హసన్ పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల బూత్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం

ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి ఆరూరి రమేష్

హసన్ పర్తి / నేటి ధాత్రి

వరంగల్ పార్లమెంట్ విజయానికి సిద్దమయ్యేందుకు ఎర్రగట్టు గుట్ట ఎమ్మెస్సార్ గార్డెన్స్ లో జరిగిన గ్రేటర్ వరంగల్ 1,2,55,56,65,66 మరియు హసన్ పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల బూత్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, పదికి పైగా సీట్లు గెలుచుకొని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి అభివృద్ధి చూపించాల్సి వస్తే కాంగ్రెస్ పాలకులు చెబుతున్నట్టు గుజరాత్ ఉత్తరప్రదేశ్ కాదు. వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట ముఖ్య నగరాలకు ఫోర్ వే లైన్ రోడ్లు, వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం, కాజీపేట టు విజయవాడ ఫోర్ వే రైల్వే లైన్, 2014 నాటికి తెలంగాణలో 2511 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాత 9 ఏళ్ల కాలంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2269 కిలోమీటర్ల జాతీయ రహదారులు వివిధ దశల్లో ఉన్నాయనీ అన్నారు, కరీంనగర్ నుండి వరంగల్ కు, వరంగల్ నుండి యాదాద్రి కి ఫోర్ లైన్ జాతీయ రహదారి విస్తరణ, స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా వరంగల్ పట్టణంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 250 కోట్లు, హెరిటేజ్ సిటీ కింద వరంగల్ కు 32 కోట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. వరంగల్ లోని కాకతీయ కళా సంపదకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కూడా మోడీ గారిది అని కొనియడగారు. కాజిపేట్ టు విజయవాడ మూడో లైన్, ఆదర్శ రైల్వే స్టేషన్లో కింద వరంగల్ కాజీపేట జంక్షన్ అభివృద్ధి. 521 కోట్లతో కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు, తద్వారా ఎంతోమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా వరంగల్ కు 7096 ఇల్లు మంజూరయ్యాయని గత పాలకులు లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడంలో జాప్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కిరోసిన్తో దీపాలు పెట్టుకునే దుస్థితి నుండి, ప్రధానమంత్రి సౌభాగ్య యోజన పథకం ద్వారా తెలంగాణలో ఐదు లక్షల 15 వేలకు పైగా కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానిది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, చేస్తున్న కూడా అవన్నీ కాంగ్రెస్ నాయకులకు కనపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి జరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పాలకులు తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తూన్నారని అన్నారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని తెలిపారు ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోడీ గారికి తమ ఓటమి ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారని, ఈసారి 400 సీట్లకు పైగా మోడీ గారికి ప్రజలు కానుకగా ఇవ్వన్నారని అన్నారు అనంతరం హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం నుండి వివిధ పార్టీల నుండి అరూరి రమేష్ గారి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరగా వీరికి రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రభారి మురళీ గౌడ్,జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ,మాజి శాసనసభ్యులు ధర్మరావు,పార్లమెంట్ కన్వీనర్ కుమారస్వామి,అసెంబ్లీ కన్వీనర్ కేశవ రెడ్డి,జెడ్పీటీసీ సునీత,పాక్స్ చైర్మన్ రమేష్ గౌడ్,మాజి జెడ్పీటీసీ సుభాష్,మార్కెట్ డైరక్టర్ రాజేశ్వర రావు,డివిజన్ అద్యక్షులు,బూత్ అద్యక్షులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *