18 నుండి ఎంపీ గా పోటీ చేసే అబ్యర్టులు దరఖాస్తుచేసుకోవచ్చు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 18 నోటిఫికేషన్ తేది నుండి దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల నోటిఫికేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు.
ఏప్రిల్ 18 న నాగర్ కర్నూలు రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందనీ, వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నందున నామినేషన్ లు నాగర్ కర్నూలు జిల్లాలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని నామినేషన్ వేయదలచిన అభ్యర్థులు నేరుగా రిటర్నింగ్ అధికారికి గాని లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు హార్డ్ కాపీలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అఫిడవిట్ నింపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారుఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అభర్తులందరికి సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రచార అనుమతులు సహాయ రిటర్నింగ్ అధికారి నుండి పొందవచ్చని తెలిపారు.ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ .వి.యం ల మొదటి విడత ర్యాండ మైజేశన్ సైతం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు.వనపర్తి జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్, ఆర్డీవో పద్మావతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.ఎన్.సి నుండి వెనాచారి, త్రినాథ్, బి.జే.పి నుండి వేంకటేశ్వర రెడ్డి, కుమార స్వామి, బి.ఆర్.ఎస్ నుండి సయ్యద్ జమిల్ , సిపిఎం పరమేశ్వరా చారి, యం.ఐ.యం నుండి రహీం, ఎన్నికల సెక్షన్ నుండి కిషన్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *