– హైకోర్టు నుండి మధ్యంతర ఉత్తర్వులు జారీ
– బార్ యజమాని జిందం మహేందర్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిత్రబార్ అండ్ రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ బకాయి ఉన్నందున ఇటీవలే మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బార్ యజమాని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో బార్ ని ఓపెన్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా బార్ అండ్ రెస్టారెంట్ యజమాని జిందం మహేందర్ తమ వ్యాపారాన్ని ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ బకాయిలు ఉన్నాయని తాత్కాలికంగా కమిషనర్ సీజ్ చేశారని, అదే రోజు బకాయి వెంటనే చెల్లించి సంబంధిత రసీదు మున్సిపల్ కార్యాలయంలో అందించామని అయినప్పటికీ ఇప్పటివరకు బార్ సీజ్ ఉత్తర్వులను ఎత్తివేయలేదని, కోర్టు ఉత్తర్వులను తీసుకొని బార్ ను యధావిధిగా కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఇది ఇలా ఉండగా శనివారం రాత్రి 8 గంటలు అవుతున్న కూడా బార్ సీజ్ ను ఎత్తివేయలేదని జిందం మహేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.