Grand Dhwaja Sthambam Installation
వైభవోపేతంగా శిలాధ్వజ యంత్ర ప్రతిష్టాపన…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట జాతీయ రహదారి పక్కనగల గాంధారి మైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శిలాద్వజ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ద్వజస్తంభ ప్రతిష్టాపన దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గత మూడు రోజులుగా ఆలయంలో విశేష, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేదస్వస్తి, వాస్తు పూజ హోమం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, మహదాశిర్వచనము, అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ధ్వజ స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి- రాజా రమేష్, వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత – శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.క్యాతనపల్లి మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆలయ కమిటీ తెలియజేసింది.
