`అవినీతి అధికారుల గుండెల్లో అంకుశం ప్రసన్న.
`వైద్య శాఖలో ప్రశ్నించే గాంఢీవం ప్రసన్న.
`ప్రశ్నించినందుకు అనేక అవరోదాలు ఎదుర్కొన్నారు.
`శాఖ పరమైన ఇబ్బందులు అనేక దశల్లో ఎదుర్కొన్నారు.
`జీవితంలో అనేక సమస్యలు ఎదురించి నిలిచారు.
`అయినా గుండె దైర్యం చెదరలేదు.. అవినీతి మీద పోరాటం ఆపలేదు.
`ఇంక్రిమెంట్లు ఆపినా వెనుకడుగు వేయలేదు.
`అడుగడుగునా అణచి వేయాలని చూసినా ఆగిపోలేదు.
`తోటి ఉద్యగులకు అన్యాయం జరిగినా సహించేవారు కాదు.
`శాఖలో అవినీతి జరిగినా ఉపేక్షించే వారుకాదు.
`అడుగడుగునా జరిగే అవినీతిని అడ్డుకున్నారు.
`అవినీతి అధికారుల భరతం పట్టారు.
`అవినీతికి పాల్పడే వారికి కొరకారాని కొయ్యగా మారారు.
`జీవితాంతం శాఖలో జరిగే అవినీతిపై అలుపెరగని పోరాటం చేశారు.
`ఇబ్బందులు ఎదుర్కునే తోటి ఉద్యోగులకు అండగా నిలిచారు.
`గత ప్రభుత్వంలో వైద్య శాఖలో జరిగిన అవినీతి పై అనేక ఉద్యమాలు చేశారు.
`న్యాయస్థానాలలో కూడా అవినీతి పరులపై కొట్లాడారు.
`అవినీతి పరులు చేసిన అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.
`గత ప్రభుత్వం వైద్య శాఖలో చేసిన అవినీతిపై సిఎం రేవంత్ కు నివేదికలు సమర్పించారు.
`సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైద్య శాఖలో అవకతవకలపై నివేదికలు అందించారు.
`అప్పుడు సీఎం రేవంత్ పోరాటానికి మద్దతుగా నిలిచారు.
`అనేక నివేదికలు తయారు చేసి రేవంత్ పోరాటానికి సహకరించారు.
`ప్రసన్న సేవలు ఎంతో అవసరమని ఆనాడు సీఎం. రేవంత్ రెడ్డి అన్నారు.
`ప్రసన్న సేవలు రేవంత్ సర్కార్ వినియోగించుకోవాలి.
`గత పాలకులు చేసిన అవినీతి బండారం బైటకు రావాలంటే ప్రసన్న సేవలు అవసరం.
`కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ప్రసన్న కీలక భూమిక పోషించారు.
`ఏకంగా కేసీఆర్ ను ఓడించేందుకు ప్రసన్న రంగలోకి దిగారు.
`కామారెడ్డి లో కెసిఆర్ ను ఓడించేందుకు పోటీ కూడా చేశారు.
`కేసీఆర్ ఓటమికి ఓట్ల గండి కొట్టి కాంగ్రెస్ గెలిచేందుకు కారణమయ్యారు.
`ఆమె సేవలకు గుర్తుగా వైద్య శాఖలో ఏ పదవి ఇచ్చినా వన్నె తెస్తారు.
`సీఎం రేవంత్ సర్కార్ కు మరింత పేరొచ్చేలా బాధ్యత నిర్వహిస్తారు.
హైదరాబాద్, నేటిధాత్రి:
అలుపెరగని పోరాటం అనే పదం అతి కొద్దిమందికి మాత్రమే ఉపయోగిస్తుంటాం. అందులో అవినీతిపై పోరాటం చేసే ప్రసన్న పేరు కూడా చెబుతుంటాం. ఒక మహిళగా, మరో వైపు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ అవినీతిపై పోరాటం చేయడం అనేది గొప్ప విషయం. సహజంగా అవినీతిపై ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయి. రాజకీయ నాయకులు పోరాటం చేస్తామంటారు. అవినీతి గురించి సభలు, సమావేశాల్లో చర్చిస్తుంటారు. కాని వ్యవస్ధలో వుంటూ, అదే వ్యవస్ధలో జరిగే అవినీతిపై నిఘా నేత్రంతో పోరాటం చేయడం అంటే సామాన్య విషయం కాదు. అడుగడుగునా అవాంతరాలు ఎదురౌతాయి. ఉద్యోగ జీవితం ఒడిదొడుకులను ఎదుర్కొవాల్సి వుంటుంది. అవసరమైతే ఉద్యోగం కూడా చిక్కుల్లో పడుతుంది. నిజానికి అవినీతికి పాల్పడే వారి జీవితాలకన్నా, ఉద్యోగ జీవితంలో అవినీతిపై పోరాటం చేసే వారు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. అయినా సరే..తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టైనా సరే ఆ వ్యవస్ధలో అవినీతి అంతం కోసం పాటు పడడం అంటే గొప్ప వ్యక్తిత్వం కావాలి. ప్రజా చైతన్యం నిండి వుండాలి. అలాంటి మహిళా ఉద్యోగే ప్రసన్న. వైద్యశాఖలో ఆమె చిరుద్యోగిగా వృత్తి ప్రస్తానం మొదలైన నాటి నుంచి పైసా అవినీతి కనిపించినా ఆమె ఆక్షేపించేది. అడ్డుకునేది. ప్రశ్నించేది. నిలదీసేది. ప్రభుత్వ కొలువు చేస్తూ, ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ అవినీతి చేసే వారంటే ఆమెకు నచ్చదు. అసలు అవినీతి అంటేనే ఆమెకు పడదు. అలా అవినీతికి పాల్పడే అధికారుల గుండెల్లో అంకుశం ప్రసన్న. వైద్యశాఖలో తన కళ్లముందు ఎక్కడ అవినీతి కనిపించినా ఆమె సహించేది కాదు. ప్రజా సేవలో వైద్యం అనేది గొప్ప సేవ. అది అందరికీ సాద్యం కాదు. అందరూ చేయలేరు. ఒక రకంగా వైద్య సేవలు చేసే వారు దైవంతో సమానం. అలాంటి స్దానంలో వుండి అవినీతికి పాల్పడడం పాపమని ఆమె భావిస్తారు. అందుకే అవినీతిపరులను ఎదుర్కొంటారు. తన చుట్టూ వున్న సమాజంలో అవినీతి జరగకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. అవినీతి నిర్మూలనలో, అవినీతిని అడ్డుకోవడంలో ఆమె విజేతగా నిలిచారు. ఇలాంటి వ్యక్తిత్వం వున్న వారు ఉద్యోగ సమాజంలో చాల తక్కువగా వుంటారు. అందులోనై వైద్యశాఖలో ఏ ఒక్కరో, ఇద్దరో వుంటారు. అందులో ప్రసన్న ఒకరు వున్నారు. అని ఆ శాఖ గర్వంగా చెప్ప్పుకునేలా ఆమె జీవితం గడిపారు. అతి సాధారణ జీవితం. ప్రజా సేవకు అంకితమైన జీవితం. అలా తన శాఖలో అవినీతిని ప్రశ్నించినందుకు అనేక అవరోధాలు ఎదుర్కొన్నారు. పై అదికారుల నుంచి ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఆమె వేటిని లెక్క చేయలేదు. అవినీతిని ప్రశ్నించడం ఆపలేదు. తన జీవిత కర్తవ్యం సేవ అయితే, లక్ష్యం అవినీతి నిర్మూలన అని గట్టిగా చెప్పిన వైద్యశాఖలో ఏకైక మహిళ ప్రసన్న. ఎందుకంటే వైద్యశాఖలో ప్రభుత్వ సేవలో కూడా అనేక అవినీతికి ఆస్కాముండే పరిస్ధితులున్నాయి. కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు సేవ చేయడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటారు. వైద్యశాఖకు కేటాయిస్తుంటారు. వైద్యం వచ్చిన వారిని వేదించడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం దగ్గర నుంచి ప్రభుత్వ గ్రాంట్లలో అవినీతికి పాల్పడడాన్ని ఆమె సహించేది కాదు. వచ్చిన లెక్కకు, పోయే లెక్కలకు లేని పొంతనను చూసి ఆమె అడుగడుగునా ప్రశ్నించేది. నిలదీసేది. ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లేది. ఒంటరిగా పోరాటం చేసేది. అలాంటి సందర్భంలో శాఖాపరమైన ఇబ్బందులు అనేక దశల్లోనూ ఆమె ఎదుర్కొన్నారు. అటు ఉద్యోగపరంగా, ఇటు వ్యక్తిగా సమాజ పరంగా కూడా సవాళ్లను ఎదిరించి నిలిచారు. కొన్ని సార్లు ఆమె ఇంక్రిమెంట్లు కూడా ఉన్నతాధికారులు ఆపడం జరిగింది. అయినా ఆమె వెరవలేదు. వెనుకడుగు వేయలేదు. తన జీతం కోసం ఏనాడు ఆలోచించలేదు. ప్రజల జీవితాలను గురించి మాత్రమే ఆలోచించేవారు. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా పేదల వైద్యం కోసం అందాలన్నదే ఆమె లక్ష్యం. అడుగడుగునా అణచి వేయాలని చూశారు. ఉద్యోగ పరంగా చిన్న స్ధానం, పైగా మహిళ కావడంతో ఆమె వివక్షను కూడా ఎదుర్కొన్నారు. ఎవరికీ లేని పట్టింపు నీకెందుకు? ఇంత మందిలో ఒక్కదానికి ప్రశ్నించి ఏం సాదిస్తావు? మమ్మల్నీ ఏమీ చేయలేవని కూడా అని ముఖం మీద చెప్పి, బెదిరించిన అదికారులు కూడా వున్నారు. ఉద్యోగిగా ఉన్నతాధికారులను గౌరవిస్తాను. కాని వారి అవినీతిని కలలో కూడా సహించని చెప్పగలిన దీశాలి ప్రసన్న. అవినీతితోపాటు వ్యవస్ధలో తోటి ఉద్యోగులకు ఏదైనా అన్యాయం జరిగినా ఆమె సహించేవారు కాదు. తోటి ఉద్యోగులకు అండగా నిలిచేవారు. వారికి తోడుగా వుండేవారు. వారి పోరాటంలో కలిసి