లంచాలకు మరిగిన వారి కొలువులు శాశ్వతంగా తొలగించరా?
`తాత్కాలిక విరామం ఇచ్చి ఇలాగే మళ్ళీ ఉద్యోగం ఇస్తారా?
`ఉద్యోగులలో భయం లేకపోవడానికి కారణం మళ్ళీ కొలువులు రావడమే!
`ఎంత అవినీతి చేసినా ఉద్యోగిని డిస్మిస్ చేయరన్న ధైర్యమే.
`అక్రమ సంపాదనా పరుల కొలువులు తొలగించాలి.
`తప్పు చేయాలంటే చేతులు వణికేలా భయం పుట్టాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. అవినీతికి తాత రామచంద్రయ్య అనే కథనాన్ని ఇటీవలే నేటిధాత్రి దిన పత్రిక ప్రచురించడం జరిగింది. వైరా సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రామచంద్రయ్య బారీ అక్రమాలకు పాల్పడుతూ, అక్రమ రిజిస్ట్రేషన్లు సాగిస్తున్న సంగతిని నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది. దాంతో కమీషనర్ జ్యోతి బుద్దా ప్రసాద్ వరకు సమాచారం చేరడంతో రామచంద్రయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రయ్య కాకలు తీరిన అవినీతి తిమింగలాల్లో ఒకరని గతంలోనే నేటిధాత్రి ఆయనపై కథనాలు ప్రచురించింది. నేటిధాత్రి దిన పత్రిక గత కొన్నేళ్లుగా రికాంలేని రిజిస్ట్రార్ల పేరుతో సబ్ రిజిస్ట్రార్ల అక్రమ రిజిస్ట్రేషన్లపై వరస కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఆ కథనాల మూలంగా చాలా మంది సబ్ రిజిస్ట్రార్లు రెడ్ హండెడ్‌గా పట్టుబడి కొలువులు కోల్పోయారు. తాజాగా వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య మరోసారి సస్పెండ్‌కు గురయ్యారు. రామచంద్రయ్య గతంలోనే శాఖాపరమైన తనికీలలో అక్రమాలు సాగిస్తున్న సంగతి తెలిసి ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. అయితే ఉన్నతాదికారులను ప్రసన్నం చేసుకొని నాలుగు నెలలకే మళ్లీ కొలువుదీరాడు. అయినా ఆయనలో మార్పు రాలేదు. అప్పుడు కూడా నేటిదాత్రి రామచంద్రయ్య సాగిస్తున్న అక్రమ కార్యాకలాపాలపై నేటిదాత్రి కధనాలను అందించింది. స్పందించిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాదికారులు తనికీలు నిర్వహించారు. రామచంద్రయ్య అడ్డంగా దొరికిపోయాడు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. మళ్లీ అదే పనిగా తన వృత్తి నిర్వహణలో అక్రమాలను సాగిస్తూనే వున్నాడు. గతం కన్నా మించి అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తూ వచ్చారు. ఆఖరుకు అర్ధరాత్రి వరకు కూడా కార్యాలయంలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది. సాక్ష్యాత్తు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే పలు మార్లు రిజిస్టేషన్, రెవిన్యూశాఖల అవినీతి అదికారులను హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వారిలో మార్పు రాలేదు. కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా పలు మార్లు హెచ్చరించారు. ఏకంగా మంత్రి హెచ్చరికలనే రామచంద్రయ్య పెడ చెవిన పెట్టాడు. దొరికిపోయాడు. ఇలా రెండుసార్లు ఒక ఉద్యోగిని సస్పెన్షన్ చేయించిన ఘనత నేటిదాత్రి దినపత్రికకే దక్కింది. మొదటిసారి ఏకంగా శాఖఫరమైన నిబంధనలనే తుంగలో తొక్కి పిల్ల కళ్లు మూసుకొని పాలు తాగినట్లు అడ్డగోలు వ్యవహరాలు చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఈసారి అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేసి సప్పెండ్ అయ్యాడు. అయినా మారుతామన్న నమ్మకం నమ్మకం లేదు. ఒకసారి అవినీతికి అలవాటు పడిన ఏ అధికారి మారినట్లు చరిత్ర లేదు. అవినీతి సంపాదనకు ఎగబడి, అక్రమంగా సంపాదనకు మరిగిన ఉద్యోగులు కొలువులు పోయినా మళ్లీ వస్తాయనే దీమాతోనే పదే పదే లంచాలు తీసుకుంటున్నారు. దొరికినా ఫరవాలేదన్నట్లు బహిరంగంగానే ముడుపులు తీసుకుంటున్నారు. దొరికిపోతున్నారు. అయినా వారిలో తప్పు చేశామన్న భావన కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు కొలువుపోయినా మళ్లీ మళ్లీ వస్తుందన్న మన్మకమే ఉద్యోగులను మరింత విచ్చలవిడి అవినీతికి పాల్పడేందుకు కారణమౌతోంది. ఇప్పుడు కూడా కొలువు మళ్లీ ఎలా పొందాలన్నదానిపైనే రామచంద్రయ్య మళ్లీ లాబీయింగ్ మొదలు పెట్టాడు. సస్పెండ్ అయినట్లు ఉత్తర్వులు వచ్చిన మరుక్షణం నుంచే మళ్లీ తన కొలువు ఎలా తెచ్చుకోవాలన్నదానిపై ఉన్నతాదికారులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయినా ఇలా ఉద్యోగం పోగానే అలా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం అంటే ఎంత దైర్యం వుండాలి. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాదికారుల వ్యవహారం ఎలా వుందనే అర్దం చేసుకోవాలి. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరిన వాళ్లూ, అక్రమాలు చేసి ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు మళ్లీ ఉద్యోగం ఇచ్చినప్పుడు ఒక కొలువు తొలగించడం ఎందుకు? అటు పట్టుబడి సస్పెన్షన్ అయిన వెంటనే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్లు ఆర్డర్ కూడా ఇస్తే సరిపోతుంది. అలా కొలువు పోయిన కొన్ని రోజులకే ఇలా మళ్లీ ఉద్యోగం వస్తుంటే అవినీతి ఎందుకు ఆగుతుంది? అదికారులు ఎందుకు మారుతారు? ఎందుకు భయపడతారు? ఉద్యోగం పోతే మళ్లీ రాదన్న భయం వారిలో ఏర్పడాలి. ఒక్కసారి పట్టుబడితే సంపాదించిన ఆస్ధులన్నీ ప్రభుత్వ పరమౌతాయన్న భయం వుండాలి. ఆస్దులు జప్తు చేస్తే తప్ప అదికారులు లంచాలు తీసుకోవాలంటే భయపడరు. ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించకపోతే అవినీతి ఆగదు. అదికారులు లంచాలు మానరు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొన్ని వందల మంది అక్రమార్కులు దొరికారు. అయినా ఎక్కడా అవినీతి ఆగినట్లుగాని, అదికారులు భయపడుతున్నట్లుగాని లేదు. జరగాల్సిన అవినీతి జరుగుతూనే వుంది. దొరుతున్న వారు దొంగలు. దొరక్కుండా జాగ్రత్త పడుతున్న దొంగలు ఇంకా ఎంతో మంది వున్నారు. వాళ్లంతా లంచం ముట్టుకోవాలంటే భయపడే పరిస్ధితి రావాలి. ఒక్కసారి కొలువుపోతే మళ్లీ జీవితంలో ఉద్యోగం రాదన్న భయం ఏర్పడాలి.