BRS Cadre Rush to Farmers Conference
రైతు సంగ్రామ సదస్సుకు 5వ డివిజన్ నుండి భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
#5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హన్మకొండ, నేటిధాత్రి:
పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపు మేరకు, హన్మకొండలోని 5వ డివిజన్ నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రైతు సంగ్రామ సదస్సుకు బయలుదేరి వెళ్లారు.
5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి సుదర్శన్, వైస్ ప్రెసిడెంట్ పండగ సాగర్, అరవింద్, రవీందర్, సతీష్ రెడ్డి, సాయి, మూల ప్రభాకర్, రఘు, నారాయణగిరి, రాజు, జనార్ధన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రైతుల సమస్యలపై గళం ఎత్తేందుకు, పార్టీ ఆదేశానుసారం ఈ సదస్సుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం దాస్యం వినయ్ భాస్కర్ నాయకత్వంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి ముఖ్య నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
