జనం బలహీనతలు ఓట్లు చేసుకుందాం!
`అలవి కానీ హామీలిచ్చి గెలుద్దాం!
`ఇప్పడైతే నమ్మిద్దాం… గెలిచి డబ్బులేదందాం!?
`రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ఎన్నికల బాట.
`నిజం చెబితే జనం నమ్మడం లేదు.
`అబద్దాలు చెప్పకపోతే గెలిచే పరిస్థితి లేదు.
`రాజకీయ వ్యూహకర్తలు కూడా ఇదే చెబుతున్నారు.
`రాజకీయ పార్టీలు అదే నమ్మి ప్రచారం చేసుకుంటున్నారు.
`ఎవరు ఎన్ని ఎక్కువ హామీలు ఇస్తున్నారనేదే జనం ఆలోచిస్తున్నారు.
`ఉచిత పతకాలు అందుతాయనే ప్రజలు ఆశ పడుతున్నారు.
`అన్ని అమలు కాకపోయినా ఏ ఒక్కటైనా అందక పోతుందా అనుకుంటున్నారు.
`తమిళనాడు కొత్త సిఎం విజయ్ మొదటి రోజే మోసం మొదలు పెట్టారు.
`ఖజానా ఖాళీ అని చెప్పకనే చెప్పేశారు.
`ఎన్నికల ముందు రూ. 10 లక్షల కోట్ల అప్పు గురించి విజయ్ కి తెలియదా?
`విజయ్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ. 10 లక్షల కోట్లు కావాలి.
`ఎన్నికల ప్రచారంలో అలవికాని హామీలు ఎందుకిచ్చినట్లు?
`ఎన్నికల ముందు ప్రజలు అతిగా ఆశలు పెట్టుకోవద్దని ఎందుకు చెప్పానట్లు!
`2014 కు ముందు ఏపీ లో జగన్ నిజం చెప్పారు.. ఓడిపోయారు!
`చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచినా అమలు చేయలేదు?
`2019 అలవికాని హామీలిచ్చారు.. గెలిచారు.
`అధికారంలోకి వచ్చి జగన్ చేతులెత్తేశారు.
`మళ్ళీ చంద్రబాబు మళ్ళీ అదే దారి ఎంచుకున్నారు.. గెలిచి పాలిస్తున్నారు.
`తెలంగాణలోనూ అదే జరిగింది.. 2014 కెసిఆర్ అలాగే చెప్పి గెలిచారు.
`2023 లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు!
`వంద రోజుల్లో అమలు చేస్తామని మాట ఇచ్చి గెలిచారు.
`లంకే బిందెలు ఉన్నాయనుకున్నాం.. కానీ కుండలు కూడా లేవని తెల్చేశారు.
`ఇలా హామీలివ్వడం.. ఎన్నికల్లో గెలిచి మాట మార్చడం అందరూ నేర్చుకుంటున్నారు.
`అలాంటి హామీలు అమలు సాధ్యమా కాదా అని ప్రజలు కూడా ఆలోచించడం లేదు.
`అలవికాని హామీలు ఆచరణ సాధ్యం కాదని ఏ ఒక్క మేధావి చెప్పడు.
`ఏ మీడియా ఎన్నికల నాడు ప్రజలను చైతన్యం చేయదు.
`ఎన్నికల ప్రచార ప్రకటనలు వస్తే చాలు.. మీడియాకు అదే పదివేలు?
`గతంలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మేధావులు ప్రజలను చైతన్యం చేసేవారు.
`విస్తృతంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవారు.
`ఇప్పుడు మేధావులు కూడా పార్టీల పరంగా చీలిపోయారు.
`మేధావులు కూడా మేతకు అలవాటు పడ్డారు.
`పదవుల కోసం ఆరాట పడుతున్నారు.
`మేధావి తనాన్ని అమ్ముకుంటుంటున్నారు.
`ప్రజలను పార్టీల పరంగా తప్పు తోవ పట్టిస్తున్నారు.
`సోషల్ మీడియా నిజాలు చెప్పాలని చూసినా సాధ్యం కావడం లేదు.
`ప్రజలు కూడా అసత్యాలనే సత్యాలనుకుంటున్నారు.
`నిజాలు చెప్పే వారిని అబద్దాల కోరులనుకుంటున్నారు!
`ఎన్నికల హామీలకు చట్ట బద్దత కల్పించాలి?
`ఎన్నికల హామీలు రాజ్యాంగ బద్దం చేయాలి!
`ఎన్నికల హామీలు తప్పితే పాలకులకు శిక్షలు పడేలా చట్టం రావాలి!
`అది సాధ్యమయ్యే పని కాదు.. ఏ పార్టీ ఒప్పుకోదు.
`ప్రజలు మారనంత కాలం రాజకీయాలు మార్చడం కష్టం.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఓడ ఎక్కెముందు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనే సామెతను దేశంలో రాజకీయ పార్టీలు నిజం చేస్తున్నాయి. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినుట్లు చేస్తున్నాయి. జనం బలహీనతలను ఆసరా చేసుకుంటున్నాయి. అదికారంలోకి వచ్చి మాట మార్చుతున్నాయి. అలవి కాని హమీలిస్తున్నారు. ఖచ్చితంగా అమలు చేస్తామని ఊదరగొడుతున్నారు. జనం నమ్మేలా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి తర్వాత అమలుపై నీలినీడలు కమ్మేస్తున్నారు. పేదల జీవితాలను త్రిశంకు స్వర్గంలోకి నెట్టేస్తున్నారు. ఇప్ప్పుడైతే గెలుద్దాం. తర్వాత అమలు సంగతి చూద్దామన్నట్లు తయారౌతున్నారు. ఇది ఇప్ప్పుడు అలా మాయ మాటలు చెప్పి అదికారంలోకి రావడమే నయా ట్రెండ్ అనుకుంటున్నారు. పాపం అమాయక ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తున్నారు. ప్రజల బలహీనతలతో ఆటలాడుకుంటున్నామన్న భావన అసలే లేకుండా పోతున్నారు. పైగా జనం నిజం చెబితే వినడం లేదు. హమీల వర్షం కురిపించని పార్టీలను జనమే నమ్మడం లేదు. అలవి కాని హమీలను ఇచ్చే పార్టీలనే నమ్ముతున్నారు. గతంలో ప్రజలు పార్టీలు ఇచ్చే హమీలను బేరీజు వేసుకునేవారు. సాద్యమౌతుందా? లేదా? అని బాగా ఆలోచించుకునేవారు. అప్ప్పుటి బలహీనతలను అప్ప్పుడు అలా వాడుకున్నారు. ఇప్పటి రోజులను బట్టి ఇప్ప్పుడు అలాగే రాజకీయ ఆట ఆడుతున్నారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరంటు ఇస్తామని ప్రచారం విసృతంగా చేసింది. అయినా జనం నమ్మలేదు. ఎందుకంటే అప్ప్పుడున్న కరంటు కష్టాలతో బిల్లులు చెల్లిస్తుంటేనే కరంటు సరిగ్గా రావడం లేదు. ఎంత బిల్లులు చెల్లించినా, ఎప్ప్పుడు వస్తుందో, ఎప్ప్పుడో పోతుందో తెలియడం లేదు. అలాంటప్ప్పుడు ఉచిత కరంటు అనేది సాధ్యం కాదని జనం నిర్ణయించుకున్నారు. అలా ప్రజలు ఆలోచించుకోవడానికి కూడా అప్పటి రాజకీయ పార్టీ తెలుగుదేశం కారణం. ఉచిత కరంటు ఇవ్వడం అంటే కరంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అని తెలుగుదేశం చెప్పింది. కాని అదే కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో మళ్లీ ఉచిత కరంటు ఇస్తామంటే నమ్మారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతులకు ఉచిత కరంటు ఇచ్చారు. దాంతో రాజకీయ పార్టీలు ఇచ్చే హమీల మీద జనం నమ్మకం పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఎన్నికల హమీలను నమ్ముతూ వస్తున్నారు. అలా జనం నమ్మకాన్ని ఎన్నికల్లో ఓట్లుగా మల్చుకుంటున్నారు. ఎన్నికల హమీలను తుంగలో తొక్కుతున్నారు. 