సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజ్ డిమాండ్
కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి:
మంగళవారం రోజున అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సమ్మెలో భాగంగా ఇనుగుర్తి మండల తహసిల్దార్ సూర్యనారాయణకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జయరాజ్ అంగనవాడిలతో కలిసి ఇచ్చారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ల నుంచి చాలిచాలని వేతనాలతో జీవనాన్ని సాగిస్తున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్‌కు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా కూడా రాష్ట్ర,ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర,ప్రభుత్వం స్పందించి నెలకు రూ. 26వేల రూపాయలు ఇవ్వాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు.పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యూ టి చెల్లించాలని అన్నారు.తక్షణమే రాష్ట్ర, ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ,ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ కళావతి,దర్శనం అరుణ పాల్గొన్నారు.