కష్టాల నిలయం.. సమస్యల వలయం!
పట్టింపు లేని నాయక గణం!
`చింతలు తీర్చే వారు లేక చిందర వందరగా మారిన చిత్రపురి.
`గుక్కెడు నీటికి దిక్కు లేకుండా పోతున్న చిత్రపురి.
`నాయకుడు లేని చిత్రపురి పాలక వర్గం లేక విలవిల లాడుతోంది.
`చిత్రపురి అప్పు కొండలా పేరుకుపోయింది.
`అన్నం పెట్టిన పాపానికి చెదలవాడకి సున్నం పెట్టిన చిత్రపురి.
`సభ్యుల సమస్యలు తీర్చే దిక్కు లేకుండా పోయింది.
`ఎండాకాలంలో తాగునీటి కటకట మొదలైంది.
`చుక్క నిరులేక అందరి గొంతు ఎండిపోతోంది.
`ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారు..సభ్యులు విలవిల లాడుతుంటే చోద్యం చూస్తున్నారు.
`స్పెషల్ ఆఫీసర్ ను అప్పయింట్ చేసి వదిలేశారు!
`చిత్రపురికి సహాయం చేసిన “చదలవాడ”కే టోపీ పెట్టేశారు.
`సాయం చేసే వారు లేకుండా చేశారు.
`4 వేల కుటుంబాలు నీళ్లు లేక అల్లాడుతున్నారు.
`రాజకీయం చేయడానికైతే అందరూ వస్తారు.
`100 బోర్లు వేసిన చుక్క నీటి జడలేదు.
`నీళ్ల సమస్య ఇన్నేళ్ళైనా తీరింది లేదు.
`రిజిస్ట్రేషన్లు ఎప్పుడో ఆగిపోయాయి!
`పెండింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ అటకెక్కింది!
`చేసిన పనికి డబ్బులు రాక కాంట్రాక్టర్లు పనిని ఆపడం జరిగింది.
`కమిటీ లేక జవాబుదారీతనం అక్కడ లేనే లేకుండా పోయింది
`కమిటీ లేక వసూలు ఎక్కడికక్కడ ఆగిపోయింది.
`సభ్యులు డబ్బులు చెల్లించే అవకాశం లేకుండా పోయింది.
`కాపాడిన పాపానికి చదలవాడ శ్రీనివాస్ రావుకు అప్పులు ఎగ్గొడుతున్నారు.
`కమిటీ రద్దయినప్పటి నుంచి ఆరు నెలల సమయంలో జరిగిన లాస్ ఎవరు భర్తీ చేస్తారు.
`నాయకులు చేస్తున్న అన్యాయానికి సభ్యులు ఇబ్బంది పడాలా!
`సభ్యులపై అదనంగా భారం పడకుండా ఉండదా!
`ఇప్పటికే కోలుకోలేని ఆర్థిక సమస్యలతో చిత్రపురి అల్లాడిపోతోంది!
`కొట్టుమిట్టాడుతున్న చిత్రపురి ని ఇంకా ఆర్థిక ఊబిలోకి తీసుకు వెళ్తున్న ఆ కొందరు సభ్యులు ఎవరు?
`ఎన్నికలు ఆపడం ఎవరికి లాభం! సభ్యుల జీవితాలు అగమ్య గోచరం!
హైదరాబాద్, నేటిధాత్రి:
చిత్రపురిని అనాధను చేస్తున్నారు. సమస్యల నియలంగా మార్చుతున్నారు. కష్టాల కడలిని చేసి వదిలిపెడుతున్నారు. పట్టించుకునే దిక్కులేకుండా చేస్తున్నారు. పట్టింపు లేని వారంతా పెత్తనం కోసం ఆరాటపడుతుంటారు. పరిష్కారానికి మాత్రం ఆమడ దూరంలో వుంటారు. రాజకీయాలు చేస్తారు. వ్యవస్ధను అస్తవ్యస్తం చేస్తారు. కాని కార్మికులు కష్టాలు ఎదుర్కొంటుంటే చూసే వారు వుండరు. అడిగేవారుండరు. అసలు చిత్రపురిని ఆదుకుందామన్న ఆలోచనే చేయరు. కాని పైకి మాత్రం గొప్పలు చెప్ప్పుకోవడానికి, పెత్తనం చేయడానికి మాత్రం పెద్దలంతా ఏకమౌతారు. సమస్యలు పట్టించుకునేవారి మీద పగసాదిస్తారు. కార్మికుల ఉసురు పోసుకుంటున్నారు. చిత్రపురిలో ఆగిన నిర్మాణాలను పట్టించుకునే దిక్కులేకుండా చేశారు. పాలక వర్గం లేకుండా చేశారు. పని చేసేవారిని దూరం పెట్టారు. ఆరు నెలలుగా ఎన్నికలు లేకుండా చూస్తున్నారు. కార్మికులు అష్టకష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. పెద్దలకు అన్ని సౌకర్యాలున్నాయి. సినీ రంగాన్ని నమ్ముకొని ఆకాశమంత ఎత్తులో కట్టడాలను చూసి కార్మికులు స్వర్గమనుకొని వచ్చారు. చిత్రపురి పెద్దలు మాత్రం కార్మికులకు నరకం చూపిస్తున్నారు. రాని వాళ్లు ఇండ్లు రాలేదని ఏడుస్తున్నారు. వచ్చిన వారు వుండేలేక, వెళ్లలేక నరకం చూస్తున్నారు. కారణం పాలన పడకేసింది. పాలించేవారు లేక చిత్రపురి సమస్యల పురిగా మారిపోయింది. కష్టాల నియలయంగా మారిపోయింది. సమస్యల వలయంలో చిక్కుకున్నది. చిత్రపురి చింతలు తీర్చే నాయకుడు లేక చిందరవందరగా మారిపోయింది. సుమారు 4వేల కుటుంబాలు నివాసం వుండే చిత్రపురిలో కనీసం మంచీనీళ్లు లేవంటే ఎవరైనా నమ్ముతారా? బైట ప్రపంచానికి అందమైన ఊహాలోకంలా కనిపించే చిత్రపురిలో గుక్కెడు నీరు దొరకదని తెలిస్తే నమ్మశక్యంగా వుంటుందా? కాని అది నిజం. ఎండాకాలమొస్తే ఎడారిలో లేనంత నీటి కష్టం వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ఇదీ చిత్రపురిలో వాస్తవ పరిస్ధితి. కాని పట్టించుకునేందుకు ఏ సినీ పెద్ద రాడు. అండగా వుండేందుకు ఎవరూ లేరు. అటో, ఇటో పాలక వర్గం వున్నా, ఏదో కొంత ఊరట కనిపించేది. చిత్రపురి సొసైటీ తరుపున ఏదో కార్యక్రమం నిర్వహించే పరిస్ధితి వుండేది. కాని గత పాలక వర్గం గడువు ముసిగింది. ఆరు నెలలు దాటుతోంది. అయినా పెద్దలు సోసైటీకి ఎన్నికలు నిర్వహించాలన్న సోయి లేదు. సినీ పెద్దలు తలుచుకుంటే ఒక్క క్షణం పని. కాని సంవత్సరాలు గడుపుతున్నారు. కార్మికుల కష్టం తీర్చడం సినీ పెద్దలకు పెద్ద సమస్య కాదు. సినీ పెద్దలు నలుగురు తల్చుకుంటే చాలు. అయినా ఎవరూ ముందుకు రారు. చిత్రపురిలో కూడా ఆ సినీ పెద్దలకు వుండాల్సిన చోటు వండనే వుంది. వారికి కూడా ఆవాసాలు వున్నాయి. కనీసం వాటి గురించైనా ఆలోచించే తీరిక పెద్దలకు లేకుండాపోయింది. చిత్రపురి ప్రాంతంలో భూగర్భజలాలు పాతాళంలో కూడా కనిపించడం లేదు. ఇప్పటికే వంద బోర్లు వేశారు. కాని వాటి నుంచి వచ్చే నీరు ఏ మÖలకు సరిపోవడం లేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏ ఒక్క బోరు నుంచి చుక్క నీరు రాదు. ఇది సినీ పెద్దలందరికీ తెలుసు. అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లరు. కార్మికుల కష్టం పట్టించుకోరు. సినీ పెద్దలు తమగా మాట సాయం చేస్తే చాలు. ప్రభుత్వ పెద్దలతో చెప్పి నీటి సౌకర్యం కల్పించడం పెద్ద పని కాదు. అయినా వాళ్లేవరు ముందుకు రావడం లేదు. దశాబ్దాలుగా కార్మికులు నీటికట అనుభవిస్తూనే వున్నారు. మంచినీటి గోస ఎదుర్కొంటున్నారు. ఇదిలా వుంటే చిత్రపురి అప్ప్పు కొండలా పేరుకుపోయింది. దానిని తీర్చడానికి కూడా సొసైటీలో రూపాయి లేదు. కార్మికుల కష్టం చూడలేక గతంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సినీ నిర్మాత చదలవాడ ముందుకొచ్చి బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు. చిత్ర నిర్మాణానికి అవసరమైన సొమ్ము కోసం బ్యాంకుకు గ్యారెంటీ పడ్డారు. పైగా తన సొంత నిధులు కోట్లలో ఇచ్చారు. అటు బ్యాంకులకు రూపాయి కట్టిందిలేదు. ఇటు చదలవాడకు రూపాయి తిరిగి ఇచ్చింది లేదు. కనీసం చదలవాడ ఇచ్చిన సొమ్మలో సగం బాకీ తీర్చినా, ఆయన మళ్లీ ఏ సాయం చేయడానికైనా ముందుకొచ్చేవారు. ముందుకు వచ్చిన వారికి సున్నం పెడితే మళ్లీ ఎవరు ముందుకొస్తారు! ఎందుకు ముందుకొస్తారు!! చిత్రపురి సభ్యుల సమస్యలు తెలుసుకునేవారు లేకుండాపోయారు. తీర్చేవారు అసలే