2014 ఎన్నికల్లో బిఆరఎస్ పార్టీ అనేక హమీలు ఇచ్చింది. తెలంగాణలో తొలిసారి అదికారంలోకి వచ్చింది. ఏపిలో తెలుగుదేశం కూడా అలాంటి హమీలు ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఏపిలో అలవి కాని హమీలను ఇవ్వలేను అని చెప్పిన జగన్‌ను ఆ ఎన్నికల్లో ఓడించారు. తర్వాత ఎన్నికల్లో అదే జగన్ ఓట్ల కోసం అబద్దాలు చెప్పారు. గెలిచారు. ఇలా జనం నమ్మడం అýవాటు చేసుకున్నారు. రాజకీయ పార్టీలు మోసం చేయడం నేర్చుకున్నారు. దాంతో ప్రజలకు కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్దం కాకుండాపోతోంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఇంకా పరిపాలన మొదలు కాకముందే ఆ రాష్ట్ర సిఎం. విజయ్ మొదటి రోజే తన నుంచి ఎక్కువగా ఆశించొద్దు! అని ప్రకటించారు. ఖజానా ఖాళీగా వుందన్నారు. గత పాలకులు ఇప్పటికే రాష్ట్రంలో 10లక్షల కోట్ల రూపాయల అప్ప్పులు చేశారు. వాటి భారమే గుదిబండగా వుందన్న అర్దం వచ్చేలా విజయ్ మాట్లాడారు. మరి ఎన్నికల ముందు వ్పుియ్కు ఈ విషయం తెలియదా? గత రెండు సంవత్సరాల క్రితం విజయ్‌పార్టీ ప్రకటించారు. సినిమాలు మానేశారు. పూర్తిగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాని ఏనాడు రాష్ట్ర ఆర్ధిక స్ధితి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. స్టాలిన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ పోయారు. అవినీతి పాలన అంతం చేస్తానన్నారు. నీతి వంతమైన పాలన చెబుతూ వచ్చారు. కాని అలవి కాని హమీలు తాను ఇవ్వనని, మేలైన సంక్షేమం అందిస్తానని ఏనాడు చెప్పలేదు. కాని సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ తన మ్యానిఫెస్టోను ప్రకటించారు. వాటి అమలుకు కనీసం 10లక్షల కోట్ల రూపాయలు అవసరమౌతాయి. అయినా ప్రకటించారు. అమలు చేస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజున ఆయన ఇచ్చిన హమీలలో ఆర్ధికపరమైన అంశాలలో ఏ ఒక్కదాని మీద సంతకం చేయలేదు. పైగా తననుంచి ఎక్కువగా ఆశించొద్దని ఒక్కమాటతో తేల్చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. ఆరు గ్యారెంటీలు అంటూ ఎన్నికలకు ఆరు నెలల నుంచి చెప్పడం మొదలు పెట్టారు. ముందు ఐదు గ్యారెంటీలన్నారు. తర్వాత మరో గ్యారెంటీని చేర్చారు. ఆరు గ్యారెంటీలలో మొత్తం 13 గ్యారెంటీలు చేర్చి జనం ముందుకు వచ్చారు. ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డులు పంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామన్నారు. ఒకే ఒక్క గ్యారెంటీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నారు. గత బిఆరఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలలో కొన్ని అమలు చేస్తున్నారు. రైతు బంధు లాంటి విషయంలో ఎన్నికల ముందు మÖడు పంటలకు ఎందుకు ఇవ్వవు అని కేసిఆర్‌ను ప్రశ్నించారు. కాని ఇప్ప్పుడు రెండున్నరేళ్లలో మÖడు సార్లు ఇచ్చారు. సిఎం. రేవంత్ రెడ్డి అదికారంలోకి 100 రొజుల్లోనే అన్ని హమీలు అమలు చేస్తామన్నారు. కాని నెల రోజుల్లోనే తాము లంకెబిందెలు వున్నాయని అనుకున్నాం. కాని ఇక్కడ కుండలు కూడా లేకుండా కేసిఆర్ దోచుకొని పోయాడని ప్రచారం మొదలపెట్టారు. ప్రజలను ఎన్నికల ముందు నమ్మించినట్లే, తర్వాత కూడా నమ్మిస్తూ కాలం గడిపేస్తున్నారు. మాకు ఐదేళ్ల కాలానికి ప్రజలు గెలిపించారు. ఇంకా సమయం వుందని దాటేస్తున్నారు. 