కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళ హత్యకు గురైంది. మృతురాలి ఒంటిపైన ఉన్న నగలను హంతకులు అపహరించారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్ గల్ గ్రామానికి చెందిన గొరిగే సత్యవ్వ (55) తన ఇంటిలోనే హత్యకు గురైంది. గురువారం సాయంత్రం సత్యవ్వ అన్న పాపుగొండ సత్యవ పొద్దున్నుంచి కనిపించడం లేదని ఆమె ఇంటికి వెళ్లి చూడగా సత్యవ్వ ఇంట్లో చనిపోయి ఉంది. ఆమె ముక్కునుండి నోటి నుండి రక్తం కారి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు. అని ఆమె ఒంటిపై ఉన్న నగలు కనిపించలేదు దానితో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సత్యవ్వ ఒంటరిగా ఉన్నది చూసి ఆమెను చంపి అట్టి బంగారాభరణాలు ఎత్తుకుపోయి ఉంటారు అని మృతురాలి అన్న గొరిగే పాపు గొండ ఫిర్యాదు ఇవ్వగ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పిట్లం పోలీసులు తెలిపారు.