లేకుండాపోయారు. చిత్రపురిని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. అసలు చిత్రపురికి ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నవారు ఎవరు? ఈ ప్రశ్నకు అందరికీ సమాదానం తెలుసు. కాని ఎవరూ ముందుకు వచ్చి ప్రశ్నించరు. ప్రశ్నిస్తే వాళ్లు శత్రువులౌతారు. ఇలా చిత్రపురిని చేతుల్లో పెట్టుకొని కొంత మంది ఆడిస్తున్నారు. సభ్యులను అల్లాడిస్తున్నారు. వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. చిత్రపురి సొసైటీ పాలక మండలి గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్‌ను అప్పాయింట్ చేసింది. కాని లాభం ఏముంది? ఆ అదికారి సమస్యలు తీర్చే శక్తి వుండదు. ప్రభుత్వానికి తెలియకుండా ఏ పని చేయలేరు. సభ్యులు కోరుతున్నా, ఉద్యోగిగా ఆయనకు కొన్ని పరిమితులుంటాయి. వాటిని దాటి ఆ స్పెషల్ ఆఫీసర్ ముందుకు వెళ్లలేరు. తేనె తుట్టెను కదిలించేందుకు ఏ అదికారి ఇష్టపడురు. తర్వాత ప్రతి సంధర్భంలోనూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరాన్ని తెచ్చుకోలేరు. అదే పాలక మండలి వుంటే సొసైటీ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చే అవకాశం వుంటుంది. సర్వసభ్య సమావేశాలలో కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. కాని పాలక మండలి లేదు. ఎన్నికలు ఎప్ప్పుడు జరుగుతాయో తెలియదు. సభ్యుల సమస్యలు తీరవు. చిత్రపురికి సాయం చేసిన చదలవాడకు ఇప్పటికే టోపీ పెట్టేశారు. రాజకీయం చేయడానికో, పెత్తనం చేయడానికో అందరూ వస్తారు. కాని సమస్యల పరిష్కారం కోసం ఎవరూ ముందుకు రారు. చిత్రపురిలో రిజిస్ట్రేషన్లు ఎప్ప్పుడో ఆగిపోయాయి. కొనుగోళ్లు ఆగిపోయాయి. నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారయ్యాయి. నిధులు లేక కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. చేసిన నిర్మాణాలకు రూపాయి రావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఎంత కాలం తమ చేతుల్లో నుంచి నిర్మాణ వ్యయం భరిస్తామని అంటున్నారు. తెచ్చిన అప్ప్పులకు తాము వడ్డీలకు వడ్డీలు చెల్లిస్తున్నామని అంటున్నారు. చిత్రపురి నిర్మాణాలకు చెందిన డబ్బులు ఎప్ప్పుడొస్తాయో అర్దం కాక తలలు పట్టుకుంటున్నారు. అప్ప్పుల బాధలు తట్టుకోలేక కాంట్రాక్టర్లు కూడా ఎక్కడో తలదాచుకునే పరిస్దితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలక మండలి లేక, జవాబు దారీ తనం లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సభ్యులనుంచి వసూలు చేయాల్సిన సొమ్ములు కూడా రాకుండాపోయాయి. సభ్యులు చెల్లించాల్సిన సొమ్ము ఎక్కడ చెల్లించాలో అర్దం కావడం లేదంటున్నారు. వెంటనే ఎన్నికలు జరిపిస్తే, మళ్లీ కొత్త పాలక మండలి వస్తే చిత్రపురి సమస్యలు తీరవు. నాయకులు చేస్తున్న అన్యాయానికి సభ్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో వసూలు కాని, చేయకపోవడం వల్ల సభ్యులపై భవిష్యత్తులో అదనపు బారం పడేలా కూడా వుంది. ఆర్ధిక సమస్యలతో అల్లాడుతున్న చిత్రపురిని మరింత కష్టాల్లోకి నెట్టేయడమే అవుతుంది. అందువల్ల పెద్దలంతా ఒక ఆలోచనకు వచ్చి ,వెంటనే పాలక మండలికి ఎన్నికలు నిర్వహిస్తే తప్ప శుభం కార్డు పడదు. చిత్రపురిలో నెలకొన్న సమస్యలు తీరవు.