పనిచేసేవారు. తోటి ఉద్యోగులకు శాఖాపరంగా సమస్యలు ఎదురైనా ఊరుకునేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెను చెడును క్షమించేవారు కాదు. అందుకే ఆమె చేసిన అలుపెరగని పోరాటంలో ఎంతోమంది అవినీతి అదికారుల కొలువులు పోయేలా చేశారు. వారి భరతం పట్టారు. ఆఖరుకు కోర్టుల్లో కూడా ఆమె విజయం సాదించారు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వైద్యశాఖలో జరిగిన అక్రమాలపై ఆమె అలుపెరగని పోరాటం చేశారు. అప్పటి డిహెచ్. గడల శ్రీనివాస్ సాగించిన అక్రమాలపై పోరాటం చేశారు. నిధుల దుర్వినియోగం వెలుగులోకి తెచ్చారు. కోట్లాది రూపాయలు ఎలా పక్కదారి పట్టాయో ప్రజల ముందు వుంచారు. అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితంలేకపోవడంతో, అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు, పిసిసి. అధ్యక్షుడుగా వున్న ప్రస్తుత సిఎం. రేవంత్‌రెడ్డికి అనేక నివేదికలు ఇచ్చారు. వైద్యశాఖలో జరుగుతున్న అవినీతిపై అన్ని రకాల సమాచారాలు అందించారు. ముఖ్యంగా డిహెచ్ గడల శ్రీనివాస్ వల్ల వైద్యశాఖ ఎంత నష్టపోతుందో తెలిపే ప్రయత్నం చేశారు. అర్హత లేకున్నా డిహెచ్ కుర్చీ ఆయనకు ఎలా వచ్చింది? అందుకు ఎవరు సహకరించారు? ఎందుకు సహకరించారు? దాంతో సహకరించిన వాళ్లు ఎంత లబ్దిపొందారు? ఆ సమయంలో గడల శ్రీనివాస్ వందల కోట్లు ఎలా మాయం చేశారు? ఆ నిదులతో ఆ సమయంలో ఎన్నికల్లో పోటీకోసం ఎలా ఖర్చు చేశారు? ఇలాంటి అనేక విషయాలపై సమగ్రమైన సమాచారాన్ని సిఎం. రేవంత్‌రెడ్డికి అనేక సార్లు కలిసి అందించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని మాట ఇచ్చారు. కాకపోతే ప్రసన్న సేవలు వినియోగించుకోవడానికి ఇంకా సమయం రావడం లేదు. గత ప్రభుత్వం గద్దె దించడంలో కీలక భూమిక పోషించారు. రిటైర్ అయిన తర్వాత ఆమె సిఎం. రేవంత్‌రెడ్డికి రాజకీయం కూడా వైద్యశాఖకు చెందిన అక్రమాలపై సమాచారాలు అందిస్తూ వచ్చారు..అలా కాంగ్రెస్ గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె సహకారం అందించారు. అంతే కాకుండా కామారెడ్డిలో కేసిఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యారు. నేరుగా కేసిఆర్ మీద కామారెడ్డిలో పోటికి దిగారు. కేసిఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యారు. బిఆరఎస్ ఓటమికి తాను కీలక భూమిక పోషించారు. అయితే ఇలా వైద్యశాఖకుచెంది ఆ శాఖను కాపాడడం కోసం కృషి చేసిన వారిని గతంలో ఎమ్మెల్సీలను కూడా చేశారు. వారి సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవులిచ్చి, తర్వాత వారి అనుభవాలను ప్రభుత్వం వినియోగించుకునేవి. ముఖ్యంగా వైద్య శాఖలో నర్సులుగా పనిచేసిన వారి సేవలను ఆ రకంగా పాలకులు గుర్తించేవారు. అలా వీలుకాని పక్షంలో శాఖకు చెందిన కొన్ని ప్రత్యేకమైన పదవులు అందించేవారు. ముఖ్యంగా ప్రభుత్వం కొనుగోలు చేసే మందుల విషయంలో, వాటి సరఫరా విషయంలో ఎలాంటి అవతవకలు జరకుండా చూసుకునే టిజిఎంఎసఐడిసీ వంటి పదవులు ఇచ్చేవారు. నిజంచెప్పాలంటే వైద్యశాఖలో అవినీతి, అక్రమాలు జరగకుండా చూసుకుంటూ వచ్చిన ప్రసన్న సేవలు రేవంత్ సర్కారు కూడా వినియోగించుకోవాలని ఆమె సహచర ఉద్యోగులు కూడా కోరుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నాయకురాలిగా కూడా పనిచేసిన ప్రసన్న సేవలు వినియోగించుకోవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలకు రేవంత్ సర్కారు మెరుగైన పాలన సాగించేందుక దోహదపడేలా ప్రసన్న సేవలను వినియోగిం చుకోవాలని సూచిస్తున్నారు.