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటిస్తే, ఎలా సాధ్యమౌతుందని చెప్పిన కేసిఆర్, ఆ వెంటనే తాము ఇస్తామన్నారు. తర్వాత నిండు అసెంబ్లీలో అలాంటి హమీ ఇవ్వలేదని మాట మార్చారు. సరిగ్గా అదే సమాధానం రేవంత్ సర్కారు కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్దమాడేసింది. ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామనలేదన్నారు. ఆ హమీ ఊసు లేకుండా చేశారు. ఇలా మాయ చేయడం అýవాటు చేస్తున్నారు. జనం కూడా అలవాటు పడుతున్నారు. గతంలో ప్రశ్నించేవారు. కాని ఇప్ప్పుడు ప్రశ్నించినా ప్రయోజనం లేదని వదిలేస్తున్నారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్ప్పుడు చూద్దామనుకుంటున్నారు. ఆనాడు మళ్లీ ఇదే హమీలను నమ్మి మోసపోవడానికి సిద్దంగా వున్నారు. ఇలా జనాన్ని నమ్మించడానికి ఏకంగా రాజకీయ వ్యూహకర్తలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి వందల కోట్లు చెల్లించి, ఉద్దండులైన నాయకులు కూడా వారి మీద ఆదారపడుతున్నారు. ఎన్నికల సాక్షిగా ప్రజలను మోసం చేస్తున్నారు. గెలిచి మాట తప్ప్పుతున్నారు. ఇలాంటి పరిస్ధితుýను గతంలో మేధావులు నిత్యం ప్రశ్నించేవారు. కాని ఇప్ప్పుడు గత పాలకులను నిందించిన మేధావులు సైతం ఇప్ప్పుడు మౌనంగా వుంటున్నారు. మేదావులు కూడా మేత కోసం ఆశపడుతున్నారు. పదవులు మీద మోజు పెంచుకుంటున్నారు. ఎంత సైలెంటుగా వుంటే అంత మేలని భావిస్తున్నారు. ఏదైన పదవి ఆఖరు వరకు రాకపోదా? అని ఎదురుచూస్తున్నారు. గతంలో మాత్రం ప్రజలు ఏ నాయకుడిని ఎన్నుకోవాలో? ఎలాంటి అర్హతలు వున్న నాయకులను ఎన్నుకోవాలన్నదానిపై ప్రజల్లో చైతన్యం కల్పించేవారు. కాని ఇప్ప్పుడు ఆ మేధావులే తమ స్వార్ధం కోసం ప్రజలను తప్ప్పుదారి పట్టిస్తున్నారు. మేధావులు కూడా పార్టీ పరంగా చీలిపోతున్నారు. మేదావులకు ఏ పార్టీతో సంబందం వుండకపోయేది. ఇప్ప్పుడు ఏ మేధావి ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నాడో అనేది కూడా తెలిసిపోతోంది. వాళ్లు కూడా ముసుగు తీసేసుకుంటున్నారు. పార్టీలకు వంత పాడుతున్నారు. ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఎంత తూకం చెల్లిస్తారని చూస్తున్నారు. ప్రకటనలు ఎవరు దండిగా ఇస్తే వారి వార్తలు వండి వారుస్తున్నారు. జనాన్ని నమ్మిస్తున్నారు. ఇలా అన్ని వ్యవస్ధలు దిగజారి పోతున్నాయి. అబద్దాలు రాజ్యమేలేలా చేస్తున్నాయి. అందుకే అలవి కాని హమీలు ఇచ్చిన పార్టీలు గెలుస్తున్నాయి. హమీలు ఇవ్వని పార్టీలు అసమర్ధ పార్టీలుగా మారిపోతున్నాయి. హమీలకు చట్టబద్దతలేదు. రాజ్యాంగ బద్దత అసలే లేదు. కాదు కూడా!! అదంతే జనమింతే!!!
