*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి :*
గుండాల మండల కేంద్రం నిట్ట వారి మైదానం లో శనివారం నాడు వ్యాపారవేత్తలు పట్వారి వెంకన్న, మాడె మంగయ్య సహకారంతో పోలీస్ ,జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. గుండాల సీఐ రవీందర్ వారి సిబ్బంది, జర్నలిస్టులు మొత్తం మూడు మ్యాచుల్లో ఉత్సాహంగా పాల్గొనగా చెరొక మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు ఆహ్లాదకరంగా గడిపినట్లు తెలిపారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం గెలుపొందిన రెండు జట్లకు వ్యాపారవేత్త మానాల వెంకన్న షీల్డ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.